Pages

Friday 28 September 2012

ఆత్మహత్యలు....విడాకులు.....కారణం ఏంటి????


నేను ఇలాంటి ఒక అంశం గురించి మాట్లాడటం  కరెక్టో  కాదో నాకు తెలియదు   కానీ....నేను పత్రికల్లో చదువుతున్న వార్తలు,టీవీ లో  చూసిన న్యూస్, హత్య...ఆత్మహత్య కేసులు ,ఒక ఫోరంలో  చదివిన కొన్ని సమస్యలు,కొన్ని మెయిల్స్,ఇలా రాయటానికి కారణం.
       
     అసలు దీనికి కారణాలు ఏంటి....??? అని తెలుసుకోవటానికి చేసిన చిన్న ప్రయత్నంలో నేను తెలుసుకున్న కొన్ని కారణాలు,పరిష్కారాలు ఇలా మీతో పంచుకుంటున్నా.....

ఇక నేను చూసిన సమస్యలు చెప్తా చూడండి...
1. ఒక అమ్మాయి  ఇలా రాసింది..."నేను మా వారు ఆరు సంవత్సరాలు ప్రేమించుకుని,పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం.... ఇద్దరమే సిటీలో కాపురం పెట్టాం  ...ఇద్దరమూ ఉద్యోగం చేస్తున్నాం ..పెళ్లి అయిన 3  నెలలకే మా వారు ప్రాజెక్ట్ పని మీద అమెరికా వెళ్ళిపోయారు....ఎప్పుడు ఫోన్ చేసిన busy గా ఉండేవారు....పోనీ పగలు మాట్లాడుదాం అంటే నేను ఆఫీసులో busy గా ఉండేదాన్ని... అలా నెల గడిచాక నేను చాల ఒంటరితనానికి లోనయ్యాను...అదే సమయంలో నాకు మా బాస్తో పరిచయం పెరిగింది..ఆయనకి పెళ్లి అయ్యి,ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు....ఆఫీసు పనుల్లో నాకు చాలా సహాయపడేవారు...అలా మా సాన్నిహిత్యం ఆఫీసు పనుల నుండి పెర్సనల్ పనుల వరకు వచ్చింది...అని పెర్సనల్ విషయాలు ఆయనకీ చెప్పేదాన్ని....ఇంతలోనే 3నెలలు గడిచిపోయి అమెరికా వెళ్ళిన మా వారు ఇండియా వచ్చేసారు....మా బాస్కి నేను చేసిన smsలు చూసారు...నేను మా బాస్ని  ఒక స్నేహితుడిలానే భావించాను...అంతకుమించి ఏమి లేదు.. ఇదే  మా వారితో కూడా చెప్పాను....మీరు లేనప్పుడు నేను చాలా 'లోన్లీ' గా ఫీల్ అయ్యాను....నాకు హెల్ప్ చేయటానికి ఎవరు లేరు, తను ఒక ఫ్రెండ్లా నాకు హెల్ప్ చేసారు అంతే  అని....మా వారు నన్ను ఏమి అనటం లేదు కానీ.....నాతో సరిగా ఉండటం లేదు,సరిగా మాట్లాడటంలేదు....... అసలు అమెరికా నుండి నా దగ్గరకి వచ్చేసిన సంతోషమే లేదు తనలో...నీరసంగా ఉంటున్నారు....ఏదైనా అవసరానికి తప్ప మాట్లాడటం లేదు...తను నా పక్కనే ఉండి నన్ను ఒంటరిదాన్ని చేసారు...నా జీవితం నారకమైపోయింది..... నవ్వుతు,నవ్విస్తూ ఉండే మా వారు ఇలా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నా.....నా సమస్యకి చావు ఒక్కటే పరిష్కారం అనిపిస్తుంది."

2. ఒక అబ్బాయి ఇలా రాసాడు..."నాకు కొత్తగా పెళ్లి అయ్యింది....నేను ఉద్యోగం చేస్తున్నాను...నా    భార్య ఇంట్లోనే ఉంటుంది....  నా  ఆఫీసు లో కొలీగ్ ఒక అమ్మాయి,నాకు మంచి స్నేహితురాలు కూడా . నాతోనే ఆఫీసుకి వస్తుంది....రోజు కారులో వెళతాం...తనకి ఆఫీసు పనుల్లో నేను సహాయం చేస్తాను...వారాంతాల్లో కాలవం కాబట్టి ఫోన్ చేస్తూ ఉంటుంది...అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉంటుంది....ఎప్పుడైనా పెర్సనల్ పనుల్లో అవసరం పడితే కూడా ఫోన్ చేస్తుంది...ఇది నా పెళ్ళికి ముందు నుండి జరుగుతుంది...కానీ ఇప్పుడు నా  భార్యకి ఇది నచ్చటం లేదు...'ఆఫీసు బస్సు ఉండగా తను నీతో ఎందుకు వస్తుంది....వారాంతాలు కూడా మాట్లాడేది ఏం  ఉంటుంది... అర్థ రాత్రుళ్ళు ఫోన్ ఎందుకు చేస్తుంది..... తన పెర్సనల్ పనులు మీరెందుకు చేయాలి'...ఇలా అడుగుతుంది....ఏడుస్తుంది కూడా....కానీ అమ్మాయి నాకు just కొలీగ్ మాత్రమే...అని ఎంత చెప్పినా  నా భార్య  అర్థం చేసుకోవటంలేదు......... సమస్య వల్ల మేము సంతోషంగా ఉండలేకపోతున్నాం.... ఆ అమ్మాయికి సమస్య తెలియదు కాబట్టి తను ఫోన్ చేస్తూ ఉంటుంది ,నా భార్యకి తెలియకుండా మాట్లాడాల్సి వస్తుంది ....నేను ఏం చేయాలి ????

దానికి ఒక పెద్దాయన  ఇలా సమాదానం  ఇలా చెప్పారు.....

"ఈ రెండు సమస్యలలో ఒకటి కామన్...అది ఏంటంటే.....'opposite sex ' వాళ్ళతో friendship .....  నువ్వు ఒక అమ్మాయి సహాయం తీసుకోవచ్చు....లా  తీసుకుని ఉంటే  మీ వారికి   కోపం కూడా వచ్చేది కాదు....అక్కడ నువ్వు చెప్పిన కారణం lonliness ... అది ఒక ఫ్రెండ్ ద్వారా పోతుంది అంటే ఫ్రెండ్ అమ్మాయి అయి ఉండచ్చు కదా???....ఇక అమ్మాయిలుఅబ్బాయిలు స్నేహం చేయకూడదు...లా చేయటం చాలా పెద్ద నేరం,ఘోరం అని నేను చెప్పను కానీ...దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది...పర్సనల్ విషయాలు  చెర్చిం చుకోవటం...పర్సనల్ పనులు చేయటం,చేయించుకోవటం తప్పే.. నేను ఇక్కడ స్త్రీలని తక్కువ చేయటం అని కాదుగానీ..... మగాళ్ళు(అందరు కాకపోవచ్చు),అమ్మాయే చనువిస్తుంటే మనకేంటి అనుకుంటారు....అందరు మంచివాళ్ళే ఉండరు కదా  లోకంలో...."జిహ్వకో రుచి...పుర్రెకో బుద్ధి" అన్నారు....ఎవరి బుద్ధి ఎలాంటిదో....అందుకే అమ్మాయిలు వాళ్ళ జాగర్తలో వాళ్ళు ఉండటం మంచిది.....ఇక బాస్ కదా  ఏం అనుకుంటారో...అనే మొహమాటం ఉంటే.... వాళ్ళ సహాయాన్ని  సున్నితంగా తిరస్కరించటం నేర్చుకోవాలి... పోనీ  నువ్వు  బాస్ని ఒక స్నేహితుడి లగానే అనుకుని ఉంటే.... ఒకసారైన ఫోనులో మీవారికి చెప్పి ఉండాలి ఇలా నాకు ఒక మంచి స్నేహితుడు దొరికాడు....చాల సహాయం చేస్తున్నాడు అని....అప్పుడే ఆయనకీ ఇలాంటి స్నేహాలు ఇష్టమో లేదో తెలిసేది....  అయినా నువ్వు  మీవారు   లేకుండా ఒంటరితనం అనుభవించి ఉంటే....దేశంకానిదేశంలో ఉన్న మీవారు కూడా ఒంటరి తనం అనుభవించి ఉంటారు కదా....అలాగే ఆయన కూడా వేరొక అమ్మాయికి నేను సహాయం చేశాను అంటే  నువ్వు   ఊరుకునేదానివా  చెప్పు,చచ్చిపోవటం ఒక్కటే సమాధానం కాదు....మీవారితో సన్నిహితంగా ఉండు....."అని చెప్పారు 


అది చదివిన నాకు ఇలా అనిపించింది....అవును నిజమే... ఇప్పుడు మన రెండో సమస్యలో సరిగ్గా అదే జరుగుతోంది.....ఒక అబ్బాయి ఒక అమ్మాయికి సహాయం చేయటం బార్య సహించటం లేదు.... అనుకుని మల్లి చదవటం మొదలెట్టా........ 

"అబ్బాయ్ ఇక నువ్వు ,కారు షేర్ చేసుకోవటం వరకు పరవాలేదు....ఆఫీసు పనుల్లో సహాయం చేయటం లోను తప్పులేదు......కానీ 5 రోజులు ఆఫీసులో కలిసే అమ్మాయి, మళ్లీ సెలవు రోజుల్లో కూడా, అవసరం లేకపోయినా ఫోన్ చేయటం,ఇంటికి రావటం తప్పు...అలాంటివి avoid చేయకపోవటం  నీవు చేస్తున్న తప్పు....అయినా భార్యకి తెలియకుండా మాట్లాడాల్సిన ఖర్మ ఏం పట్టిందయ్యా నీకు!!!  ఆ అమ్మాయికి  చెప్పేయ్  వారాంతాల్లో నా భార్యతో బిజీగా ఉంటా అని....అయ్యో స్నేహం చెడిపోతుంది....అనుకుంటే సున్నితంగానే తిరస్కరించవచ్చు......'నేను బిజీ గా ఉన్నాను ఆఫీసు లో మాట్లాడుదాం అని' అయినా మంచి అమ్మాయే అయితే తనకే తెలియాలి కొత్తగా పెళ్లి  అయిన  వాళ్ళని ఇలా ఊరికే విసిగింవద్దు అని.....అది  నువ్వు  కూడా తెలుసుకోవాలి.... ఎందుకంటే....ఇక్కడ కూడా (షేం టు షేం) పుర్రెకో బుద్ధి...అందరు అమ్మాయిలు మంచివాళ్ళే అని కూడా చెప్పలేం..."
                   అని పెద్దాయన కాస్త ఘాటుగా సమాధానం ఇచ్చారు....

ఇక ఒకావిడ ఇద్దరికి ఇంచుమించు ఒకేలా ఇలా చెప్పారు..

"ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి మీరు మీ బాగస్వామి స్థానంలో ఉంది ఆలోచిస్తే తెలుస్తుంది....మీరు చేసినట్టే వాళ్ళు చేసుంటే మీరు ఎం చేసేవారు....మీ స్పందన ఎలా ఉండేది...అని ఆలోచిస్తే మీకే అర్ధం అవుతుంది... మీ భాగస్వామి అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారో..."

ఇలా సమాదానాలన్ని చదివిన నాకు ఇలాంటి  సమస్యలకు  కొన్ని ముక్యమైన కారణాలు  తెలిసాయ్

అందులో...ఇంకో ముక్యమైన సమస్య ఏంటంటే......."Nuclear families "

ఒక 60 ఏళ్ళ వయసున్న  పెద్దావిడ చెప్పిన కారణం ఇది... 

"చిన్న కుటుంబం చింతలేని కుటుంబం" అంటే ఇద్దరు పిల్లలు చాలు అని.....కానీ కాలం అమ్మాయిలు "భర్త,తను,ఇద్దరు పిల్లలు"..ఇదే చింతలేని కుటుంబం అనుకుంటున్నారు కాబోలు....అత్తమామలతో కలిసి ఉండటానికి అస్సలు ఇష్టపడటం లేదు( అందరు కాదు కానీ చాలా కేసెస్లో)....... మా  రోజుల్లో సమస్య వచ్చినా  పెద్దవాళ్ళు చూసుకునేవాళ్ళు..... పరిష్కరించేవాళ్ళు.... నచ్చచెప్పే వాళ్ళు.... రోజుల్లో చెప్పేవాళ్ళు లేక....పెద్దవాళ్ళు కలగజేసుకునే లోగానే.....సమస్యని పెద్దది చేసుకుని....ఒకరిని ఒకరు కించపరిచే  మాటలు అనుకుని....మనసు విరిగి...ఎవరు ఎం చెప్పినా  వాళ్ళు అర్ధం చేసుకునే స్థితిలో ఉండరు..." అని 

                                   

మరొకరి కామెంట్ ఏంటంటే 

"ఈ రోజుల్లోని మన జీవనశైలి(lifestyle ).....బిజీ లైఫ్...బాగస్వామితో రోజుకి ఒక గంట కూడా మనసారా మాట్లాడుకోలేని పరిస్థితి.....వీకెండ్స్ అంటారు కానీ ఏవో పనులు....ఒకరి మీద ఒకరికి నమ్మకం కలగటానికి,అది పెరగటానికి....ముందు ఒకరి గురించి ఒకరికి పూర్తిగా తెలియాలి....ఇప్పుడు సమస్య అదే..."అవగానారాహిత్యం"...అసలు మాట్లాడుకునే సమయమే లేకపోతే ఇక అవగాహనా మాట ఎక్కడిది??"

ఇక అందరూ కలిసి final గా conclude చేసింది  ఏంటంటే....

"ఎవరైనా సరే....ఆడైనా,మగైనా స్నేహాన్ని స్నేహంగానే ఉండనీయటం మంచిది ఆడ మగ స్నేహం చేయటం తప్పు కాదు....కానీ కొన్ని హద్దులు,పరిమితులు ఉన్నాయ్ ...ఆఫీసు విషయాలు(పనులు,టెన్షన్) ఆఫీసు లోనే వదిలేసి రావాలి ....అలాగే ఇంటి విషయాలు కూడా ఆఫీసుకి పట్టుకేల్లద్దు.....
ఇక సలహాలు తీసుకోవటం నేరమేమి కాదు....ఇలాంటి ఒక సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులను లేదా పెద్దలను సంప్రదించటంలో తప్పేమీ  లేదు..అనుభవంగలవారు కాబట్టి చక్కదిద్దుతారు....
ఇక వీలైనంత ఎక్కువ  సమయం బాగస్వామితో గడపటానికి ప్రయత్నించాలీ ....ఉన్న కాస్త సమయంలో ఇద్దరు కలిసి పని చేసుకోవాలి.... విషయము దాచకుండా చర్చించుకోవాలి....ఒకరి గురించి ఒకరు తెలుసుకోవటానికి ప్రయత్నించాలి....
                                                          
ఇక ఇలాంటి స్నేహాలు  బాగస్వామికి ఉండటం నచ్చకపోతే....నచ్చకపోతే ఏమిటి???? తన బాగస్వామి,మరొకరితో  మితిమీరి సన్నిహితంగా ఉండటం ఎవరు మాత్రం ఇష్టపడతారు....కానీ...తెలిసినప్పుడు పెద్ద రాద్ధాంతం చేసి....మనసువిరిగే మాటలు అనుకోవటం కంటే.....ఇలాంటి సున్నితమైన విషయాలని మొదటిలోనే  సున్నితంగానే handle చేయటం మంచిది.. బాగస్వామి చేసే చిన్న చిన్న తప్పులను క్షమించటం...వాళ్ళని ప్రేమించటం నేర్చుకోవాలి....కాదని వాటిని పెద్దవి చేస్తే.... దూరం పెరుగుతుంది..
.. ఎవరైనా సరే తప్పులని మొదటిలోనే సరిదిద్దుకోవాలి... చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు..
 జీవితంలో 'కుటుంబం' కన్నా ఎక్కువ ఎవరు కాదు, స్నేహము కాదు...స్నేహితులు అంటే మన మంచి కోరుకునేవాళ్ళు, మన కాపురంలో, కుటుంబంలో కలహాలు వస్తుంటే చూసేవాళ్ళు స్నేహితులు కాదు,అది స్నేహమూ కాదు."



నోట్:' controversial  discussions  ' చేయాలనే ఉద్దేశం లేదు.... మధ్య కాలం లో ఇలాంటివి చాలా ఎక్కువ చూస్తున్నాను అందుకే రాయాలనిపించింది...ఎవరిని కించపరచటానికి రాయలేదు...నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి...ఒకరిలోనైన మార్పు తేగలిగితే, ఒకరికైనా ఉపయోగ పడితే  సంతోషం....నచ్చకపోతే నన్ను క్షమించి వదిలేయండి....
 

View Count




Useful Links