Pages

Showing posts with label నవ్వు నలబై విదాలా గ్రేటు :). Show all posts
Showing posts with label నవ్వు నలబై విదాలా గ్రేటు :). Show all posts

Wednesday, 3 October 2012

25 ఏళ్ళ దాంపత్యంలో....చిన్న గొడవ కూడారాలేదా????


ఒక జంట 25వ పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంతున్నారట....అయితే 25 ఏళ్ళ దాంపత్యంలో వాళ్ళకి  ఒక్క చిన్న గొడవ కూడా రాలేదని తెలుసుకున్న విలేకరి అక్కడికి చేరుకున్నాడట..

విలేకరి: సార్, నమ్మలేకపోతున్నా...అసలు ఒక చిన్న గొడవ కూడా లేకపోవటం అసలు ఎలా???ఎలా సాధ్యపడింది???

పెద్దాయన: వాళ్ళ హనీమూన్ రోజులు గుర్తుచేసుకుంటూ...మేము పెళ్లి అవగానే  హనీమూన్ వెళ్ళామయ్య ...అక్కడ గుర్రపు స్వారి చేద్దాం అనిపించి....ఇద్దరం ఒక్కో గుర్రం మీద  స్వారి మొదలెట్టాం....నా గుర్రం బానే ఉంది కానీ...మా ఆవిడ గుర్రమే కొంచెం పొగరుబోతు,తిక్క గుర్రం అనుకుంటా...దారిమధ్యలో దానికి ఏమోచ్చిందో ఏమిటో...ఒక్కసారిగా ఎగిరి మా ఆవిడని కింద పడేసింది....మా ఆవిడ పైకి లేచి సర్దుకుంది ....గుర్రాన్నీ నిమురుతూ..."ఇది మొదటిసారి" అని మళ్ళి స్వారి మొదలెట్టింది.....కాసేపటికి గుర్రానికి మళ్ళి  ఏమోచ్చిందో కానీ పడేసింది....మా ఆవిడ మళ్ళి గుర్రం వీపు తడుతూ "ఇది రెండో సారి" అని మళ్ళి స్వారి మొదలెట్టింది....ఇక గుర్రం మూడోసారి పడేయగానే....purse లో నుండి రివాల్వేర్ తీసి కాల్చి చంపేసింది ...
నేను గట్టిగా అరిచాను...'నీకేమైనా పిచ్చిపట్టిందా...పాపం దాన్ని అలా చంపేసావ్' అని...
తను నా వైపు చూసి "ఇది మొదటిసారి" అంది 
అంతే నాకు అర్ధం అయ్యింది.....(ఇక నేను తనని తానుగా స్వీకరించటం నేర్చుకున్నా) ...ఇక తరవాత మేము కలహం లేకుండా సంతోషంగా జీవించాం :)" 

నోట్ : నాకు వచ్చిన మెయిల్ ని ఇలా తెలుగు లోకి అనువదించి మీతో పంచుకుంటున్నా :)
 

View Count




Useful Links