Pages

Ads 468x60px

Featured Posts

నా మనసులో మెదిలిన కొన్ని భావాలని ఇలా అందరితో పంచుకోవాలి అనే తపనతో వ్రాస్తున్న చిన్ని ప్రయత్నం ఈ బ్లాగ్....మీ కావ్యాంజలి

Tuesday, 18 December 2012

కుటుంబం,ఉద్యోగం నడుమ ఈ తరం అమ్మాయి


అప్పుడప్పుడే తెలవారుతుంది.....తలారా స్నానం చేసిన నేను, రేడియో ఆన్ చేశాను..."ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే,ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవ మాహ్నికమ్" అంటూ ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారు పాడుతున్నారు...నేను పొయ్యి మీద పాలు పెట్టి, ముగ్గు డబ్బా తీసుకుని వాకిట్లోకి వెళ్లి, ముగ్గు వేస్తుండగానే, చంటాడు లేచి సంగీతం ప్రాక్టీసు మొదలు పెట్టాడు, పరిగెత్తుకెళ్ళి వాడిని ఎత్తుకుని....ముగ్గు ముగుంచి.....మా వారిని లేపి, బ్రష్ మీద పేస్టు వేసిచ్చి, చంటి గాడి మొహం కడిగి,వంటింట్లోకి వెళ్లి మా వారికి కాఫీ,చంటాడికి పాలు కలిపిచ్చాను.....కాసేపు పిల్లాడిని చూసుకుందురూ.. చక చకా టిఫిన్ చేసేస్తాను....అంటూ ముగించానో లేదో మా వారు లేచి స్నానానికి వెళ్ళిపోయారు... చంటి గాడు మళ్లీ  సంగీతం అందుకున్నాడు....ఇక తప్పదు అనుకుని....వాడ్ని తీసుకుని వంటింట్లోకి వెళ్లి...వాడి చేతిలో ఒక ఆపిల్ పెట్టి....వంట మొదలుపెట్టాను....పాలవాడు, కూరగాయలమ్మి ఇలా మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ....మొత్తానికి వంట ముగించి....మా వారికీ డబ్బా కట్టేసి....తను టిఫిన్ చేసేలోపు చంటి గాడికి పెట్టేసి....శ్రీవారు ఆఫీసు కి వెళ్తుంటే,గుమ్మం దాక వెళ్లి టాటా చెప్పేసి లోపలి వచ్చాను....చంటి గాడికి స్నానం చేయించి చొక్కా వేస్తుండగానే నిద్రలోకి జారుకున్నాడు.....ఇల్లంతా సర్దేసి చిన్నగా రేడియో పెట్టి,పేపర్ పట్టుకు కూర్చున్నాను....ఇల్లంతా ప్రశాంతంగా ఉంది.....(Mr.పెళ్ళాం సినిమా గుర్తొచ్చిందా??) అంతే!!!!!!!!! టిర్ర్ర్ర్ర్ ర్ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ ర్ మంటూ గట్టిగా శభ్ధం, ఉలిక్కిపడి లేచాను......"అలారం"....సూర్య కిరణాలు కిటికిలోంచి మొహం మీద పడుతుంటే...ఓఒ ఇదంతా కలా అనుకుంటూ లేచాను :D 
                                                             

ఇక రియాలిటీ లోకి వస్తే.....
నేను, మా వారు ఇద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాం.... నేను ఉదయం 9:30 కి ఆఫీసులో ఉండాలి. తను 10 గంటలకల్లా ఆఫీసు చేరుకోవాలి..ఉదయాన్నే లేచి ఏదో వండేసి , వండింది ఇంత నోట్లో వేసుకుని....ఇంకాస్త  బాక్స్ లో  వేసుకుని...ఆఫీసులకి వెళ్తాం.....అక్కడ మేనేజర్ గారు "వచ్చారా మేడమ్, రండి రండి,ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నట్టు చాలా వెటకారంగా చూస్తూ,టైం ఎంతయ్యింది అంటాడు" మనం ఎక్కడ లేని వినయం చూపిస్తూ ఓ నవ్వు  నవ్వితే అక్కడితో ఆపేస్తాడు.....లేదు అని  రెచ్చిపోయమో పుచ్చిపోయామే....అలా సర్దుకుని....ఏదో ఉన్న పని చేసుకుని...లంచ్ అవర్ లో తనకి ఒకసారి కాల్ చేసి తిన్నారా, ఏంటి విశేషాలు అంటామో లేదో  టైం అయిపోతుంది అని గుర్తుకు వస్తుంది....ఇక ఉంటానండి అని ఫోన్ పెట్టేసి.....బ్రతకాలంటే తినాలి అనుకుని, తెచ్చుకున్న డబ్బా ఖాలీ చేయాలి...ఇక మళ్లీ వెళ్లి పనిలో పడిపోతా.....ఇక కాస్త త్వరగా ఇంటికి చేరుకోలిగితే పరవాలేదు....ఏదో వంట అనే కార్యక్రమం కాస్త సజావుగా సాగిపోతుంది...కానీ , పొరపాటున నాకు పని వల్ల కాస్త ఆలస్యం అయ్యిందో...ఇక అంతే సంగతులు....వంట చేయటానికి టైమూ,ఓపిక రెండూ ఉండవు.....అప్పుడు ఎక్కడో మనసు మూలల్లో ఏదో తెలియని ఒక అసంతృప్తి,అసహనం ....అయ్యో!!! మా ఆయనకి సరిగా వండి పెట్టలేకపోతున్నానే అని....పోనీ ఉదయాన్నే లేచి చక్కగా వండుదామా అంటే...అదేమిటో, నిద్రా దేవత ఇప్పుడు లేవనివ్వానంటే లేవనివ్వను అని పట్టుబడుతుంది.....ముందు రోజు పని అలసట వల్లనో ఏమో....శరీరం కూడా సహకరించదు......అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది,ఈ సమస్యని ఎలా అధిగమించాలి అని ఆలోచించే లోపే మళ్లీ ఆఫీసు టైం అయిపోతుంది....మళ్లీ పరుగో పరుగు.....
ఇలా 5 రోజులు పరుగులు తీస్తూ, ఒక రోజు ఇంట్లో ,ఒక రోజు బయట తింటూ గడిపేస్తూ, ఒకరిమోహాలు ఒకరం సరిగా చూసుకున్నామో లేదో తెలియని అయోమయంలో ఉంటూ ఆ 5రోజుల పండగ కాస్తా ముగించేస్తాం....
ఎంతో  ఆశగా ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేస్తుంది...."శనివారం, ఆదివారం" . ఒరిస్సా తుఫాను బాధితుడికి తిండి దొరికినట్టు దొరికే ఆ రెండు రోజులు వస్తూనే....కూరగాయలు, సరుకులు,షాపింగ్,బిల్లులు కట్టడాలు,ఇల్లు శుబ్రం చేసుకోవటం , అలసిపోయి పడుకోవటం తో తుర్ర్ మని ఎగిరిపోతాయి రెండు రోజులు....
పోనీ, ఎంత సేపూ భాధ్యతలేనా...ఈ వారం ఎంజాయ్ చేద్దాం అనుకుని...సాహసం చేసి ప్లాన్ చేస్తే......ఇంట్లో పనులన్నీ అలా ఉండిపోతాయి  ...ఆదివారం రాత్రి ఇంటికి వచ్చి పనులన్నీ చేసి...అలిసిపోయి పడుకుంటామా....ఆ అలసటకి తోడు , నిద్రాదేవి నేనూ  ఉన్నానంటూ సోమవారం నిద్ర లేవనివ్వదు.....
ఇక ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళామా ...అంతే...బాస్ గారు పంచబక్ష పరమాన్నాలతో సత్కరించి...సన్మాన కార్యక్రమం మొదలు పెడతారు....ఎప్పుడైనా టైం దొరికినప్పుడు,ఆఫీసు కాబ్ లో వెళ్తూ ఆలోచిస్తే చిన్న అసంతృప్తి, ఏదో వెలితి....ఏంటి ఈ జీవితం??? ఇలా ఎంతకాలం పరుగులు?? అసలు కుటుంబం కోసం నేను ఏం ేస్తున్నాను...అయిన వాళ్ళని ఫోన్ లో కూడా పలకరించే టైం లేకుండా అయిపోయింది...పోనీ ఆఫీసులో మనం ఏమైనా గొప్ప పోసిషన్ లో ఉన్నామా అని తరిగి చూసుకుంటే....అదే కుర్చీ,అదే టేబుల్,అదే కంప్యూటర్...నొక్కి నొక్కి అరిగిపోయిన మౌస్,కొట్టి కొట్టి అరిగిపోయిన కీబోర్డ్...ఒక వెయ్యో రెండు వేలో హైకు....మరీ      జుట్టుపీక్కుని, కళ్ళు పోయేలా పని చేస్తే ఇంకో 4 బటానీలు చేతిలో పెడతారు...
సరే పోనీ onsite లో మనకి మాంచి పేరేమైనా ఉందా అంటే....onsite వాడు కూడా ఎప్పుడు చూడు....పోయిన రెండు వారాలు నీ performance బానే ఉంది...మరి ఈ వారం ఏం అయ్యిందో తెలియదు....తగ్గిపోతుంది నీ performance అని పాడిన పాటే పాడుతుంటాడు........మళ్లీ  ఇక్కడ అసంతృప్తి.....అసలు పెళ్ళైన అమ్మాయిలంతా ఎలా మనేజ్  చేస్తున్నారబ్బా??? పిల్లలు ఉన్నవాళ్లు కూడా ఉద్యగం చేస్తున్నారే....నేనెందుకు ఇలా...నేనొక్కదాన్నే ఇలా ఉన్నానా అని ఏదో బాధ.....ఇలా చిరిగిన  ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ముక్కలు తెచ్చి అతికించి చూస్తే....నాకే అర్ధం కాలేదు....మళ్లీ  అసంతృప్తి....                                                       
                                                       
అమ్మ ఇంటికి వస్తే గట్టిగా ఒక గంట తన పక్కన కూర్చుని మట్లాడే తీరిక లేని సంపాదన , భర్త పుట్టినరోజు నాడు ఒక గంట ముందుగా ఇంటికి రాలేని ఉద్యోగం...రేపు పిల్లలు పుడితే వాళ్ళకి తినిపించటానికి, ప్రేమగా దగ్గరకు తీసుకోవటానికి  టైం ఉంటుందా?? బాబోయ్ !!!! వద్దు నాకీ సంపాదన అనిపించింది...
ఇంతలోనే నా మనసుకి నేనే సర్దిచెప్పుకున్నా...."బంగారం....ఇన్ని భాద్యతల మధ్య నీకు తోచిందేదో నువ్వు చేస్తున్నావ్,నిన్ను నువ్వు చూసుకుని గర్వపడాలి....పిల్లలు పుట్టేదాక ఉద్యోగంలో పైకి ఎదుగు...పిల్లలు పుట్టాక మనేయోచ్చులే...అప్పుడు కుటుంబానికే మన ఓటు" అని..

ఇలా అనుకున్న కొన్నాళ్ళకి మా జీవితంలోకి ఒక బుజ్జి పాప వచ్చింది.....లీవ్ పెట్టాను కానీ resign చేయలేదు....మొదటి 6 నెలలు ఎలానో వర్క్ ఫ్రం హోం అని పని కానిచ్చాను......కానీ, తర్వాత మా మేనేజర్ మహానుబావుడు....ససేమిరా అన్నాడు.....ఉద్యోగం కావాలంటే ఆఫీసుకి రావాల్సిందే అన్నాడు.....ఉద్యోగమా?? కుటుంబమా?? అనే సంఘర్షణలో.....పెరిగిన కర్చులు, భాద్యతల కారణంగా ఉద్యోగమే గెలిచింది..... పాపని వదిలి వెళ్లాలని లేకపోయినా, తప్పలేదు.... మళ్లీ అవే ఉరుకులు పరుగులు.....ఉదయాన్నే లేవటం...వంటచేయటం,నేను రెడీ అయ్యి పాపని రెడీ చేసి, నాకో డబ్బా,మా వారికో డబ్బా,పాపకి అన్నీ సర్దుకుని ,9 గంటలకి పాపని daycare లో వదిలేసి ఆఫీసుకి వెళ్ళటం.....మళ్లీ సాయంత్రం 7 గంటలకి పాపని daycare నుండి తీసుకుని ఇంటికి వచ్చి వంటచేయటం......రోజంతా దానితో ఉండకపోవటం మూలంగా, ఇంటికి వచ్చాక అది ఒక్క నిమిషం నన్ను వదలదు...ఇలా మళ్లీ తినటం,పాపని పడుకోబెట్టి నేను పడుకోవటం...మళ్లీతెల్లారితే పరుగుల జీవితం.....ఎన్నాళ్ళిలా????

అసలు అమ్మాయిలు పెళ్ళయ్యాక  ఉద్యోగం చేయాలా?? మానేయాలా???

ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.


నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)


Friday, 30 November 2012

స్కూల్ అడ్మిషన్ తిప్పలు

                                         
మా వాడి హోంవర్క్ తో నేను పడే తిప్పలు గురించి మీ అందరికి తెలిసిందే...ఇక మా వాడి స్కూల్ అడ్మిషన్ ముచ్చట్లు చెప్తా వినండి....
'మా ఫ్రెండ్ ఒకడు వాళ్ళ పాపకి స్కూల్ అడ్మిషన్ కోసం తిరుగుతున్నాడోయ్, ఈ రోజు లంచ్ బ్రేక్ లో ఓ రెండు స్కూళ్ళకి నేనూ వాడికి తోడుగా వెళ్ళా,బాబోయ్..ఏంటో !!పిల్లల్ని కనటం కంటే వాళ్ళకి స్కూల్ వెతకటమే కష్టం అనిపిస్తుంది వాడి తిప్పలు చూస్తే, వచ్చే సంవత్సరం మన బుడ్డోడి కోసం మనమూ  తిరగాలేమో' అన్నారు మా వారు....
నాకెందుకో ఒక్కసారి గుండె మీద రాయి పడినట్టయ్యింది .....అరె నా చిట్టి తండ్రి అప్పుడే స్కూల్ కి  వెళ్ళేంత పెద్దవాడైపోయాడా?? అని....ఇదే మాట అమ్మతో చెప్తే...."పిల్లలు ఎంత పెద్ధవాల్లైనా అమ్మ కళ్ళకి వాళ్ళలాగే కనిపిస్తారు,ఎలాగు వాడి అల్లరికి ఓ అడ్డు అదుపు లేకుండా పోతోంది....నీకూ కాస్త రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది....అయినా నువ్వు నా కొడుకు ఇంకా పసిపిల్లాడే అని ఈ సంవత్సరం వేయను అంటే..వాడి తోటి పిల్లలకన్నా ఒక క్లాసు వెనకపడిపోడూ???" అంది అమ్మ...

ఇది జరిగాక...నేను ఇంటర్నెట్ లో "best schools in hyderabad " వేట మొదలెట్టా....అబ్బబ్బో....మన్నా reviewsaa  అవి.....ఒకరు సూపర్ అంటారు...ఒకరు ధబెల్న కింద డేస్తారు.....ఇక ఇలా కాదని నేనే చాలా enquiry చేసి...చాలా మంది పేరెంట్స్ ని కనుక్కుని కొన్ని నాకు అనువైన స్కూల్స్ ని finalize చేసుకున్నా....
నాకు అనువైన అని ఎందుకన్నానో చెప్తా వినండి.....'international schools' అంటారు.....అవి మన లిస్ట్ లోనే లేవు....ఎందుకంటే.....పిల్లలతో బస్తాడు పుస్తకాలు మోయించే type స్కూల్ కాదు మాది అంటూనే.....భారం అంతా తల్లిదండ్రుల మీదే వేసేస్తారు ఫీజు రూపం లో(ఒక స్కూల్ లో కనుక్కుంటే 2 లకారలదాకా అడిగారు)...ఆ భారం మోయటం మా తరం కాదని lite తీసుకున్నా....
అయ్యో ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండోయ్ మీకు, మా వారి ఫ్రెండ్ వాళ్ళ పాప అడ్మిషన్ కోసం ఒక స్కూల్ కి  వెళ్తూ ,మా వారిని కూడా తీసుకెల్లారట.....అక్కడ ప్రిన్సిపాల్ మేడమ్  గారు.....డైరెక్ట్ గా డొనేషన్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అన్నారట.....వీళ్ళు అదేంటి అందరిదగ్గర ఒకే amount  తీసుకోరా?? అనుకుని... ఫీ  తో కలిపి ఓ లక్ష వరకు అని ఈయన నసుగుతుండగా(ఈ విషయం మావారు నాకు చెప్తుంటే, అమ్మో లక్షే ???? అని నోరు తెరిచా నేను...దానికి మా వారు దోమలుదూరుతాయ్ అనుకున్నారేమో మూతిమీద టప్  మని ఒకటిచ్చి  కంటిన్యూ చేసారు )ఆ మేడం గారు సీరియస్ గా మొహం పెట్టి, 'ఏంటండి ?? మీ వైఫ్ కూడా software job అన్నారు?? 2 lakhs అయినా ఇవ్వలేరా??' అన్నారట.... ఆయన పాపం మారు మాట్లాడకుండా పద అన్నట్టు సైగ చేసారట మా వారికి.....

ఆస్తులు సంపాదించి ఇవ్వటం కన్నా (అంటే ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిపోయి,రేట్స్ బాగా పెరిగిపోయాయి కదండి.....సో, ఆస్తులు మనవల్ల ఎలాగూ అవ్వదు)...మంచి education ఇవ్వటం బెటర్ అని ఫిక్స్ అయ్యాం నేనూ , మా వారు....so , అలా నేను finalize చేసినవి 5 స్కూల్స్....LKG కోసం అడ్మిషన్ అయితే , పిల్లలకి జూలై కి  3 సంవత్సరాల వయసు ఉంటే eligable  ....(ఒక్కో స్కూల్ ని  బట్టి జనవరి నుండి జూలై కి 3 ఇయర్స్ (అంటే 3rd బర్త్ డే అయిపోయి)ఉండాలి)....అదో రూల్..ఇద్దరు పేరెంట్స్ PG (కొన్ని స్కూల్స్ లో తండ్రి PG, తల్లి డిగ్రీ) చేసి ఉండాలి అనేది ఇంకో రూల్...అన్ని చోట్ల గురించైతే నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో అయితే...అడ్మిషన్స్ జనవరి నెలలోనే మొదలైపోతాయ్.....అడ్మిషన్ ఫార్మ్స్ నవంబర్/డిసెంబర్ లోనే ఇస్తారు......అవి కూడా 100/200 రూపాయిలు చెల్లించి తెచ్చుకోవాలి......అలా  అన్నీ తెచ్చి ఫిల్ చేసి.....దానికోసం మా బుడతడివి, మావి ఫొటోస్ కూడా తీయించుకున్నామండోయ్.....మళ్లీ  ఆ స్కూల్స్ అన్నీ తిరిగి వాటిని సబ్మిట్ చేసాం(కొన్ని స్కూల్స్ లో అయితే సబ్మిట్ చేయాలన్నా డబ్బు చెల్లించాలట.....ఎక్కడ, ఎంత దొరికితే అంత దండుకోవడమే అన్నట్టు ఉంది వ్యవహారమంతా)....
ఇక ఆ ఐదు స్కూల్స్ లో ఒక స్కూల్ ఇంటర్వ్యూ కి మా వారైతే ఆకాశమంత సినిమాలో ప్రకాష్ రాజ్ లా తెగ ప్రిపేర్ అయ్యారు(మన గురించి తెల్సు గా,lite అన్నమాట) ..కానీ ,వాళ్ళు కూడా అంతే రొటీన్ గా ఆ సినిమాలో ప్రిన్సిపాల్ లా ఫీజు గురించి తప్ప ఇంకేం మాట్లాడలేదు.....ఏమి అడగలేదని మా వారు disappoint కూడా అయ్యారు..ఆ స్కూల్లో  ఫీ 2 లకారాలు అవుతుంది ,బస్సు ఛార్జ్ తో కలిపి  అని తెలిసి అక్కడి నుంచి దుకాణం ఎత్తేసాం......మరో స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్ ప్రిసిపాల్ చాలా గర్వంగా.....మా స్కూల్ కి 10th కి అన్ని ranks  వచ్చాయ్ ,ఇన్ని ranks  వచ్చాయ్ అని చెప్పి......మా పిల్లలకి 8pm  వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసి చదివిస్తాం తెలుసా? అన్నారు...అంతే ఖేల్ ఖతం, దుకాణం బంద్,తిరిగి చూడకుండా బయటకి వచ్చేసా..(నా బుజ్జి తండ్రి ఆరోగ్యం, కళ్ళు ఏమైపోనూ ?? వీళ్ళ జిమ్మడ అనుకుని)....ఇక మన 3rd స్కూల్.....భలే గొప్ప స్కూల్ లెండి....రిటర్న్ టెస్ట్ అన్నారు...మా వాడికి పెన్సిల్ పట్టడమే రాదూ.....లోపలికి తీసుకెళ్ళారు.....ఏమి గీకాడోగానీ, ఒకావిడ క్లోజ్-అప్ ad లా నవ్వుతు వచ్చి, 'your kid is selected ma'am,please find the fee details in the office  ' అంది.....almost తీన్మార్ డాన్స్ వేస్తూ వెళ్ళా ఆఫీస్ రూమ్ వరకు ...అక్కడొకాయన చాలా cool గా అడ్మిషన్ fee is 30,000 ma'am , first term fee is 11,000(మొత్తం 3 terms), transport fee will depend on the distance' అన్నారు....మనసులో ఓ సారి అన్ని లెక్కకట్టి (అసలే వీకు), అబ్బ లకారం అయితే  చేరదు అనుకుని ఈ అని ఇకిలించి....fee ఎప్పుడు pay చేయాలండి అన్నాను....'మీ ఇష్టం ma'am, next week లోగా ఎప్పుడైనా పరవాలేదు,అన్నట్టు చెప్పటం మర్చిపోయాను బిల్డింగ్ ఫండ్ కూడా కట్టాలి ma'am' అన్నాడు....(ఫండ్ అంటే మన ఇష్టాన్ని బట్టి అయ్ ఉంటుంది అనుకున్నా)....ఓ,ok అని నేను అంటుండగానే, ఆయన చాలా సాఫ్ట్ and ఫాస్ట్ గా అది 'ఒక 60,000 వరకు(అదేమిటో వరకు??)అవ్వచ్చు' అన్నారు....నాకు ఎవరో సుత్తె తీసుకుని నా తలపైన కొట్టినట్టు(అచ్చు గజినీ మూవీ లా),నేను కూర్చున్న కుర్చీని ఎవరో గిరగిరా తిప్పుతున్నట్టు అనిపించింది....ఆ తర్వాత ఏం జరిగింది అని అడగకండి .....నాకూ తెలీదు....next  సీన్ లో నేను మా ఇంట్లో ఉన్నా అదేంటో.....
ఇక మన 4th స్కూల్....ఎవరికీ అన్యాయం జరగకూడదు అని అట,ఇక్కడ నో interviews...అబ్బ సూపర్ అన్నారా??? అక్కడే మీరు పిజ్జా మీద కాలేసారు... మన అడ్మిషన్ ఫారం నంబర్స్ డ్రా తీస్తారన్నమాట :D.....ఆ అయితే తప్పేంటట  అంటారా??? హహ్హహ్హ అక్కడే ఉంది అసలు కిటుకు ....కొన్ని సీట్స్ స్పెషల్ quota, management seats, అని ఏవేవో పోయాక మిగిలే 30/40 సీట్స్ కి draw తీస్తారు.....నా లాంటివాళ్ళు సవాలక్షమంది....ఆ 30/40 సీట్స్ కోసం 2000 కి పైగా అప్లికేషన్స్(అంటే 2000 X 250rs ) వచ్చి ఉండచ్చు :P.....మాకు ఆ లక్కీ డ్రా లో సెలెక్ట్ అయ్యే లక్ లేదని తేలిపోయి నిరాశగా ఇంటికి వచ్చేసాం.....

ఇక మిగిలింది ఒకే ఒక్క స్కూల్ ....సో,ఇంకా అడ్మిషన్ ఫార్మ్స్ ఇస్తున్న స్కూల్స్ కి వెళ్లి ఫార్మ్స్ తీసుకువచ్చారు మా వారు....ఇక నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఆకరు స్కూల్....ఇందులో పేరెంట్స్ కి కూడా ఇంటర్వ్యూ ఉందండోయ్....బంపర్ ఆఫర్ అన్నమాట :D 
ఒక సారి ఆ స్కూల్ ఫార్మ్ వైపు  చూసి వదల బొమ్మాలి నిన్నోదల అని....ఇక మా వాడిని కత్తి......కత్తి లా తాయారు చేశా...అంటే కత్తి డ్రెస్ అనుకునేరు...ఓ బాగా చదివించావా??? అంటున్నారూ ??? ఎబ్బే ఇన్నాళ్లనించి చూస్తున్నారు ,ఏం తెలుసుకున్నారండి నా గురించి....I hurted :(....అంటే చక్కగా డ్రెస్ వేసి,పౌడర్ రాసి,తల దువ్వానంతే :).....ఇక మా వారు 'good manners ' అని ఏదో హితబోధ చేసారు వాడికి ....
dose ఎక్కువయ్యిందో ఏంటో.....వాడు 'ఎహే పో' అని వెళ్ళిపోయి కార్ ఎక్కేసాడు..మా వారికి కోపం వచ్చి "ఛి,అన్నీ నీ బుద్ధులే" అన్నారు నా వైపు చూసి......నాకు ఒక్కసారి కిచెన్ లోకి పరిగెత్తుకెళ్ళి,పప్పుగుత్తి తెచ్చి నెత్తిమీద ఒక్కటివ్వాలనిపించింది.....కానీ, నా మొగుడే కదా...నా తాళే కదా అని, కాం గా వెళ్లి కారెక్కాను.....మా వాడికి తోడు ముగ్గురం వెళ్లాం....నేను,మా వారు,మా తమ్ముడు .... మా నెంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండగానే పిలిచారు.....చక్కగా పిక్నిక్ కి వెళ్తున్నట్టు ముగ్గురం చేతులు పట్టుకుని వెళ్లబోతుంటే....అక్కడ ఉన్న టీచర్, 'వెర్రిపీనుగుల్లారా' అన్నట్టు ఓ చూపు చూసి "only parents" into this room, kids to రూమ్ no.4 అన్నారు....ఇదేం ట్విస్ట్ అనుకుని వెళ్లాం...
మాకు ఇంటర్వ్యూ.....బేసిక్ గా పిల్లల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం,ఇద్ధరూ ఉద్యోగం చేస్తే పిల్లాడిని చిదివించగలరా??  ఏం  చదువుకున్నారు?? ఆ స్కూల్ నే ఎందుకు ఎంచుకున్నారు అని కనుక్కుని......(ఏం  చెప్పావ్ అంటున్నారా...ఏదో లెండి తోచింది చెప్పా.)....తర్వాత ఫ్యామిలీ matter కి వచ్చారు.... మాఅత్తయ్యా,మామయ్య,మా తమ్ముడు, మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం,మా పక్కింట్లోనే మా ఆడపడుచువాళ్ళు ఉంటారు  అని తెలుసుకున్న ఆవిడ తెగ సంబరపడిపోయినట్టు "all happily adjusted together?" అని ఒక పెద్ద స్మైల్ ఇచ్చారు (బహుశా ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం కాబోలు ) అక్కడే అర్ధం అయిపోయింది మాకు మాంచి మార్కులే పడ్డాయ్ అని... ఇక ఆ రూమ్ నుండి బయటకి రాగానే, "you can go to your kid ,but only one of you " అన్నారు ఒక టీచర్....సరే నువ్వే వెళ్ళు అన్నారు మా వారు....మా వాడికి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు....నేను వాడి పక్కనే కూర్చున్నా....కాసేపటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది.....జంతువుల బొమ్మలు చూపించి ఇంగ్లీష్ లో వాటి పేర్లు చెప్పమంటున్నారు....."మా వాడు నేను చెప్పను పెహ్" అనేసాడు(గుడ్ manners డోస్ బాగా ఎక్కువైనట్టుంది )....ఇంతలో ఆ దేవుడు దయ తలిచి మా వాడిని ఇంటర్వ్యూ చేసే టీచర్ ని  వేరే టీచర్ పిలిచారు....ఈ లోగా మా వాడు అక్కడున్న ఒక బొమ్మని చూసి నాకు అది కావాలి అన్నాడు.....నేను తెలివిగా.....'టీచర్ అడిగినవాటికన్నిటికి ఆన్సర్స్ చెప్తే ఇస్తారట' అన్నాను....అంతే మా వాడు వేరే టీచర్ తో మాట్లాడుతున్న టీచర్ ని లాక్కుని వచ్చి మరీ అన్నీ టకటకా చెప్పేసాడు.....అంతే..."enthusiastic kid" అని ఒక ట్యాగ్ వేసి మరీ పంపించింది.....
ఇంటికి వచ్చి లెక్కలేనన్ని మొక్కులు మొక్కేసా....అంతే వారం తర్వాత పెట్టిన selected list లో నా పుత్ర రత్నం పేరు చూసుకుని.....మా వాడు IAS/IPS అయినంత మురిసిపోయాం ......
ఏవిటీ ఈ స్కూల్ fee గురించి చెప్పలేదే???మీ వాడికి సీట్ ఇచ్చారనా ??? అనుకుంటున్నారా??? లేదండి చెప్తా.....అడ్మిషన్ ,fees ,uniform,పుస్తకాలు  అన్నీ  కలుపుకుని 50,000(కొంచెం తక్కువ) అయ్యిందిలెండి..... లకారం చేరలేదనే త్రుప్తి నాది....మా నాన్నకి ఫీజు విషయం చెప్పగానే...అమ్మో!!! అంత డబ్బే??? ఏంటో చదువు చారెడు....బలపాలు దోసెడు అన్నట్టు ఉంది...నీ చిన్నప్పటినుండి  డిగ్రీ వరకు కలుపుంటే కూడా అంత ఫీజు అవ్వలేదేమో అన్నారు నవ్వుతూ.......
ఏంటో నిజమే కదండి......ఈ మధ్య కాలంలో ఫీజుల మోత పెరిగిపోతోంది......మళ్లీ ఈ  ఆక్టివిటీ..ఆ competition అంటూ పై పై కర్చులు ఎన్నో....  ఎక్కువ ఫి ఉంటేనే మంచి స్కూల్ అని నేను చెప్పను కానీ, ప్లే గ్రౌండ్ కూడా లేని మా ఇంటి దగ్గరి చిన్న స్కూల్ లో కూడా 30,000 ఫీజు,  ట్రాన్స్పోర్ట్ extra, మళ్లీ uniform,బుక్స్ మా దగ్గరే కొనాలి అన్నారు...సో, ప్లేగ్రౌండ్ సౌకర్యం కూడా లేని స్కూల్ కంటే ప్లేగ్రౌండ్ తో పాటు,మన సంస్కృతి,పురాణాలు,ఆధ్యాత్మికత,భగవద్గీత అన్నీ చెప్పే స్కూల్ బెటర్ అనిపించింది నాకు....అంటే డబ్బులేకుండా చదుకున్న పిల్లలు లేరా???? అంటే.....ఉన్నారండి...మట్టిలో మాణిక్యాల్లాంటివాళ్ళు.....మన గవర్నమెంట్ స్కూల్స్ సంగతి తెలిసిందే.....
మొన్నామధ్య మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాతో మాట్లాడుతూ,"విరాళాలు సేకరించి, మన స్కూల్ లో పిల్లలకి టై,బెల్టులు చేయిద్దాం అనుకుంటున్నామండి, ప్రైవేటు స్కూల్ పిల్లలు టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటే....అందరికి అలానే ఉండాలనే ఆశ, అందరు పిల్లలు ప్రైవేటు స్కూల్స్ కి వెళ్ళిపోతున్నారు....ఏదో పిల్లల్లో ఉత్సాహం తేవడానికి ఇలా అనుకున్నాం "అన్నారు..నాకు భలే సంతోషంగా అనిపించింది,గవర్నమెంట్ స్కూల్ లో పిల్లల సంఖ్య  పెంచి, దాన్ని అభివృద్ధి చేయాలనే ఆయన తపన,ఆలోచన చూస్తే...ఏదో నాకు తోచిన సహాయం చేసాను......ఇలా అందరు టీచర్స్ ,మన గవర్నమెంట్ అలోచించి .....మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ ని తలదన్నే range కి రావాలని నేను కోరుకుంటున్నాను.....
కానీ, ఒకటైతే నిజమండి.......educational system అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది.....బాగా సంపాదిస్తేనే పిల్లల్ని బాగా చదివించగలం.....

                                                                                                     .............మీ కావ్యాంజలి ♥♥♥

Tuesday, 27 November 2012

"ఎ లెటర్ టు గాడ్"


" ఎన్నోకలలతో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి, భర్తకి ప్రేమని పంచి ప్రతిఫలంగా ప్రేమని ఆశించి, అది అందనప్పుడు పడే బాధేంటో నీకు తెలుసా???? నాకు తెలుసు....

ఎవరికీ చెప్పుకోలేక, ఏడుస్తూ పడుకున్న రాత్రుళ్ళు, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోతాయ్ అని నీకు తెలుసా??? నాకు తెలుసు....

అత్తమామలని సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నా...'వాళ్ళు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నావ్'  అని భర్త సూటిపోటి మాటలు అంటుంటే...మనసు పడే  మధన ఏంటో నీకు తెలుసా??? నాకు తెలుసు....

భర్త సుఖంగా సంతోషంగా ఉండాలని ఎన్నో ఉపవాసాలు చేసే అమ్మాయిని, తన భర్తే , నేను సుఖంగా ఉంటే  నువ్వు ఓరవలేవు అన్నప్పుడు...దేవుడిపై  ఉన్న నమ్మకం కూడా కరిగిపోతుందని నీకు తెలుసా??? నాకు తెలుసు....

ఏ మగాడితో మాట్లాడినా పెడర్థాలు తీసి, సంబంధం అంటగట్టి దెప్పి పొడిచే  మాటలు అంటుంటే ఆ మనసు పడే ఆవేధన ఎలా ఉంటుందో  నీకు తెలుసా?? నాకు తెలుసు....

దేవుడు కూడా దయతలచడం లేదని, ఏ దిక్కు లేక తల్లిదండ్రులే దిక్కు అనుకుని...'అమ్మ నేను సుఖంగా లేను...నాన్నా నేను ఇక అక్కడ ఉండలేను' అని మొరపెట్టుకున్నప్పుడు.....పిల్లల మొహం చూసైనా సర్దుకుపో తల్లి...అతను మగాడు....ఎం చేసినా చెల్లుతుంది...ఆడపిల్లవి నువ్వే సర్దుకుపోవాలి....ఎప్పటికైనా అతనే నీకు దిక్కు...ఇక అదే నీ ఇల్లు....వెళ్ళు తల్లి అన్ని అవే సర్దుకుంటాయ్...అని పైకి  ధైర్యం చెబుతూ...ఏమి చేయలేక లోలోపల వాళ్ళు పడే బాధ చూస్తే..ఆ గుండె పడే వేదన ఏంటో  నీకు తెలుసా??? నాకు తెలుసు.....

ఆత్మాభిమానం చంపుకుని..మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టి జీవస్చవంలా   బ్రతుకుతుంటే......'ఎలా ఉన్నావ్'  అని నా ప్రాణ స్నేహితురాలు అడిగినప్పుడు... "fine, all is well" అని రాని చిరునవ్వుని పెదవులకి పులుముకుని, పైకి వచ్చే కన్నీళ్ళని ఆపినప్పుడు....నరనరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధ నీకు తెలుసా??? నాకు తెలుసు....నాకు మాత్రమే తెలుసు....""


...చదువుతుంటేనే గుండె భారంగా అనిపిస్తోంది...కదా??? ఎవరో తెలియని అమ్మాయి రాసింది చదివిన మీకే  అలా ఉంటే...నా ప్రాణ స్నేహితురాలు ఇలా రాసుకుంది అని తెలిసి నాకు ఒక్క సారి ప్రపంచమంతా తలక్రిందులైనట్టు అనిపించింది....

ఇలా చదువుతుండగానే....hey కావ్య....ఇదిగోనే నీ special coffee అంటూ వచ్చింది....వెనక్కి తిరిగి చూసాను....పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ  చేరగనివ్వని నా స్నేహితురాలు....ఎన్నో విషయాల్లో నాకు inspiration...నాకు ఎన్నో సలహాలు ఇచ్చిన నా స్నేహితురాలి మనసులో ఇంత బాధ దాగి ఉందా??? అని తన మొహంలోకి చూస్తూ నిలబడిపోయా...అంతే...నా చేతినుండి తను రాసుకున్న... " Letters  to  GOD " అనే title  ఉన్న డైరీని లాక్కుని, ఇదెందుకు తీసావ్? అంది కంగారుగా....


ఇక ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు....ఏదైనా అడిగితే ఏడుపు....ఏడిపించటం ఎందుకులే....కాస్త కుదుటపడితే తనే  చెప్తుంది అనుకుని ఇంటికి వచ్చేసా...

ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం ఎలా ఉంటామో మీకు seperate గా చెప్పాల్సిన పని లేదుగా...రోడ్ మీద జరిగిన చిన్న విషయానికే (మన సహాయం పోస్ట్ లో చెప్పాగా) గంటలు గంటలు thinke నాకు .... నా చిన్నప్పటినుంచి కలిసి ఉన్న స్నేహితురాలి గురించి ఇలా తెలియటం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి....అవే ఆలోచనలు, నిద్ర పట్టదు...ఆ diary నే గుర్తొస్తోంది...అందులోని మాటల echos వినిపిస్తూనే ఉన్నాయ్...అలా ఆలోచిస్తూ ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయా....(సినిమాలో చూపించినట్టే నా ముందు గిరగిరా ఒక చక్రం తిరిగింది )

దివ్య శృతి ....ఆనందానికి, అల్లరికి మారుపేరు......తను చేసే అల్లరి తట్టుకోవటం ఒకింత కష్టమే...ఒక్కోసారి అది చేసే పనులకి కోపం కూడా వచ్చేది....మన కోపాన్ని మన మనసు కన్నా fast గా కనిపెట్టేసి ఒక cute smile ఇచ్చేది....అది చూసాక ఇక మనం ఏమి అనలేం...తనతో పాటే నవ్వేయటం తప్ప. తన స్మైల్ తనకంటే అందంగా ఉంటుంది మరి...అలా అని అల్లరి పిల్ల అనలేమండోయ్...చాలా తెలివైనది...చదువులో ఎప్పుడూ ముందుండేది....ఎంతో గొప్ప కలలు కనేది...బాగా చదువుకోవాలి...మంచి ఉద్యోగం చేయాలి....ఉద్యోగం చేసి మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు అంతా..తను మాత్రం ఎప్పుడూ అనేది...'నాన్న నా కోసం చాలా కష్ట పడ్డారు, అప్పు కూడా  చేసారు , job చేసి తన ప్రాబ్లంస్  అన్ని తీర్చేసి, తనకి రెస్ట్ ఇవ్వాలి' అని. ఇలా అన్నో ఆశలు, ఆశయాలు తనవి..


అలా  మేము ఫైనల్ ఇయర్ లో ఉండగా ఒకరోజు తను నా దగ్గరకి వచ్చి....'కావ్య నాకో హెల్ప్ చేస్తావా' అంది....'నేనా??? నువ్వు అడగటం నేను చేయకపోవటమా...చెప్పు' అన్నాను....'నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ...నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు....నా ప్రాబ్లం నీకు తెలుసు..పెళ్లి అయితే నేను అనుకున్నదేది చేయలేను, నాన్నతో మాట్లాడి ఎలా అయినా ఒప్పించవా ఇప్పుడే వద్దని '  అంది...
నేను భయపడుతూనే...తనకోసం....లేనిపెద్ధరికాన్ని తెచ్చుకుని...అంకుల్ ని   కలవటానికి వెళ్ళా...నన్ను చూస్తూనే...."ఏంటి రా కావ్య, దివ్య పెళ్ళంటే వద్దంటోంది, విషయం ఏంటో కనుక్కో అన్నారు"...అప్పుడు నేను.
 " నేను అది మాట్లాడటానికే వచ్చా అంకుల్, తను పెళ్లి వద్దు అనటం లేదు....ఇప్పుడే వద్దంటోంది" అని తన అనుకున్నవన్నీ అంకుల్ కి చెప్పాను'. సరే అయితే తన ఇష్టం, ఉద్యోగం వచ్చాకే చూద్దాంలే...మంచి సంబంధం అని ఆలోచించాను అంతే అన్నారు అంకుల్ ....ఒక్కగానొక్క కూతురు నొప్పించలేక....అలా  అని వెళ్ళిపోయారు అంకుల్.
ఇది జరిగాక కొన్నాళ్ళు అంతా  బాగానే ఉంది..ఒకరోజు నేనూ ,దివ్య వాళ్ళింట్లో చదువుకుంటూ ఉండగా ...అంకుల్ వచ్చి...."వాళ్ళతో , మాట్లాడానురా, మీరు job కోసమే గా పెళ్లి వద్దన్నారు....వాళ్ళు పెళ్లి అయ్యాక job చేయటానికి ఒప్పుకున్నారు. అబ్బాయి కూడా చాలా మంచివాడు, ఉద్యోగం, తన ఆశయాలు, ఆలోచనలు దేనికి ఎప్పుడు అడ్డు చెప్పను అన్నాడు. ఇప్పుడైనా హ్యాపీనా దివ్య??" అని చాలా సంతోషంగా అన్నారు  అంకుల్....ఇది విన్న నేను great  అంకుల్, అలా అయితే దివ్య కి కూడా ఏం objection లేదనుకుంటా...అని తన వైపు చూసా....వద్దనటానికి reason ఏం లేక, తన తండ్రి మొహం లో సంతోషం చూసి  సరే అనేసింది...తర్వాత వెంటవెంటనే engagement ,పెళ్లి జరిగిపోయాయి ....పెళ్లి రోజు ప్రతి క్షణం తనతోనే ఉన్నా...ఇక వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమి మాట్లాడలేక అలా తన కళ్ళలోకి  చూసి వెళ్ళిపోయాను ....ఇక తను మాకు దూరం అవుతోంది అనే ఫీలింగ్ వచ్చేసింది ఎందుకో!!!!

కాలం చాలా తొందరగా గడిచిపోయింది....నాకు పెళ్లి అయ్యి, నా లైఫ్ తో నేను busy అయిపోయాను....మనసులో ప్రేమలు అలానే ఉన్నా మాట్లాడుకోవటం, కలుసుకోవటం తగ్గిపోయింది.....ఇక పిల్లలు పుట్టాక మరీ...ఫ్రెండ్స్ ని కలవటం, గుడికి వెళ్ళటం, ఆకరికి అమ్మ వాళ్ళతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మిస్ అయిన  ఫీలింగ్ . అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా...తను కాఫీ తీసుకొస్తా అని కిచెన్ లోకి వెళ్తే....చాలా casualగా తన చీరలు చూద్దాం అని అలమార ఓపెన్ చేసిన నాకు...."Letters To God" అని పెద్దపెద్ద అక్షరాల్లో డైరీ కనిపించింది...ఓపెన్ చేసాను.....పర్సనల్ డైరీ   చదవటం తప్పు అనిపిస్తున్నా.... అందులో ఆవేదన....బాధ అనే పదాలు కనిపించి చదవకుండా ఉండలేకపోయా...
ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నా, చెప్పాలనిపించినప్పుడు చెప్తుంది అని మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా...అవే ఆలోచనలు...మేము అదృష్టవంతులం....మంచి వాళ్ళు దొరికారు....హ్యాపీ లైఫ్ అనుకునేదాన్ని....అలాంటిది....తను అంత బాధ పడుతోందా??....ఇక నా వల్లకాదని....ఒకరోజు తనని మా ఇంటికి రమ్మన్నాను...ఏం జరిగిందో చెప్తే కానీ వెళ్ళనివ్వను అని మొండికేసాను....గుండెలు పగిలేలా గట్టిగా ఏడ్చేసింది...జరిగింది చెప్పటం మొదలు పెట్టింది...

తన మాటల్లోనే " పెళ్ళికి ముందు 'అంతా నా ఇష్టం' అన్న మా అత్తింటివాళ్ళు...పెళ్లి అయ్యాక మాట మార్చేసారు...ఏదీ నాకు ఇష్టం అయినట్టు ఉండదు...మొదట job  చేయొచ్చు....జీతం కూడా నాన్నకి ఇవ్వొచ్చు అన్నవాళ్లు...నా మొదటి నెల జీతం రాగానే...అందులో నుండి కొంత కూడా నాన్నకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు...అలా ఎలా ఇస్తావ్ అని పెద్ద గొడవ చేసారు...డబ్బు నిజంగానే పాపిష్టిదే కావ్య...తర్వాత ఏవో అనుమానాలు, అవమానాలు...ఉద్యోగమే మాన్పించేసారు ....ఏమైనా అంటే...ఇంట్లో పని ఎవరు చేస్తారు అంటారు....అమ్మాయి అంటే ఇంటి పని, వంట పని చేయాలి అని ముద్ర పడిపోయింది వీళ్ళకు...ఉద్యోగం చేసేటప్పుడు కూడా పనంతా నేనే చేసేదాన్ని..అయినా నా ఇల్లు, నా వాళ్ళే  కదా అని సంతోషంగా చేసేదాన్ని....అలాగే చేస్తా అన్నా ఒప్పుకోలేదు....ఒక్కటి అంటే ఒక్కటి కూడా నా ఇష్టానికి జరుగదు....పొద్దున లేస్తే పేస్టు దగ్గర్నుంచి, breakfast ,lunch, ఆకరికి టీవీ చూడాలన్నా....అన్నిటికి adjust అవ్వాలి ,వాళ్ళకి నచ్చిందే చేయాలి.......సరదాగా బయటకి వెళ్ళినా ఏదో వచ్చాం అన్నట్టు ఉంటారు.....సంతోషం అనేదే ఉండదు....నీకు ఏమైనా కావాలా అని అడిగిన పాపాన పోరు...అదే నాన్నతో బయటకి వెళ్తే...ఏం కావలి,ఏం తింటావ్? హ్యాపీ నా??  అని ఎన్ని సార్లు అడిగేవారో... ఎందుకు కావ్య,నా లైఫ్ ఇలా అయ్యింది??? అమ్మాయిలు పెళ్ళైతే మారిపోవాలా?? ఆడపిల్లగా పుట్టటం పాపమా?? మన ఇంట్లో మహారాణీలా ఉండే మనం పెళ్లి అవ్వగానే...అత్తారింట్లో బానిసలా ఉండాలా??  పోనీ బానిస అనుకోవటం ఎందుకు వాళ్ళు నా వాళ్ళే అనుకుని కలిసిపోతుంటే ,నన్ను తమ మనిషిలా చూడలేరా???మాటలు అంటుంటే ఎలా??? అపురూపంగా చూసుకునే అమ్మానాన్న కూడా ఇప్పుడు ఏం చేయలేక ఎడుస్తున్నారు ...నాకోసం నిలబడరే ??" అని తన మనసులోని బాధంతా చెప్పింది...

నాకు నిజంగా ఇది నమ్మాలో లేదో కూడా అర్ధం అవ్వలేదు...సరదాగా నవ్వుతూ ఉండే దివ్య మనసులో ఇంత బాధ ఉందా అనిపించింది....'దివ్యా ఉద్యోగం ఎందుకు మానేసావ్??  అని ఎవరైనా అడిగితే...చిరునవ్వు నవ్విందే తప్ప...తను సంతోషంగా లేనని ఎప్పుడూ చెప్పలేదు.....అలా  ప్రవర్తించలేదు కూడా...వాళ్ళాయన చాలా 'మంచివాడు'  అనే పిక్చర్ మా మనసులో తనే ముద్రించేసింది.....నిదానంగా, ఓపికగా, ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు చేరగనిచ్చేది కాదు....

ఆలోచిస్తే అనిపిస్తుంది...ఆడపిల్ల అంటే అంతేనేమో.....పెళ్లి అయ్యాక నా అనే మాటకి స్థానం లేదేమో...పెళ్లి అయ్యాక అమ్మాయి జీవితం ఎంత మారిపోతుందో కదా...20 ఏళ్ళు ఎంతో గారబంగా పెరిగి..తనకి నచ్చినట్టు ఉంది..నచ్చిన డ్రెస్, నచ్చిన ఫుడ్, అన్ని తనకి నచ్చినట్టే...మహారాణిలా ఉండే అమ్మాయి...సడన్ గా పెళ్లి అవ్వగానే కొత్త ఇంట్లో, కొత్త వాళ్ళ మధ్య ఉండాలి...అమ్మాయిలు, సొసైటీ ఎంత మోడరన్ అవుతున్నా ఈ పద్ధతి అయితే మారదు...అదే ఒక అబ్బాయి అలా వాళ్ళ వాళ్ళని వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉంటారా??? ఊహించుకోండి !!!!!

అలా కొత్త వాళ్ళతో ఉండే అమ్మాయి అన్నిటికి adjust అవుతూనే ఉంటుంది....కట్టుకున్నవాడు, అత్తమామలు మంచివాళ్ళు అయితే ఆ adjustment  కూడా సంతోషంగా చేస్తుంది...అదే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, తనని అర్ధం చేసుకోకపోతే?? తన జీవితమే ఒక adjustment అయిపోతుంది...కానీ తను పడే నరకం ఎవరికి  తెలుస్తుంది....ఒక్క ఆ అమ్మాయికి తప్ప..

అమ్మాయిని చిన్నప్పట్నించి కష్టపడి పెంచి అప్పోసొప్పో చేసి చదివించి, కట్నం అంటూ మళ్ళీ అప్పు చేసి...పెళ్లి చేస్తే పోషించటం భర్త భాద్యత కాదా??? ఆ అమ్మాయి సుఖంగా లేను అని తల్లిదండ్రులకి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అడగకుండా...సర్దుకుపోమనటం తప్పు కాదా....తను ఏ అఘాయిత్యమో చేసుకుంటే???ముమ్మాటికి తప్పు మీదే అవుతుంది 'తల్లిదండ్రులు'....

నాకు అర్ధం అవ్వక అడుగుతానండి....నా స్నేహితురాలికి 20 లకారాలదాక కట్నం ఇచ్చారు మా అంకుల్...చాలా అప్పులు కూడా చేసి...అంటే మీ కూతురిని ఏ కష్టం లేకుండా పోషిస్తాం అని ఆ డబ్బు తీసుకున్నట్టా? అలా  అయితే  హ్యాపీ గా  ఉంచాలి కదా ?? తనని పోషించటానికే అయితే తన ఉద్యోగం, జీతం ఉందిగా? పోనీ మరి కట్నం ఉందిగా, జీతం అయినా  అమ్మానాన్నలకి ఇవ్వొచుగా ??? వాళ్ళు తన పెళ్ళికోసం చేసిన అప్పులు తీరేదాక అయినా??
కట్నం జీతం రెండూ అమ్మాయి కర్చులకే  ???

లేక నా కొడుకుని ఇంత కర్చు చేసి చదివించాం....మావి మాకు ఇస్తే అబ్బాయిని అప్పగించేస్తాం అన్నట్టా??? ఇక ఇదంతా చాలదన్నట్టు ఆడపడుచు కట్నం అంటూ మళ్ళీ  ఓ లకారం తీసుకున్నారు...అంటే మా అన్నయ్య తో ఉన్న అనుబంధం తెంచేసుకుంటాను లేదా తగ్గించుకుని నీకు అప్పగించటానికి నాకు కొంత సొమ్ము కావలి అన్నట్టా???

బాబోయ్!!!!!మీరు మరీ అలా కొట్టేసేలా చూడకండి....ఇవన్నీ నా మట్టి బుర్రకి వచ్చిన doubts ....అది అడిగే      యక్షప్ర శ్నలూనూ  :D

NOTE:  నేను ఎవరినీ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడటం లేదు....నా ఫ్రెండ్ కి జరిగింది మాత్రమే చెప్పానంతే....ఎవరూ దీన్ని -ve గా తీసుకోవద్దని మనవి....
ఇంకో విషయం , అమ్మాయిలంతా కష్టపడిపోతున్నారు....మేమే ఎందుకు పనులన్నీ చేయాలి???అబ్బాయిలతో చేయించాలి....అబ్బాయిల జులుం నశించాలి...విప్లవం వర్ధిల్లాలి type అస్సలు కాదండోయ్....
మేము(అంటే అమ్మాయిలం) ఏది చేసినా సంతోషంగా చేస్తాం...'మన' వాళ్ళకే చేస్తున్నాం అనే త్రుప్తి ఉంటుంది  ..so, ఆ 'మన' అనే పదానికి న్యాయం చేయండి చాలు :)
అలాగే నేను మగాళ్ళంతా మంచివాళ్ళు కాదు అనటం లేదు....ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు...అందరికి వందనములు :)....నేను చెప్పింది మంచివాళ్ళు కానీ వాళ్ళ గురించి...ex :నా  ఫ్రెండ్ case


                                                                                                            .............మీ కావ్యాంజలి ♥♥♥

Tuesday, 20 November 2012

సహాయం...


నేను నా ఫ్రెండ్ ఒకరోజు బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం....ఇంతలో ఒకతను నా దగ్గరకి వచ్చి, అక్కా నా పర్స్ పోయింది ఒక 15 రూపాయిలు ఇస్తారా....ఇంటికి వెళ్ళటానికి బస్ ఛార్జ్ కూడా లేవు అన్నాడు....నేను ఒక blank  look ఇచ్చాను.....కావాలంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండక్క 15 రూ రీచార్జ్ చేయిస్తాను అన్నాడు ......డబ్బులూ ఇచ్చి, ఫోన్ నంబరూ ఇచ్చి.....అంత పుణ్యం నాకెందుకులే అనుకుని.....20 రూ ఇచ్చాను...థాంక్స్ అక్కా అని పరిగెత్తుకెళ్ళి బస్సు ఎక్కేసాడు....

ఇంకోరోజు మళ్లీ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుండగా...అక్కా అక్కా  ఆకలేస్తుందక్క అని చేయి చాచాడు.....ఇదేంటి పిల్ల ఏమైనా మదర్ తెరెసాలా కనిపిస్తుందా ఏంటి అందరికి?? అని అనుకుంటున్నారా?? లేదండి, కుర్రాడు అడుక్కునే పిల్లాడు...నాకెందుకో పిల్లలు అడుక్కుంటే భలే చిరాకు....లా అడుక్కోమని పంపించే తల్లిదండ్రులంటే మహా చిరాకు....ఇక పిల్లలని వడిలోనే పెట్టుకు అడుక్కునే మృగాలూ లేకపోలేదు,వాళ్ళంటే  పరమ  చిరాకు...

సో....వాడిని చిరాకుగా చూపు చూసి, "ఎందుకురా అడుక్కుంటావ్ ....సిగ్గులేదు??? ఎవరు చెప్పారు ఆకలేస్తే అడుక్కోమని....మీ అమ్మా ?? "అన్నాను....వాడు చాలా అమాయకంగా అవునక్కా...అని వాళ్ళమ్మని చూపించాడు...కుష్టు అనుకుంటా, చేతులకి గుడ్డలు కట్టుకుని రోడ్ పక్కన కూర్చుని ఉంది...

"ఏయ్ కావ్య...నీకు ఇష్టం అయితే  ఇవ్వు లేదంటే మానెయ్.....మొన్న వాడెవడో పర్స్ పోయిందంటే ఇచ్చావ్గా ....వీడికి రూపాయి ఇవ్వటానికి క్లాసులు పీకుతావే??" అని నా ఫ్రెండ్ తిట్టటం మొదలెట్టింది....ఇంతలో బస్సు వచ్చేసింది...
నేను ఇంకా వాడికి హిత బోధ చేసే నిలోనే ఉన్నా....నా ఫ్రెండ్ అబ్బా,కావ్య ఇక ఆపవే...అని నా చేయి పట్టుకుని లాగి మరీ క్కించేసింది బస్...బస్ ఎక్కిన  రెండు నిముషాలకి నేను పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ......డ్రైవర్ వైపు చూసి...అంకుల్ బస్సు ఆపండి నేను దిగేస్తా అన్నాను ...అసలు ఏం జరిగిందో  అర్ధం అవ్వక అయోమయంలో పడిపోయి...షాక్ అయ్యి ఆపేశారు...."షాక్ అయ్యి" అని specificగా ఎందుకు అన్నానంటే....జనరల్గా అయితే బ్రతిమాలినా ఆపరు....దీని గురించి ఒక జోక్ లాస్ట్లో చెప్తానులెండి....

అలా బస్ ఆగగానే నేను గబా గబా దిగేసాను...నా ఫ్రెండ్ బస్సు డ్రైవర్ కన్నా కాస్త ఎక్కువే షాక్ అయ్యింది...ఏమొచ్చింది దీనికి అనుకుని...ఒసేయ్ కావ్య ఆగు ఏం  అయ్యింది అంటూ, నా వెనకాలే వచ్చింది...
నేను ఆ పిల్లాడి దగ్గరకి వెళ్లి ,20 రూపాయిలు వాడి చేతిలో పెట్టి...సారీ అని చెప్పేసి....కామ్గా వచ్చి వేరే బస్సు ఎక్కేసా....ఎందుకో కానీ ....తెలీకుండానే ఒకరిని ఎంత తిట్టేసాను..పాపం చిన్న పిల్లాడు...అసలు సరిగా తెలుసుకోకుండా ఏదో ఊహించేసుకుని ఒకరిని ఎలా blame  చేస్తాం అని చాలా బాధతో....రోజు ఒక్క టాపిక్ కూడా వదలకుండా నా ఫ్రెండ్ బుర్ర తినేసే నేను... రోజు చాలా కామ్గా కూర్చున్నా...నా ఫ్రెండ్ నా మూడ్ నార్మల్ చేయటానికి విశ్వ ప్రయత్నం చేసి...ఇక తన వల్లకాదని, విసిగి వేసారి..."ఏంటోనే కావ్య నువ్వు నాకు అర్ధం కావు" అని చేతులెత్తేసింది...

ఇక తన స్టాప్ రాగానే..."మళ్ళీ వెనక్కి పరిగెత్తేవు....మీ ఆయన్ని tension పెట్టకు...తిన్నగా ఇంటికి వెళ్ళు...కాసేపు పడుకో మూడ్ అదే సెట్ అవుతుంది"...అని చెప్పి మరీ వెళ్ళింది...

అలా చాలా డల్గా ఇంటికి వెళ్ళిన నాకు, మా అమ్మ దగ్గర్నించి ఫోన్ వచ్చింది....హా అమ్మా చెప్పు అన్నాను...అదేంటో వెంటనే...."ఏంటే అంత డల్గా ఉన్నావ్అంది...ఎంతైనా అమ్మ కదా...ఒక్క మాటతో కనిపెట్టేసింది...  ఏం లేదమ్మా అని మొదలెట్టి జరిగినదంతా చెప్పాను....almost  ఎడిచేసాననుకోండి....
అప్పుడు మా అమ్మ "అయ్యో!!! పిచ్చి పిల్లా దీనికే బాధ పడతారా?? నీకు ఒకటి చెప్పనా...అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేసానో తెలుసా..అప్పట్లో మన ఇంట్లో వెంకటమ్మ అని ఒకామె పనిచేసేది గుర్తుందా??? అంది.

,ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అన్నాను...

"చెప్తున్నా కదా...అంత తొందరేంటో  నీకు...ఇప్పుడు ఆమె హైదరాబాద్లోనే ఉంటుంది...పోయిన నెల వచ్చి 8000 రూపాయిలు ఇచ్చి,' అమ్మా, ఇవి నీ దగ్గర దాచి ఉంచుమళ్లీ వచ్చే నెల కూడా కొంత డబ్బు తెస్తా...అంతా కలిపి నా మనవరాలికి బంగారు గొలుసు కొందాం' అని చెప్పి వెళ్ళింది" చెప్పింది మా అమ్మ..

అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్ మా?? అన్నాను విసుగ్గా.

" !!!! గొలుసు షాపింగ్ చేయాలి" అంది మా అమ్మ వెటకారంగా...

పొమ్మా....అసలే నేను బాధగా ఉంటే....ఏం  మాటాడుతున్నావ్ నువ్వు??....అన్నాను నేను..

"అబ్బా!! చెప్పేది పూర్తిగా వినవే, అసలు వెంకటమ్మ హైదరాబాద్లో  ఏం చేస్తుందో తెలుసా?? గుడి దగ్గర అడుక్కుంటోందిట ....చెప్తే నేను షాక్ అయ్యాను తెలుసా " అంది మా  అమ్మ.
నేను 'వాట్????' అని షాక్ లో కాసేపు కాం  అయిపోయా
అప్పుడు మా అమ్మ అనింది..."సో....నువ్వు మరీ అంతలా ఫీల్ అవ్వకు....ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే నువ్వు  పిల్లాడిని తిట్టావ్...నీ తప్పేం ఉంది" అని.

కానీ నేను సెట్ అవ్వటానికి చాలా టైం పట్టింది...ఆ రోజంతా దానిగురించే ఆలోచిస్తూ ఉన్నాను....ఏంటి మాత్రానికే అంతలా అలోచించి మూడ్ పాడుచేసుకోవాలా అనుకుంటున్నారా???? ఏంటో,నేను అంతేనండి !!!!!

ఇలా ఉండగా ఒకరోజు నేనూ,మా వారు  సరదాగా బయటకి వెళ్లి, నాకు ఎంతో ఇష్టమైన పానీపూరి తింటుండగా....ఒక చిన్న పిల్లాడు వచ్చి....exactly, correct గా guess  చేసారు.....ఎదావిధిగా అక్కా ఆకలేస్తుంది అన్నాడు ...నేను రాకెట్ స్పీడ్లో మా వారి పాకెట్ నుంచి 5 రూపాయిలు తీసి ఇచ్చాను. పానీపూరి బండివాడు "అబ్బో!!" అన్నట్టు చూపు చూసాడు, మా వారేమో తింగరి దానితో వేగలేం  మనకెందుకులే బాబు అనుకున్నారేమో కామ్గా ఉన్నారు......
పిల్లాడి మోహంలో కాస్త అయినా సంతోషం లేదు....తిట్టకుండానే ఇచ్చానే  ఏం అయ్యింది వీడికి అని వాడినే గమనించాను...వాడు వాళ్ళ అమ్మ అనుకుంటా, రోడ్ పక్కన ఉన్న ఒకావిడ దగ్గరకి వెళ్ళాడు...ఏం మాట్లాడుకున్నారో కానీ...ఆవిడ వీడి తలమీద ఒక్కటిచ్చి...డబ్బులు లాక్కుని సంచిలో పెట్టుకుంది(అమ్మ అని నేను అనుకున్నాను..కాని కొట్టి లాక్కున్నాక కాదేమో అనిపించింది...బహుశా వాళ్ళ team lead ఏమో మరి)....వాడు మళ్లీ  వచ్చి మా పక్కన ఉన్నవాళ్ళని అడుక్కుంటున్నాడు....నేను చాలా ఆలోచించి...ఒక చాట్ పార్సెల్ చేయించి వాడికి ఇచ్చాను....
మళ్లీ ,as usual, మా పానీ పూరీ  బండివాడు నన్ను ఎగా దిగా చూసి పెదవి విరిచాడు, మా వారేమైనా తక్కువా....వాడికన్నా భయకరంగా అదోల చూస్తున్నారు నా  వైపు....'5రూపాయిలు ఇస్తే పోనిలే దీని వెర్రి అనుకుంటే... చాట్ ఇస్తోంది 'అని...కానీ దానికి సమాధానం నాకు మాత్రమే తెలుసు...డబ్బులు ఇచ్చినప్పుడు లేని సంతోషం, ఫుడ్ ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించింది...

అలా మా షాపింగ్ అంతా అయ్యాక ఇంటికి వెళ్తుంటే...5 రూపాయిలు ఇచ్చినప్పుడు జరిగింది గమనించని మా వారు అడిగారు....డబ్బులు ఇచ్చావ్...మళ్లీ చాట్ ఎందుకు ఇచ్చావ్ అని.....జరిగినదంతా చెప్పాను...అంతకు ముందు నాకు జరిగిన అనుభవాలు కూడా చెప్పాను....అప్పుడు తను అన్నారు..."మన సొసైటీలో సహాయం చేయటం సులభమే....సహాయం పొందటం కూడా మరీ కష్టమేమి కాదు....కాని మనం చేసే సహాయం సరైన వాళ్ళకి చేయటమే చాలా కష్టం.... నిజంగా అవసరంలో ఉన్నవాళ్లకే అందుతుందా అని తెలుసుకోవటం చాలా కష్టం " అని.

బాగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది...నిజమే....సహాయం చేయాలని చాలా మందికి ఉంటుంది....కానీ అది సరైన వాళ్ళకి చేరుతుందో లేదో అనే అనుమానమూ ఉంటుంది......నాకు షాప్స్లో....పెట్రోల్ పంప్లో డొనేట్ చేయమని పెట్టే డబ్బాలు చూస్తే అనిపిస్తుంది...అవి నిజంగా అవసరమైన వాళ్ళకి చేరుతాయా అని....కాని అది సరైన వాళ్ళకి చేరితే, సహాయం చేసినవాళ్ళకీ, తీసుకున్నవాళ్ళకీ అందరికీ సంతోషమే :)

బాగా analyse చేస్తే  నాకు అనిపించింది.....2005లో 35,000 కోట్లు ఉన్న మన రాష్ట్ర బడ్జెట్....ఇప్పుడు 1,45,854 కోట్లు న్నా  కానీ....అదే పేదరికం,అవే ఆకలి చావులు,అవే కరెంటు కష్టాలు...దీనికి కారణం  గవర్నమెంట్  పెట్టే  కర్చు సరైన వాళ్ళకి చేరటం లేదనే....

ఇక్కడ కూడా అదే సమస్య....సహాయం చేయటానికి సరిపడా డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంది... సహాయం కోసం సామాన్య ప్రజలూ ఎదురు చూస్తున్నారు. కానీ  గవర్నమెంట్ చేసే సహాయం పేదవాడికి అందుతోందా???          
                                                                                                                                                                                                                                                          
                                                                Hands that Help are Holier than Lips that Pray                                 


               We ourselves feel that what we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop


అయ్యో!!మర్చిపోయాను అనుకున్నారా,లేదండి చెప్తా చెప్తా జోక్ :D
ఒకరోజు నేను,నా  ఫ్రెండ్ బస్సులో కాలేజీ నుండి ఇంటికి వస్తున్నాం ....బస్ స్టాప్ సిగ్నల్కి కాస్త దూరంలో ఉంది ....సోమేము సిగ్నల్ దగ్గర బస్సు ఆగితే దిగేద్దాం అని ముందుకి వచ్చాం.... రెడ్ సిగ్నల్ పడలేదు......నా ఫ్రెండ్ అంకుల్ 1 సెకండ్ స్లో చేయండి మేము దిగేస్తాం అని రిక్వెస్ట్ చేసింది...ఆయన చిరాగ్గా చూపు చూసారుఆపలేదు... ఇంతలో ట్రాఫిక్ జాం అయ్యి బస్సు స్లో అయ్యింది...మేము దిబోయాం....  డ్రైవర్ గారు....మా వైపు చిరాగ్గా చూస్తూ "సీదా  పర జానా హై "? అన్నారు....హిందీ అంతంత మాత్రం వచ్చిన నా ఫ్రెండ్, అవును అన్నట్టుగా తల ఊపి దిగేసింది...వెనకే నేనూ దిగాను....తర్వాత ఆయన అన్నదానికి అర్ధం ఏంటో నేను నా  ఫ్రెండ్కి చెప్పి...ఇద్దరం ఇల్లు చేరుకునేదాక నవ్వుకున్నాం.....
ఇంతకీ ఆయన అన్నదానికి అర్ధం ఏమిటో తెలుసా???(హిందీ రానివాళ్ళ కోసం) పైకి పోవాలని ఉందా అని....నా  స్నేహితురాలేమో....మీరు ఇటే వెళ్ళాలా అని అడిగారేమో అనుకుంది...అదన్నమాట సంగతి :)


                                                                                                      .............మీ కావ్యాంజలి ♥♥♥
 

View Count
Useful Links