" ఎన్నోకలలతో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి, భర్తకి ప్రేమని పంచి
ప్రతిఫలంగా ప్రేమని ఆశించి, అది అందనప్పుడు పడే బాధేంటో నీకు తెలుసా????
నాకు తెలుసు....
ఎవరికీ చెప్పుకోలేక, ఏడుస్తూ పడుకున్న రాత్రుళ్ళు, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోతాయ్ అని నీకు తెలుసా??? నాకు తెలుసు....
అత్తమామలని సొంత
తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నా...'వాళ్ళు ఎప్పుడు చస్తారా అని ఎదురు
చూస్తున్నావ్' అని భర్త సూటిపోటి మాటలు అంటుంటే...మనసు పడే మధన ఏంటో నీకు
తెలుసా??? నాకు తెలుసు....
భర్త సుఖంగా సంతోషంగా ఉండాలని ఎన్నో ఉపవాసాలు చేసే అమ్మాయిని, తన భర్తే , నేను సుఖంగా ఉంటే నువ్వు ఓరవలేవు అన్నప్పుడు...దేవుడిపై ఉన్న నమ్మకం కూడా కరిగిపోతుందని నీకు తెలుసా??? నాకు తెలుసు....
దేవుడు కూడా దయతలచడం లేదని, ఏ దిక్కు లేక తల్లిదండ్రులే దిక్కు అనుకుని...'అమ్మ నేను సుఖంగా లేను...నాన్నా నేను ఇక అక్కడ ఉండలేను' అని మొరపెట్టుకున్నప్పుడు.....పిల్లల మొహం చూసైనా సర్దుకుపో తల్లి...అతను
మగాడు....ఎం చేసినా చెల్లుతుంది...ఆడపిల్లవి నువ్వే
సర్దుకుపోవాలి....ఎప్పటికైనా అతనే నీకు దిక్కు...ఇక అదే నీ ఇల్లు....వెళ్ళు
తల్లి అన్ని అవే సర్దుకుంటాయ్...అని పైకి ధైర్యం చెబుతూ...ఏమి చేయలేక
లోలోపల వాళ్ళు పడే బాధ చూస్తే..ఆ గుండె పడే వేదన ఏంటో నీకు తెలుసా??? నాకు తెలుసు.....
ఆత్మాభిమానం చంపుకుని..మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టి
జీవస్చవంలా బ్రతుకుతుంటే......'ఎలా ఉన్నావ్' అని నా ప్రాణ స్నేహితురాలు అడిగినప్పుడు... "fine, all is well" అని
రాని చిరునవ్వుని పెదవులకి పులుముకుని, పైకి వచ్చే కన్నీళ్ళని ఆపినప్పుడు....నరనరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధ నీకు తెలుసా??? నాకు తెలుసు....నాకు మాత్రమే తెలుసు....""
...చదువుతుంటేనే గుండె భారంగా అనిపిస్తోంది...కదా??? ఎవరో తెలియని అమ్మాయి రాసింది చదివిన మీకే అలా ఉంటే...నా ప్రాణ స్నేహితురాలు ఇలా రాసుకుంది అని తెలిసి నాకు ఒక్క సారి ప్రపంచమంతా తలక్రిందులైనట్టు అనిపించింది....
ఇలా
చదువుతుండగానే....hey కావ్య....ఇదిగోనే నీ special coffee అంటూ
వచ్చింది....వెనక్కి తిరిగి చూసాను....పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ
చేరగనివ్వని నా స్నేహితురాలు....ఎన్నో విషయాల్లో నాకు inspiration...నాకు
ఎన్నో సలహాలు ఇచ్చిన నా స్నేహితురాలి మనసులో ఇంత బాధ దాగి ఉందా??? అని తన
మొహంలోకి చూస్తూ నిలబడిపోయా...అంతే...నా చేతినుండి తను
రాసుకున్న... " Letters to GOD " అనే title ఉన్న
డైరీని లాక్కుని,
ఇదెందుకు తీసావ్? అంది కంగారుగా....
ఇక ఆ విషయం గురించి ఒక్క మాట కూడా
మాట్లాడనివ్వలేదు....ఏదైనా అడిగితే ఏడుపు....ఏడిపించటం ఎందుకులే....కాస్త
కుదుటపడితే తనే చెప్తుంది అనుకుని ఇంటికి వచ్చేసా...
ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం ఎలా ఉంటామో మీకు seperate గా చెప్పాల్సిన పని
లేదుగా...రోడ్ మీద జరిగిన చిన్న విషయానికే (మన సహాయం పోస్ట్ లో చెప్పాగా)
గంటలు గంటలు thinke నాకు .... నా చిన్నప్పటినుంచి కలిసి ఉన్న
స్నేహితురాలి గురించి ఇలా తెలియటం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి....అవే
ఆలోచనలు, నిద్ర పట్టదు...ఆ diary నే గుర్తొస్తోంది...అందులోని మాటల
echos వినిపిస్తూనే ఉన్నాయ్...అలా ఆలోచిస్తూ ఒక్కసారి గతంలోకి
వెళ్ళిపోయా....(సినిమాలో చూపించినట్టే నా ముందు గిరగిరా ఒక చక్రం తిరిగింది )
దివ్య శృతి ....ఆనందానికి, అల్లరికి మారుపేరు......తను చేసే అల్లరి తట్టుకోవటం ఒకింత కష్టమే...ఒక్కోసారి అది
చేసే పనులకి కోపం కూడా వచ్చేది....మన కోపాన్ని మన మనసు కన్నా fast గా
కనిపెట్టేసి ఒక cute smile ఇచ్చేది....అది చూసాక ఇక మనం ఏమి అనలేం...తనతో
పాటే నవ్వేయటం తప్ప. తన స్మైల్ తనకంటే అందంగా ఉంటుంది మరి...
అలా అని అల్లరి
పిల్ల అనలేమండోయ్...చాలా తెలివైనది...చదువులో ఎప్పుడూ ముందుండేది....ఎంతో
గొప్ప కలలు కనేది...బాగా చదువుకోవాలి...మంచి ఉద్యోగం చేయాలి....ఉద్యోగం
చేసి మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు అంతా..తను మాత్రం ఎప్పుడూ
అనేది...'నాన్న నా కోసం చాలా కష్ట పడ్డారు, అప్పు కూడా చేసారు , job చేసి తన ప్రాబ్లం
స్ అన్ని తీర్చేసి, తనకి రెస్ట్ ఇవ్వాలి' అని. ఇలా అన్నో ఆశలు, ఆశయాలు తనవి..
అలా మేము ఫైనల్ ఇయర్ లో ఉండగా ఒకరోజు తను నా దగ్గరకి వచ్చి....'కావ్య నాకో
హెల్ప్ చేస్తావా' అంది....'నేనా??? నువ్వు అడగటం నేను
చేయకపోవటమా...చెప్పు' అన్నాను....'నాన్న నాకు
పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ...నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు....నా ప్రాబ్లం నీకు తెలుసు..పెళ్లి అయితే నేను అనుకున్నదేది చేయలేను, నాన్నతో మాట్లాడి ఎలా అయినా ఒప్పించవా ఇప్పుడే వద్దని ' అంది...
నేను భయపడుతూనే...తనకోసం....లేనిపెద్ధరికాన్ని తెచ్చుకుని...అంకుల్ ని కలవటానికి వెళ్ళా...నన్ను చూస్తూనే...."ఏంటి రా కావ్య, దివ్య
పెళ్ళంటే వద్దంటోంది, విషయం ఏంటో కనుక్కో అన్నారు"...అప్పుడు నేను.
" నేను
అది మాట్లాడటానికే వచ్చా అంకుల్, తను పెళ్లి వద్దు అనటం లేదు....ఇప్పుడే
వద్దంటోంది" అని తన అనుకున్నవన్నీ అంకుల్ కి చెప్పాను'. సరే అయితే తన
ఇష్టం, ఉద్యోగం వచ్చాకే చూద్దాంలే...మంచి సంబంధం అని ఆలోచించాను అంతే
అన్నారు అంకుల్ ....ఒక్కగానొక్క కూతురు నొప్పించలేక....అలా అని
వెళ్ళిపోయారు అంకుల్.
ఇది జరిగాక కొన్నాళ్ళు అంతా బాగానే ఉంది..ఒకరోజు
నేనూ ,దివ్య వాళ్ళింట్లో
చదువుకుంటూ ఉండగా ...అంకుల్ వచ్చి...."వాళ్ళతో
, మాట్లాడానురా, మీరు job కోసమే గా పెళ్లి వద్దన్నారు....వాళ్ళు పెళ్లి
అయ్యాక job చేయటానికి ఒప్పుకున్నారు. అబ్బాయి కూడా చాలా
మంచివాడు, ఉద్యోగం, తన ఆశయాలు, ఆలోచనలు దేనికి ఎప్పుడు అడ్డు చెప్పను
అన్నాడు. ఇప్పుడైనా హ్యాపీనా దివ్య??"
అని చాలా సంతోషంగా అన్నారు అంకుల్....ఇది
విన్న నేను great అంకుల్, అలా అయితే దివ్య కి కూడా ఏం objection
లేదనుకుంటా...అని తన వైపు చూసా....వద్దనటానికి reason ఏం లేక, తన తండ్రి
మొహం లో సంతోషం చూసి
సరే అనేసింది...తర్వాత వెంటవెంటనే engagement ,పెళ్లి
జరిగిపోయాయి ....పెళ్లి రోజు ప్రతి క్షణం తనతోనే ఉన్నా...ఇక
వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమి మాట్లాడలేక అలా తన
కళ్ళలోకి చూసి
వెళ్ళిపోయాను ....ఇక తను మాకు దూరం అవుతోంది అనే ఫీలింగ్ వచ్చేసింది ఎందుకో!!!!
కాలం చాలా తొందరగా గడిచిపోయింది....నాకు పెళ్లి అయ్యి, నా లైఫ్ తో నేను busy
అయిపోయాను....మనసులో ప్రేమలు అలానే ఉన్నా మాట్లాడుకోవటం, కలుసుకోవటం తగ్గిపోయింది.....ఇక పిల్లలు పుట్టాక
మరీ...ఫ్రెండ్స్ ని కలవటం, గుడికి వెళ్ళటం, ఆకరికి అమ్మ వాళ్ళతో
మాట్లాడటానికి కూడా టైం ఉండదు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మిస్ అయిన
ఫీలింగ్ . అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా...తను
కాఫీ తీసుకొస్తా అని కిచెన్ లోకి వెళ్తే....చాలా casualగా తన చీరలు
చూద్దాం అని
అలమార ఓపెన్ చేసిన నాకు...."Letters To God" అని పెద్దపెద్ద
అక్షరాల్లో
డైరీ కనిపించింది...ఓపెన్ చేసాను.....
పర్సనల్ డైరీ చదవటం తప్పు అనిపిస్తున్నా.... అందులో ఆవేదన....బాధ అనే
పదాలు కనిపించి చదవకుండా ఉండలేకపోయా...
ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతు
న్నా, చెప్పాలనిపించినప్పుడు చెప్తుంది
అని మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా...అవే ఆలోచనలు...మేము
అదృష్టవంతులం....మంచి వాళ్ళు దొరికారు....హ్యాపీ లైఫ్
అనుకునేదాన్ని....అలాంటిది....తను అంత బాధ పడుతోందా??....ఇక నా వల్లకాదని....ఒకరోజు తనని మా ఇంటికి రమ్మన్నాను...ఏం జరిగిందో చెప్తే కానీ వెళ్ళనివ్వను అని మొండికేసాను....గుండెలు పగిలేలా గట్టిగా ఏడ్చేసింది...జరిగింది చెప్పటం మొదలు పెట్టింది...
తన మాటల్లోనే " పెళ్ళికి ముందు 'అంతా నా ఇష్టం' అన్న మా
అత్తింటివాళ్ళు...పెళ్లి అయ్యాక మాట మార్చేసారు...ఏదీ నాకు ఇష్టం అయినట్టు
ఉండదు...మొదట job చేయొచ్చు....జీతం కూడా నాన్నకి ఇవ్వొచ్చు అన్నవాళ్లు...నా మొదటి నెల జీతం రాగానే...అందులో
నుండి కొంత కూడా నాన్నకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు...అలా ఎలా ఇస్తావ్ అని
పెద్ద గొడవ చేసారు...డబ్బు నిజంగానే పాపిష్టిదే కావ్య...తర్వాత ఏవో
అనుమానాలు, అవమానాలు...ఉద్యోగమే
మాన్పించేసారు ....ఏమైనా అంటే...ఇంట్లో పని
ఎవ
రు చేస్తా
రు అంటారు....అమ్మాయి అంటే ఇంటి పని, వంట పని చేయాలి అని ముద్ర
పడిపోయింది వీళ్ళకు...ఉద్యోగం చేసేటప్పుడు కూడా పనంతా నేనే
చేసేదాన్ని..అయినా నా ఇల్లు, నా వాళ్ళే కదా అని సంతోషంగా చేసేదాన్ని....అలాగే చేస్తా అన్నా ఒప్పుకోలేదు....ఒక్కటి
అంటే ఒక్కటి కూడా నా ఇష్టానికి జరుగదు....
పొద్దున లేస్తే పేస్టు
దగ్గర్నుంచి, breakfast ,lunch, ఆకరికి టీవీ చూడాలన్నా....అన్నిటికి adjust
అవ్వాలి ,వాళ్ళకి నచ్చిందే చేయాలి.......సరదాగా బయటకి వెళ్ళినా ఏదో వచ్చాం
అన్నట్టు ఉంటారు.....సంతోషం అనేదే ఉండదు....నీకు ఏమైనా కావాలా అని అడిగిన
పాపాన పోరు...అదే నాన్నతో బయటకి వెళ్తే...ఏం కావలి,ఏం తింటావ్? హ్యాపీ
నా?? అని ఎన్ని సార్లు అడిగేవారో... ఎందుకు కావ్య,నా లైఫ్ ఇలా అయ్యింది???
అమ్మాయిలు పెళ్ళైతే మారిపోవాలా?? ఆడపిల్లగా పుట్టటం పాపమా?? మన ఇంట్లో
మహారాణీలా ఉండే మనం పెళ్లి అవ్వగానే...అత్తారింట్లో బానిసలా ఉండాలా?? పోనీ
బానిస అనుకోవటం ఎందుకు వాళ్ళు నా వాళ్ళే అనుకుని కలిసిపోతుంటే ,నన్ను తమ మనిషిలా చూడలేరా???మాటలు
అంటుంటే ఎలా??? అపురూపంగా చూసుకునే అమ్మానాన్న కూడా ఇప్పుడు ఏం చేయలేక
ఎడుస్తున్నారు ...నాకోసం నిలబడరే ??" అని తన మనసులోని బాధంతా చెప్పింది...
నాకు నిజంగా ఇది నమ్మాలో లేదో కూడా అర్ధం అవ్వలేదు...సరదాగా నవ్వుతూ ఉండే
దివ్య మనసులో ఇంత బాధ ఉందా అనిపించింది....'దివ్యా ఉద్యోగం ఎందుకు
మానేసావ్??
అని ఎవరైనా అడిగితే...చిరునవ్వు నవ్విందే తప్ప...తను సంతోషంగా లేనని
ఎప్పుడూ చెప్పలేదు.....అలా ప్రవర్తించలేదు కూడా...వాళ్ళాయన చాలా 'మంచివాడు' అనే పిక్చర్ మా మనసులో తనే ముద్రించేసింది.....నిదానంగా, ఓపికగా, ఎప్పుడూ
పెదవులపై చిరునవ్వు చేరగనిచ్చేది కాదు....
ఆలోచిస్తే
అనిపిస్తుంది...ఆడపిల్ల అంటే అంతేనేమో.....పెళ్లి అయ్యాక నా అనే మాటకి
స్థానం లేదేమో...పెళ్లి అయ్యాక అమ్మాయి జీవితం ఎంత మారిపోతుందో కదా...20
ఏళ్ళు ఎంతో గారబంగా పెరిగి..తనకి నచ్చినట్టు ఉంది..నచ్చిన డ్రెస్, నచ్చిన
ఫుడ్, అన్ని తనకి నచ్చినట్టే...మహారాణిలా ఉండే అమ్మాయి...సడన్ గా పెళ్లి
అవ్వగానే కొత్త ఇంట్లో, కొత్త వాళ్ళ మధ్య ఉండాలి...అమ్మాయిలు, సొసైటీ ఎంత మోడరన్ అవుతున్నా ఈ పద్ధతి అయితే మారదు...అదే ఒక అబ్బాయి అలా వాళ్ళ వాళ్ళని వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉంటారా??? ఊహించుకోండి !!!!!
అలా కొత్త వాళ్ళతో ఉండే అమ్మాయి అన్నిటికి adjust అవుతూనే
ఉంటుంది....కట్టుకున్నవాడు, అత్తమామలు మంచివాళ్ళు అయితే ఆ adjustment కూడా
సంతోషంగా చేస్తుంది...అదే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, తనని అర్ధం
చేసుకోకపోతే?? తన జీవితమే ఒక adjustment అయిపోతుంది...కానీ త
ను పడే నరకం
ఎవరికి తెలుస్తుంది....ఒక్క ఆ అమ్మాయికి తప్ప..
అమ్మాయిని
చిన్నప్పట్నించి కష్టపడి పెంచి అప్పో
సొప్పో చేసి చదివించి, కట్నం అంటూ మళ్ళీ అప్పు చేసి...పెళ్లి చేస్తే పోషించటం భర్త భాద్యత
కాదా??? ఆ అమ్మాయి సుఖంగా లేను అని తల్లిదండ్రులకి చెప్పినప్పుడు
తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అడగకుండా...సర్దుకుపోమనటం తప్పు కాదా....తను ఏ
అఘాయిత్యమో చేసుకుంటే???ముమ్మాటికి తప్పు మీదే అవుతుంది 'తల్లిదండ్రులు'....
నాకు అర్ధం అవ్వక అడుగుతానండి....నా స్నేహితురాలికి 20 లకారాలదాక
కట్నం ఇచ్చారు మా అంకుల్...చాలా అప్పులు కూడా చేసి...అంటే మీ కూతురిని ఏ కష్టం
లేకుండా
పోషిస్తాం అని ఆ డబ్బు తీసుకున్నట్టా? అలా
అయితే హ్యాపీ గా
ఉంచాలి కదా ?? తనని
పోషించటానికే అయితే తన ఉద్యోగం, జీతం ఉందిగా? పోనీ
మరి కట్నం ఉందిగా, జీతం
అయినా అమ్మానాన్నలకి
ఇవ్వొచుగా ??? వాళ్ళు తన
పెళ్ళికోసం చేసిన అప్పులు తీరేదాక అయినా??
కట్నం జీతం రెండూ అమ్మాయి కర్చులకే ???
లేక నా కొడుకుని ఇంత కర్చు చేసి చదివించాం....మావి మాకు ఇస్తే అబ్బాయిని అప్పగించేస్తాం అన్నట్టా??? ఇక ఇదంతా చాలదన్నట్టు ఆడపడుచు కట్నం అంటూ మళ్ళీ ఓ లకారం తీసుకున్నారు...అంటే
మా అన్నయ్య తో ఉన్న అనుబంధం తెంచేసుకుంటాను లేదా తగ్గించుకుని నీకు
అప్పగించటానికి నాకు కొంత సొమ్ము కావలి అన్నట్టా???
బాబోయ్!!!!!మీరు మరీ అలా కొట్టేసేలా చూడకండి....ఇవన్నీ నా మట్టి బుర్రకి వచ్చిన doubts ....అది అడిగే
యక్షప్ర శ్నలూనూ :D
NOTE: నేను ఎవరినీ
ఇక్కడ తక్కువ చేసి మాట్లాడటం లేదు....నా ఫ్రెండ్ కి జరిగింది మాత్రమే చెప్పానంతే....ఎవరూ దీన్ని -ve గా తీసుకోవద్దని మనవి....
ఇంకో విషయం , అమ్మాయిలంతా కష్టపడిపోతున్నారు....మేమే ఎందుకు పనులన్నీ చేయాలి???అబ్బాయిలతో చేయించాలి....అబ్బాయిల జులుం నశించాలి...విప్లవం వర్ధిల్లాలి type అస్సలు కాదండోయ్....
మేము(అంటే అమ్మాయిలం) ఏది చేసినా సంతోషంగా చేస్తాం...'మన' వాళ్ళకే చేస్తున్నాం అనే త్రుప్తి ఉంటుంది ..so, ఆ 'మన' అనే పదానికి న్యాయం చేయండి చాలు :)
అలాగే నేను మగాళ్ళంతా మంచివాళ్ళు కాదు అనటం లేదు....ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు...అందరికి వందనములు :)....నేను చెప్పింది మంచివాళ్ళు కానీ వాళ్ళ గురించి...ex :నా ఫ్రెండ్ case
.............మీ కావ్యాంజలి ♥♥♥