మా వాడి హోంవర్క్ తో నేను పడే తిప్పలు గురించి మీ అందరికి తెలిసిందే...ఇక మా వాడి స్కూల్ అడ్మిషన్ ముచ్చట్లు చెప్తా వినండి....

నాకెందుకో ఒక్కసారి గుండె మీద రాయి పడినట్టయ్యింది .....అరె నా చిట్టి తండ్రి అప్పుడే స్కూల్ కి వెళ్ళేంత పెద్దవాడైపోయాడా?? అని....ఇదే మాట అమ్మతో చెప్తే...."పిల్లలు ఎంత పెద్ధవాల్లైనా అమ్మ కళ్ళకి వాళ్ళలాగే కనిపిస్తారు,ఎలాగు వాడి అల్లరికి ఓ అడ్డు అదుపు లేకుండా పోతోంది....నీకూ కాస్త రెస్ట్ ఉన్నట్టు ఉంటుంది....అయినా నువ్వు నా కొడుకు ఇంకా పసిపిల్లాడే అని ఈ సంవత్సరం వేయను అంటే..వాడి తోటి పిల్లలకన్నా ఒక క్లాసు వెనకపడిపోడూ???" అంది అమ్మ...
ఇది జరిగాక...నేను ఇంటర్నెట్ లో "best schools in hyderabad " వేట మొదలెట్టా....అబ్బబ్బో....ఏమన్నా reviewsaa అవి.....ఒకరు సూపర్ అంటారు...ఒకరు ధబెల్న కింద పడేస్తారు.....ఇక ఇలా కాదని నేనే చాలా enquiry చేసి...చాలా మంది పేరెంట్స్ ని కనుక్కుని కొన్ని నాకు అనువైన స్కూల్స్ ని finalize చేసుకున్నా....

అయ్యో ఇంకో ఇన్సిడెంట్ చెప్పాలండోయ్ మీకు, మా వారి ఫ్రెండ్ వాళ్ళ పాప అడ్మిషన్ కోసం ఒక స్కూల్ కి వెళ్తూ ,మా వారిని కూడా తీసుకెల్లారట.....అక్కడ ప్రిన్సిపాల్ మేడమ్ గారు.....డైరెక్ట్ గా డొనేషన్ ఎంత ఇద్దాం అనుకుంటున్నారు అన్నారట.....వీళ్ళు అదేంటి అందరిదగ్గర ఒకే amount తీసుకోరా?? అనుకుని... ఫీ తో కలిపి ఓ లక్ష వరకు అని ఈయన నసుగుతుండగా(ఈ విషయం మావారు నాకు చెప్తుంటే, అమ్మో లక్షే ???? అని నోరు తెరిచా నేను...దానికి మా వారు దోమలుదూరుతాయ్ అనుకున్నారేమో మూతిమీద టప్ మని ఒకటిచ్చి కంటిన్యూ చేసారు )ఆ మేడం గారు సీరియస్ గా మొహం పెట్టి, 'ఏంటండి ?? మీ వైఫ్ కూడా software job అన్నారు?? 2 lakhs అయినా ఇవ్వలేరా??' అన్నారట.... ఆయన పాపం మారు మాట్లాడకుండా పద అన్నట్టు సైగ చేసారట మా వారికి.....
ఆస్తులు సంపాదించి ఇవ్వటం కన్నా (అంటే ఇప్పుడు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరిగిపోయి,రేట్స్ బాగా పెరిగిపోయాయి కదండి.....సో, ఆస్తులు మనవల్ల ఎలాగూ అవ్వదు)...మంచి education ఇవ్వటం బెటర్ అని ఫిక్స్ అయ్యాం నేనూ , మా వారు....so , అలా నేను finalize చేసినవి 5 స్కూల్స్....LKG కోసం అడ్మిషన్ అయితే , పిల్లలకి జూలై కి 3 సంవత్సరాల వయసు ఉంటే eligable ....(ఒక్కో స్కూల్ ని బట్టి జనవరి నుండి జూలై కి 3 ఇయర్స్ (అంటే 3rd బర్త్ డే అయిపోయి)ఉండాలి)....అదో రూల్..ఇద్దరు పేరెంట్స్ PG (కొన్ని స్కూల్స్ లో తండ్రి PG, తల్లి డిగ్రీ) చేసి ఉండాలి అనేది ఇంకో రూల్...అన్ని చోట్ల గురించైతే నాకు తెలియదు కానీ హైదరాబాద్ లో అయితే...అడ్మిషన్స్ జనవరి నెలలోనే మొదలైపోతాయ్.....అడ్మిషన్ ఫార్మ్స్ నవంబర్/డిసెంబర్ లోనే ఇస్తారు......అవి కూడా 100/200 రూపాయిలు చెల్లించి తెచ్చుకోవాలి......అలా అన్నీ తెచ్చి ఫిల్ చేసి.....దానికోసం మా బుడతడివి, మావి ఫొటోస్ కూడా తీయించుకున్నామండోయ్.....మళ్లీ ఆ స్కూల్స్ అన్నీ తిరిగి వాటిని సబ్మిట్ చేసాం(కొన్ని స్కూల్స్ లో అయితే సబ్మిట్ చేయాలన్నా డబ్బు చెల్లించాలట.....ఎక్కడ, ఎంత దొరికితే అంత దండుకోవడమే అన్నట్టు ఉంది వ్యవహారమంతా)....
ఇక ఆ ఐదు స్కూల్స్ లో ఒక స్కూల్ ఇంటర్వ్యూ కి మా వారైతే ఆకాశమంత సినిమాలో ప్రకాష్ రాజ్ లా తెగ ప్రిపేర్ అయ్యారు(మన గురించి తెల్సు గా,lite అన్నమాట) ..కానీ ,వాళ్ళు కూడా అంతే రొటీన్ గా ఆ సినిమాలో ప్రిన్సిపాల్ లా ఫీజు గురించి తప్ప ఇంకేం మాట్లాడలేదు.....ఏమి అడగలేదని మా వారు disappoint కూడా అయ్యారు..ఆ స్కూల్లో ఫీ 2 లకారాలు అవుతుంది ,బస్సు ఛార్జ్ తో కలిపి అని తెలిసి అక్కడి నుంచి దుకాణం ఎత్తేసాం......మరో స్కూల్ కి వెళ్తే ఆ స్కూల్ ప్రిసిపాల్ చాలా గర్వంగా.....మా స్కూల్ కి 10th కి అన్ని ranks వచ్చాయ్ ,ఇన్ని ranks వచ్చాయ్ అని చెప్పి......మా పిల్లలకి 8pm వరకు స్టడీ అవర్స్ కండక్ట్ చేసి చదివిస్తాం తెలుసా? అన్నారు...అంతే ఖేల్ ఖతం, దుకాణం బంద్,తిరిగి చూడకుండా బయటకి వచ్చేసా..(నా బుజ్జి తండ్రి ఆరోగ్యం, కళ్ళు ఏమైపోనూ ?? వీళ్ళ జిమ్మడ అనుకుని)....ఇక మన 3rd స్కూల్.....భలే గొప్ప స్కూల్ లెండి....రిటర్న్ టెస్ట్ అన్నారు...మా వాడికి పెన్సిల్ పట్టడమే రాదూ.....లోపలికి తీసుకెళ్ళారు.....ఏమి గీకాడోగానీ, ఒకావిడ క్లోజ్-అప్ ad లా నవ్వుతు వచ్చి, 'your kid is selected ma'am,please find the fee details in the office ' అంది.....almost తీన్మార్ డాన్స్ వేస్తూ వెళ్ళా ఆఫీస్ రూమ్ వరకు ...అక్కడొకాయన చాలా cool గా అడ్మిషన్ fee is 30,000 ma'am , first term fee is 11,000(మొత్తం 3 terms), transport fee will depend on the distance' అన్నారు....మనసులో ఓ సారి అన్ని లెక్కకట్టి (అసలే వీకు), అబ్బ లకారం అయితే చేరదు అనుకుని ఈ అని ఇకిలించి....fee ఎప్పుడు pay చేయాలండి అన్నాను....'మీ ఇష్టం ma'am, next week లోగా ఎప్పుడైనా పరవాలేదు,అన్నట్టు చెప్పటం మర్చిపోయాను బిల్డింగ్ ఫండ్ కూడా కట్టాలి ma'am' అన్నాడు....(ఫండ్ అంటే మన ఇష్టాన్ని బట్టి అయ్ ఉంటుంది అనుకున్నా)....ఓ,ok అని నేను అంటుండగానే, ఆయన చాలా సాఫ్ట్ and ఫాస్ట్ గా అది 'ఒక 60,000 వరకు(అదేమిటో వరకు??)అవ్వచ్చు' అన్నారు....నాకు ఎవరో సుత్తె తీసుకుని నా తలపైన కొట్టినట్టు(అచ్చు గజినీ మూవీ లా),నేను కూర్చున్న కుర్చీని ఎవరో గిరగిరా తిప్పుతున్నట్టు అనిపించింది....ఆ తర్వాత ఏం జరిగింది అని అడగకండి .....నాకూ తెలీదు....next సీన్ లో నేను మా ఇంట్లో ఉన్నా అదేంటో.....

ఇక మిగిలింది ఒకే ఒక్క స్కూల్ ....సో,ఇంకా అడ్మిషన్ ఫార్మ్స్ ఇస్తున్న స్కూల్స్ కి వెళ్లి ఫార్మ్స్ తీసుకువచ్చారు మా వారు....ఇక నేను సెలెక్ట్ చేసిన వాటిలో ఆకరు స్కూల్....ఇందులో పేరెంట్స్ కి కూడా ఇంటర్వ్యూ ఉందండోయ్....బంపర్ ఆఫర్ అన్నమాట :D
ఒక సారి ఆ స్కూల్ ఫార్మ్ వైపు చూసి వదల బొమ్మాలి నిన్నోదల అని....ఇక మా వాడిని కత్తి......కత్తి లా తాయారు చేశా...అంటే కత్తి డ్రెస్ అనుకునేరు...ఓ బాగా చదివించావా??? అంటున్నారూ ??? ఎబ్బే ఇన్నాళ్లనించి చూస్తున్నారు ,ఏం తెలుసుకున్నారండి నా గురించి....I hurted :(....అంటే చక్కగా డ్రెస్ వేసి,పౌడర్ రాసి,తల దువ్వానంతే :).....ఇక మా వారు 'good manners ' అని ఏదో హితబోధ చేసారు వాడికి ....
dose ఎక్కువయ్యిందో ఏంటో.....వాడు 'ఎహే పో' అని వెళ్ళిపోయి కార్ ఎక్కేసాడు..మా వారికి కోపం వచ్చి "ఛి,అన్నీ నీ బుద్ధులే" అన్నారు నా వైపు చూసి......నాకు ఒక్కసారి కిచెన్ లోకి పరిగెత్తుకెళ్ళి,పప్పుగుత్తి తెచ్చి నెత్తిమీద ఒక్కటివ్వాలనిపించింది.....కానీ, నా మొగుడే కదా...నా తాళే కదా అని, కాం గా వెళ్లి కారెక్కాను.....మా వాడికి తోడు ముగ్గురం వెళ్లాం....నేను,మా వారు,మా తమ్ముడు .... మా నెంబర్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తుండగానే పిలిచారు.....చక్కగా పిక్నిక్ కి వెళ్తున్నట్టు ముగ్గురం చేతులు పట్టుకుని వెళ్లబోతుంటే....అక్కడ ఉన్న టీచర్, 'వెర్రిపీనుగుల్లారా' అన్నట్టు ఓ చూపు చూసి "only parents" into this room, kids to రూమ్ no.4 అన్నారు....ఇదేం ట్విస్ట్ అనుకుని వెళ్లాం...
మాకు ఇంటర్వ్యూ.....బేసిక్ గా పిల్లల మీద ఎంత శ్రద్ధ చూపిస్తున్నాం,ఇద్ధరూ ఉద్యోగం చేస్తే పిల్లాడిని చిదివించగలరా?? ఏం చదువుకున్నారు?? ఆ స్కూల్ నే ఎందుకు ఎంచుకున్నారు అని కనుక్కుని......(ఏం చెప్పావ్ అంటున్నారా...ఏదో లెండి తోచింది చెప్పా.)....తర్వాత ఫ్యామిలీ matter కి వచ్చారు.... మాఅత్తయ్యా,మామయ్య,మా తమ్ముడు, మేము అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటాం,మా పక్కింట్లోనే మా ఆడపడుచువాళ్ళు ఉంటారు అని తెలుసుకున్న ఆవిడ తెగ సంబరపడిపోయినట్టు "all happily adjusted together?" అని ఒక పెద్ద స్మైల్ ఇచ్చారు (బహుశా ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం కాబోలు ) అక్కడే అర్ధం అయిపోయింది మాకు మాంచి మార్కులే పడ్డాయ్ అని... ఇక ఆ రూమ్ నుండి బయటకి రాగానే, "you can go to your kid ,but only one of you " అన్నారు ఒక టీచర్....సరే నువ్వే వెళ్ళు అన్నారు మా వారు....మా వాడికి ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వలేదు....నేను వాడి పక్కనే కూర్చున్నా....కాసేపటికి ఇంటర్వ్యూ స్టార్ట్ అయ్యింది.....జంతువుల బొమ్మలు చూపించి ఇంగ్లీష్ లో వాటి పేర్లు చెప్పమంటున్నారు....."మా వాడు నేను చెప్పను పెహ్" అనేసాడు(గుడ్ manners డోస్ బాగా ఎక్కువైనట్టుంది )....ఇంతలో ఆ దేవుడు దయ తలిచి మా వాడిని ఇంటర్వ్యూ చేసే టీచర్ ని వేరే టీచర్ పిలిచారు....ఈ లోగా మా వాడు అక్కడున్న ఒక బొమ్మని చూసి నాకు అది కావాలి అన్నాడు.....నేను తెలివిగా.....'టీచర్ అడిగినవాటికన్నిటికి ఆన్సర్స్ చెప్తే ఇస్తారట' అన్నాను....అంతే మా వాడు వేరే టీచర్ తో మాట్లాడుతున్న టీచర్ ని లాక్కుని వచ్చి మరీ అన్నీ టకటకా చెప్పేసాడు.....అంతే..."enthusiastic kid" అని ఒక ట్యాగ్ వేసి మరీ పంపించింది.....
ఇంటికి వచ్చి లెక్కలేనన్ని మొక్కులు మొక్కేసా....అంతే వారం తర్వాత పెట్టిన selected list లో నా పుత్ర రత్నం పేరు చూసుకుని.....మా వాడు IAS/IPS అయినంత మురిసిపోయాం ......
ఏవిటీ ఈ స్కూల్ fee గురించి చెప్పలేదే???మీ వాడికి సీట్ ఇచ్చారనా ??? అనుకుంటున్నారా??? లేదండి చెప్తా.....అడ్మిషన్ ,fees ,uniform,పుస్తకాలు అన్నీ కలుపుకుని 50,000(కొంచెం తక్కువ) అయ్యిందిలెండి..... లకారం చేరలేదనే త్రుప్తి నాది....మా నాన్నకి ఫీజు విషయం చెప్పగానే...అమ్మో!!! అంత డబ్బే??? ఏంటో చదువు చారెడు....బలపాలు దోసెడు అన్నట్టు ఉంది...నీ చిన్నప్పటినుండి డిగ్రీ వరకు కలుపుంటే కూడా అంత ఫీజు అవ్వలేదేమో అన్నారు నవ్వుతూ.......
ఏవిటీ ఈ స్కూల్ fee గురించి చెప్పలేదే???మీ వాడికి సీట్ ఇచ్చారనా ??? అనుకుంటున్నారా??? లేదండి చెప్తా.....అడ్మిషన్ ,fees ,uniform,పుస్తకాలు అన్నీ కలుపుకుని 50,000(కొంచెం తక్కువ) అయ్యిందిలెండి..... లకారం చేరలేదనే త్రుప్తి నాది....మా నాన్నకి ఫీజు విషయం చెప్పగానే...అమ్మో!!! అంత డబ్బే??? ఏంటో చదువు చారెడు....బలపాలు దోసెడు అన్నట్టు ఉంది...నీ చిన్నప్పటినుండి డిగ్రీ వరకు కలుపుంటే కూడా అంత ఫీజు అవ్వలేదేమో అన్నారు నవ్వుతూ.......
ఏంటో నిజమే కదండి......ఈ మధ్య కాలంలో ఫీజుల మోత పెరిగిపోతోంది......మళ్లీ ఈ ఆక్టివిటీ..ఆ competition అంటూ పై పై కర్చులు ఎన్నో.... ఎక్కువ ఫి ఉంటేనే మంచి స్కూల్ అని నేను చెప్పను కానీ, ప్లే గ్రౌండ్ కూడా లేని మా ఇంటి దగ్గరి చిన్న స్కూల్ లో కూడా 30,000 ఫీజు, ట్రాన్స్పోర్ట్ extra, మళ్లీ uniform,బుక్స్ మా దగ్గరే కొనాలి అన్నారు...సో, ప్లేగ్రౌండ్ సౌకర్యం కూడా లేని స్కూల్ కంటే ప్లేగ్రౌండ్ తో పాటు,మన సంస్కృతి,పురాణాలు,ఆధ్యాత్మికత,భగవద్గీత అన్నీ చెప్పే స్కూల్ బెటర్ అనిపించింది నాకు....అంటే డబ్బులేకుండా చదుకున్న పిల్లలు లేరా???? అంటే.....ఉన్నారండి...మట్టిలో మాణిక్యాల్లాంటివాళ్ళు.....మన గవర్నమెంట్ స్కూల్స్ సంగతి తెలిసిందే.....
మొన్నామధ్య మా ఊర్లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ నాతో మాట్లాడుతూ,"విరాళాలు సేకరించి, మన స్కూల్ లో పిల్లలకి టై,బెల్టులు చేయిద్దాం అనుకుంటున్నామండి, ప్రైవేటు స్కూల్ పిల్లలు టిప్ టాప్ గా రెడీ అయ్యి వెళ్తుంటే....అందరికి అలానే ఉండాలనే ఆశ, అందరు పిల్లలు ప్రైవేటు స్కూల్స్ కి వెళ్ళిపోతున్నారు....ఏదో పిల్లల్లో ఉత్సాహం తేవడానికి ఇలా అనుకున్నాం "అన్నారు..నాకు భలే సంతోషంగా అనిపించింది,గవర్నమెంట్ స్కూల్ లో పిల్లల సంఖ్య పెంచి, దాన్ని అభివృద్ధి చేయాలనే ఆయన తపన,ఆలోచన చూస్తే...ఏదో నాకు తోచిన సహాయం చేసాను......ఇలా అందరు టీచర్స్ ,మన గవర్నమెంట్ అలోచించి .....మన గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేటు స్కూల్స్ ని తలదన్నే range కి రావాలని నేను కోరుకుంటున్నాను.....