
ఇక రియాలిటీ లోకి వస్తే.....
నేను, మా వారు ఇద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాం.... నేను ఉదయం 9:30 కి ఆఫీసులో ఉండాలి. తను 10 గంటలకల్లా ఆఫీసు చేరుకోవాలి..ఉదయాన్నే లేచి ఏదో వండేసి , వండింది ఇంత నోట్లో వేసుకుని....ఇంకాస్త బాక్స్ లో వేసుకుని...ఆఫీసులకి వెళ్తాం.....అక్కడ మేనేజర్ గారు "వచ్చారా మేడమ్, రండి రండి,ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నట్టు చాలా వెటకారంగా చూస్తూ,టైం ఎంతయ్యింది అంటాడు" మనం ఎక్కడ లేని వినయం చూపిస్తూ ఓ నవ్వు నవ్వితే అక్కడితో ఆపేస్తాడు.....లేదు అని రెచ్చిపోయమో పుచ్చిపోయామే....అలా సర్దుకుని....ఏదో ఉన్న పని చేసుకుని...లంచ్ అవర్ లో తనకి ఒకసారి కాల్ చేసి తిన్నారా, ఏంటి విశేషాలు అంటామో లేదో టైం అయిపోతుంది అని గుర్తుకు వస్తుంది....ఇక ఉంటానండి అని ఫోన్ పెట్టేసి.....బ్రతకాలంటే తినాలి అనుకుని, తెచ్చుకున్న డబ్బా ఖాలీ చేయాలి...ఇక మళ్లీ వెళ్లి పనిలో పడిపోతా.....ఇక కాస్త త్వరగా ఇంటికి చేరుకోగలిగితే పరవాలేదు....ఏదో వంట అనే కార్యక్రమం కాస్త సజావుగా సాగిపోతుంది...కానీ , పొరపాటున నాకు పని వల్ల కాస్త ఆలస్యం అయ్యిందో...ఇక అంతే సంగతులు....వంట చేయటానికి టైమూ,ఓపిక రెండూ ఉండవు.....అప్పుడు ఎక్కడో మనసు మూలల్లో ఏదో తెలియని ఒక అసంతృప్తి,అసహనం ....అయ్యో!!! మా ఆయనకి సరిగా వండి పెట్టలేకపోతున్నానే అని....పోనీ ఉదయాన్నే లేచి చక్కగా వండుదామా అంటే...అదేమిటో, నిద్రా దేవత ఇప్పుడు లేవనివ్వానంటే లేవనివ్వను అని పట్టుబడుతుంది.....ముందు రోజు పని అలసట వల్లనో ఏమో....శరీరం కూడా సహకరించదు......అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది,ఈ సమస్యని ఎలా అధిగమించాలి అని ఆలోచించే లోపే మళ్లీ ఆఫీసు టైం అయిపోతుంది....మళ్లీ పరుగో పరుగు.....
ఇలా 5 రోజులు పరుగులు తీస్తూ, ఒక రోజు ఇంట్లో ,ఒక రోజు బయట తింటూ గడిపేస్తూ, ఒకరిమోహాలు ఒకరం సరిగా చూసుకున్నామో లేదో తెలియని అయోమయంలో ఉంటూ ఆ 5రోజుల పండగ కాస్తా ముగించేస్తాం....
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేస్తుంది...."శనివారం, ఆదివారం" . ఒరిస్సా తుఫాను బాధితుడికి తిండి దొరికినట్టు దొరికే ఆ రెండు రోజులు వస్తూనే....కూరగాయలు, సరుకులు,షాపింగ్,బిల్లులు కట్టడాలు,ఇల్లు శుబ్రం చేసుకోవటం , అలసిపోయి పడుకోవటం తో తుర్ర్ మని ఎగిరిపోతాయి రెండు రోజులు....

ఇక ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళామా ...అంతే...బాస్ గారు పంచబక్ష పరమాన్నాలతో సత్కరించి...సన్మాన కార్యక్రమం మొదలు పెడతారు....ఎప్పుడైనా టైం దొరికినప్పుడు,ఆఫీసు కాబ్ లో వెళ్తూ ఆలోచిస్తే చిన్న అసంతృప్తి, ఏదో వెలితి....ఏంటి ఈ జీవితం??? ఇలా ఎంతకాలం పరుగులు?? అసలు కుటుంబం కోసం నేను ఏం ేస్తున్నాను...అయిన వాళ్ళని ఫోన్ లో కూడా పలకరించే టైం లేకుండా అయిపోయింది...పోనీ ఆఫీసులో మనం ఏమైనా గొప్ప పోసిషన్ లో ఉన్నామా అని తరిగి చూసుకుంటే....అదే కుర్చీ,అదే టేబుల్,అదే కంప్యూటర్...నొక్కి నొక్కి అరిగిపోయిన మౌస్,కొట్టి కొట్టి అరిగిపోయిన కీబోర్డ్...ఒక వెయ్యో రెండు వేలో హైకు....మరీ జుట్టుపీక్కుని, కళ్ళు పోయేలా పని చేస్తే ఇంకో 4 బటానీలు చేతిలో పెడతారు...
అమ్మ ఇంటికి వస్తే గట్టిగా ఒక గంట తన పక్కన కూర్చుని మట్లాడే తీరిక లేని సంపాదన , భర్త పుట్టినరోజు నాడు ఒక గంట ముందుగా ఇంటికి రాలేని ఉద్యోగం...రేపు పిల్లలు పుడితే వాళ్ళకి తినిపించటానికి, ప్రేమగా దగ్గరకు తీసుకోవటానికి టైం ఉంటుందా?? బాబోయ్ !!!! వద్దు నాకీ సంపాదన అనిపించింది...
ఇంతలోనే నా మనసుకి నేనే సర్దిచెప్పుకున్నా...."బంగారం....ఇన్ని భాద్యతల మధ్య నీకు తోచిందేదో నువ్వు చేస్తున్నావ్,నిన్ను నువ్వు చూసుకుని గర్వపడాలి....పిల్లలు పుట్టేదాక ఉద్యోగంలో పైకి ఎదుగు...పిల్లలు పుట్టాక మనేయోచ్చులే...అప్పుడు కుటుంబానికే మన ఓటు" అని..

అసలు అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉద్యోగం చేయాలా?? మానేయాలా???
ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.
నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)
ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.
నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)
హాయ్ అంజలి గారు,చాలా వరకు ఇందులో నిజాలే ఉన్నాయి,అతిశయోక్తి ఏమి లేదు.. అన్నీ మనమే manage చేసుకోవాలి..తప్పదు..
ReplyDeleteహాయ్ చిన్ని గారు....నిజమే మనమే adjust అవ్వాలి...... వ్యాఖ్యకి ధన్యవాదములు :)
Deleteప్రతి అమ్మాయి/అబ్బాయి ఎదుర్కొనే సమస్యే అండి ఇది.
ReplyDeleteఇంతకీ దీనికి మీ పరిష్కారం ఏమంటారు :) ?
హాయ్ శ్రీనివాస్ గారు, నా ఒపీనియన్ ఏంటంటే.....పిల్లలు పుట్టేవరకు అమ్మాయి జాబు చేసుకోవచ్చు...తర్వాత పిల్లలకి తల్లి అవసరం చాలా ఉంటుంది...సో మానేస్తే మంచిది......మన యువత తప్పుద్రోవ పట్టటానికి తల్లిదండ్రులు బిజీ గా ఉండి ,వాళ్ళతో సరైన సమయం గడపకపోవటం కూడా ఒక కారణం అని నేను అనుకుంటాను.....అలా అంటే అమ్మాయిలు అంటారేమో,ఇంత చాదుకున్నది ఎందుకు..మానేయటానికా అని....కానీ , ఇది నా ఒపీనియన్ మాత్రమే...
Deleteఈ విషయాలన్నింటినీ అమ్మాయి అబ్బాయి పెళ్ళికి ముందే మాట్లాడుకుని ఒక ఏకాభిప్రాయానికి వస్తే బావుంటుందనుకుంటాను. పెళ్ళయ్యాక ఆలోచించొచ్చు అనుకుంటే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి.
Deleteఅంజలి చాలా బాగా రాసినారు కాని ఏమి అనుకోకండి ,కర్చులు మనo ఎంత అనుకుంటే అంత luxury కి అంతము లేదు అని నా ఆలోచన . మగవారే సంపాదించాలి ఆడవారు సoపాదించకూడదు అని నేను అనను కాని ప్పిల్లలకి మన అవసరము కాస్త ఎక్కువ అని నా మాట . పిల్లల్లు కాస్త పెద్దగా అయ్యేవరకు మనము ఇంట్లో వుంటే ఏమి చెప్పండి వాళ్ళని cruch/day care లో పెట్టాలా వాళ్ళు ఎడుస్థా వుంటారు చూడలేము అండి . అంతగా ఉద్యోగం చేయకుంటే ఎలా అంటే వాళ్ళు ఇలా వేరే టైపు జాబ్స్ చేసుకొని వాళ్ళ తో ఎక్కువ సమయము గడపవచ్చు కాదంటారా . నేను తప్పుగా రాసివుంటే " sorry "
ReplyDeleteహాయ్ షర్మిల గారు , ఇందులో అనుకోవటానికి ఏం ఉందండి...మీ ఒపీనియన్ మీరు చెప్పారంతే :)Please don't be sorry for this......
Deleteమీరు అన్నది ముమ్మాటికి నిజం.....నేను కూడా మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుంటాను.....పిల్లలకి మన అవసరం చాలా ఎక్కువ.....అందుకని పిల్లలకి సరైన సమయం ఇవ్వగలం అనుకునే ఉద్యోగం ఎంచుకోవటం మంచిది...కుదిరితే ఉద్యోగం మానేయటం ఇంకా ఉత్తమం. కాని ఈ మధ్య కాలం లో నా స్నేహితురాళ్ళు చాలా మంది ఇదే రీసన్ చెప్పి ఉద్యోగం కంటిన్యూ చేస్తున్నారండి....కర్చులు పెరిగిపోయాయి,పెరిగిన కర్చులతో రేపు పిల్లల భవిష్యత్తు కోసం ఏమి దాచలేకపోతున్నాం అని అందుకే ఈ పోస్ట్ రాసాను......అభినందనలకి ధన్యవాదములు :)
అంజలి గారు, అన్ని విషయాలు చాలా బాగా వివరించారు.
ReplyDeleteఇక్కడ ఒక మంచి పాయింట్ తెలియజేసారు -
"యువత తప్పుద్రోవ పట్టటానికి తల్లిదండ్రులు బిజీ గా ఉండి ,వాళ్ళతో సరైన సమయం గడపకపోవటం కూడా ఒక కారణం అని నేను అనుకుంటాను"
ఇది నూరు సాతం సత్యం. మన తల్లి, తండ్రి పిల్లలతో చాలా సమయం గడిపారు, కాని ఈ తరం తల్లి, తండ్రిలకు గడపాలని ఉంటుంది, కాని ఆఫీసు పని భారం, ఆఫీసు ఇల్లు బాలెన్స్ అవ్వటం లేదు.
ఇంకో విషయం
ఆఫీసులో మేనేజర్ గురించి ప్రత్యేకంగా చెప్పటానికి ఏంముంది!!
హాయ్ రాము గారు, నా బ్లాగు కి స్వాగతం :)
Deleteఅవునండి మీరు చెప్పింది నిజమే...మన ముందు తరం తల్లిదండ్రులు పిల్లలతో చాలా సమయం గడిపేవారు, ఈ రోజుల్లో పిల్లలతో గడపటానికి తల్లిదండ్రులకి సమయం ఉండటం లేదు, ఆఫీసు పనులతో అలసిపోతారు, ఇక పిల్లలతో ఎలా గడపగలరు?? అదే ఇక్కడ అసలు సమస్య....(అలా అని నేను ఉద్యోగం చేసే వాళ్ళ పిల్లలంతా చెడ్డవాళ్ళు అనటం లేదు.....కాని పిల్లలకి సరైన సమయం ఇవ్వటం, వాళ్ళకి మంచి చెడు చెప్పటం తల్లిదండ్రులుగా మన భాద్యత అని నా ఉద్దేశం )....
మీకు నచ్చినందుకు,అభినందనలకి ధన్యవాదములు :)
కావ్య గారు ఈ తరం మహిళలు ఎదుర్కుంటున్న సమస్యను చక్కగ వివరించారు. కుటుంబంలో ఒకరే పనిచేస్తే బతుకుబండి నడవడం కష్టమైన ఈ రోజుల్లో తప్పని సరిగా ఇద్దరు పనిచేయాలి..కాని బతుకుబండిని లాగే క్రమంలో అధనంగా మహిళలే ఎక్కువ కష్ట పడాల్సి వస్తుంది...ఒకవైపు కుటుంబానికి అవసరమైన సేవలు చేస్తూనే, బయట ఉద్యోగం చేయడం ఇబ్బందిగా మారుతుంది..ఇలాంటి సమయంలో ఇంటి పనిలో భర్త సహయ పడితే కొంత వరకు సమస్యను అధికమించ వచ్చు....కాని ఇంటిపనిలో సహయపడే భర్తలు చాలా తక్కువమంది కదండి...అందుకే ఈ సమస్యకు అంత సులభంగా పరిష్కారం దొరకదు...
ReplyDeleteహాయ్ డేవిడ్ గారు,
Deleteమీరు చెప్పింది అక్షరాలా నిజం....ఈ రోజుల్లో మహిళలే ఎక్కువ కష్టపడుతున్నారు బ్రతుకు బండి లాగే క్రమం లో....మీరన్నట్లు భర్త కాస్త సహాయం చేస్తే సమస్య చాలా వరకు అధిగమించవచ్చు, ఎందుకంటే,ఇంతకు ముందైతే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి,పెద్దలు సహాయ పడేవాళ్ళు,కానీ ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు చాలా అరుదు, సో భర్త అర్ధం చేసుకొని సహకరిస్తే మంచిది.కానీ, మీరు చెప్పినట్టు అల సహాయం చేసే వాళ్ళ సంఖ్య తక్కువే.
అభినందనలకి ధన్యవాదములు :-)
చాలా బాగా వర్ణించారు ఈ తరం లో ఒక అమ్మాయి పడే బాధలని. ఇవన్ని గుర్తుకువస్తాయి నాకు పెళ్ళయ్యాక. .:)
ReplyDeleteకష్టాలు ఏవైనా నాకు తెలిసి ఇద్దరు అర్థం చేసుకుని నడుచుకునే వాళ్ళు అయితే ఏ పని అయిన ఇష్టంగానే చేస్తాం అనేది నా అభిప్రాయం. ఏమంటారు? సలహాలు ఇవ్వటం సులువు అంటారా. . అంతేలెండి. .అనుభవం లేనపుడు ఎన్ని సలహాలైనా ఉచితంగా ఇస్తారు అనుకుంటారు. :)
ఇంతకి chocolates కొని ఇచ్చారా మీ అబ్బాయికి? :)
హాయ్ వసంత్ గారు, నిజమేనండి భర్త అర్ధం చేసుకుని కాస్త సహాయపడితే అమ్మాయికి కాస్త సులువవుతుంది. అభినంధలనకి ధన్యవాదములు :)
Deleteహలో కావ్య గారు. .మీ బ్లాగ్ నుండి వచ్చిన inspiration తో నేను కుడా బ్లాగ్ వ్రాయటం మొదలుపెట్టాను. . న మొదటి పోస్ట్ ని చూసి కొంచం మాలాంటి వాళ్ళని ప్రోత్సహించండి. .లింక్ ఇక్కడ ఇస్తున్నాను.
Deletehttp://mivasanth.blogspot.com/2012/12/blog-post.html
ఇద్దరూ పని సమానంగా చేసుకునే రోజు త్వరలో వస్తుందని ఆశిద్దాం. బాగా రాస్తున్నారు.
ReplyDeleteహాయ్ జ్యోతిర్మయి గారు, కొందరిలో మార్పు వస్తోంది, అందరిలో రావాలని ఆశిద్దాం :).....అభినందనలకి ధన్యవాదములు :)
Deleteబాగా రాసారు. రాసే శైలి చాల బాగుంది. ఎంత ఇద్దరూ కలసి పనులు చేసుకున్నా పిల్లల్ని day care లోనే కదండీ వుంచాలి. మగవాళ్ళు సాయం చెయ్యటం లేదు అంటారు కానీ వాళ్ళు ఎంత సాయం చేసినా పిల్లలకు time ఇవ్వడం అనేది office hours తరువాతే అనే నిజం అందరూ ఆలోచించాలని నా వుద్దేశం. ఆఫీసు టైం లో పిల్లల్ని చూసుకోలేకపోతున్నామని కదా మీ అందరి ఆరాటం. మరి ఆఫీసు కు వెళ్ళితే వాళ్ళని వదలక తప్పదుగా.
ReplyDeleteహాయ్ Sarada గారు, నిజమేనండి....ఇద్దరు కలిసి పని చేసుకున్నా పిల్లలని డే కేర్ లో వేయాల్సిందే....తల్లి ఉద్యోగం మనేయటమే మంచిది.....కానీ, అలా మానేయటం ఏ కారణం చేతనైన కుదరనప్పుడు, ఇద్దరు కలిసి పని చేసుకుంటే, పిల్లలతో కాస్త సమయమైన గడపవచ్చు..... మీకు నచ్చినందుకు ధన్యవాదములు :)
DeleteHi kavya garu,this is right! Nice post..... :) :)
ReplyDeleteHai Teju gaaru .....Thank You :)
Deleteమీ బ్లాగ్ డిజైన్ బావుంది మీ పోస్ట్ లు అన్ని చదవలేదు కాని చదివించే గుణం పుష్కలంగా ఉంది.
ReplyDeleteవ్రాస్తూ ఉండండి. అభినందనలు.
హాయ్ వనజవనమాలి గారు, అభినందనలకి ధన్యవాదములు :)
Deleteకావ్యాంజలిగారూ...
ReplyDeleteఈతరం ఉద్యోగస్తులైన భార్యాభర్తల బాధలను కళ్లకు కట్టినట్లు చూపించారు.
ఉద్యోగస్తులైన భార్యాభర్తల్లో భార్యలకే ఇంకాస్త ఎక్కువ శ్రమ తప్పటం లేదు. అటు ఆఫీసుపని, ఇటు ఇంటి పనులతో సతమతమయ్యేది మహిళలే. పైగా పిల్లల పెంపకం అదనం. ఇది ఎవరికైనా తప్పని పరిస్థితి. అలాగని ఈ పరిస్థితి నుంచి తప్పించుకోలేని ఆర్థిక పరిస్థితులు.
పెళ్లయ్యాక అమ్మాయిలు ఉద్యోగం చేయాలా, మానేయాలా?? అని మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వటం చాలా కష్టం. ఎందుకంటే.. వాళ్ల వాళ్ల ఆర్థిక పరిస్థితులనుబట్టి ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
మంచి పోస్టు. ఆలోచింపజేసేలా ఉంది. ఇలాగే మరిన్ని రాస్తుండండి.
హాయ్ శోభ గారు,
Deleteనిజమేనండి.....ఉద్యోగం చేయాలా వద్దా అన్నది ఆర్థిక పరిస్థితులనుబట్టి నిర్ణయించుకోవాలి.....ప్రతి వారికి వాళ్ళ పిల్లలతో గడపాలని ఉన్నా ఈ రోజుల్లో కర్చుల వల్ల ....ఇద్దరు ఉద్యోగం చేయాల్సి వస్తుంది....కానీ, దీని వల్ల పిల్లలు చాలా నష్టపోతున్నారు.
అభినందనలకి ధన్యవాదములు :)
హ్మ్మ్... నేనే సలహాలూ ఇవ్వలేను కానండీ..
ReplyDeleteమీ పోస్ట్ మిస్టర్ పెళ్ళాం కి సీక్వెల్ లా ఉందండీ... ;)
మీ బ్లాగ్ ఇదే చూడటం.. బాగుందండి
హాయ్ రాజ్ గారు ,
Deleteనా బ్లాగ్ కి స్వాగతం......మిస్టర్ పెళ్ళాం కి సీక్వెల్ లా అనిపించటం సంతోషమే :) అభినందనలకి ధన్యవాదములు :)
చాలా చాలా బాగా రాసారండి..
ReplyDeleteకాని ఈ బాధ, సంఘర్షణ అనుభవించేవాళ్ళకే కానీ,చూసే వాళ్ళకు తెలియదు.
ఒకటి అర్ధమయ్యింది.అందరూ పక్కవాళ్ళు ఎల మేనేజ్ చేస్తున్నరో అని ఆలోచిస్తూ ఎవరికి వాళ్ళు మేనేజ్ చేసేస్తున్నారు..:ఫ్
నేను ఇలాగే ఆలోచిస్తాను..
ఒకప్పుడు భర్త సంపాదన సరిపోయేది.
ఇప్పుడు ఇద్దరూ పనీ చేస్తే గాని నెట్టుకురాలేని స్థితి.
రేపు పిల్లలు కూడా చిన్ననాటినుండీ పనిచేయాల్సొస్తుందేమో..
హాయ్ ధాత్రి గారు,
Deleteఅవునండి నిజమే...ఇప్పుడు ఇద్దరు పని చేస్తేగానీ పిల్లలకి అన్ని సమకూర్చలేమేమో.......అభినందనలకి ధన్యవాదములు :)
నేను జాబ్ చేస్తున్నప్పుడు... ఇటు ఇంటిపనితో, అటు ఆఫీసు పనితో సతమతమవుతూ... ఆఫీసులో బాసుల ఆగడాల్ని భరిస్తూ పడిన వేదనకు అక్షర రూపం ఇచ్చిన కవిత ఈ సందర్భంగా మీతో ఓసారి పంచుకుందామని లింక్ ఇస్తున్నా... వీలైతే చూడండి కావ్యగారు...
ReplyDeletehttp://kaarunya.blogspot.in/2010/12/blog-post_04.html
హాయ్ శోభ గారు, చదివానండి.....చాలా బాగుంది :)
Deleteకావ్యాంజలి గారు చాలా రోజులైనట్లుంది మీరు కొత్త పోస్ట్ రాయక..అప్పుడప్పుడు రాస్తు ఉండండి.... అలోచించే రాసే మీ సైలి చాలా బాగుంటుంది..and i wish you and ur family great success, a lot or peace and happiness on the occasion of sankranthi.
ReplyDeleteహాయ్ డేవిడ్ గారు, మీ అభిమానానికి ధన్యవాదములు :).ఈ మద్య పనిలో కాస్త busyగా ఉండి రాయలేకపోయాను. త్వరలోనే రాస్తాను.
DeleteThank u so much for the wishes డేవిడ్ గారు,Wish u the same :)
పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలా అన్నట్లు మమ్మల్ని భయపడేలా రాసారు మేడమ్ ..Just Kidding Mam.చాల బాగా రాసారు
ReplyDeleteఅంజలి గారు చాలా మంచి విషయాలను తెలిపారు..అలాగే బిజీ లైఫ్ లో ఎంత మనోవేదన..ఉంటుందో చాలా చక్కని శైలితో రాశారు...-:)
ReplyDeleteKavyanjali madam gariki
ReplyDeleteNamaskaramu. Mee blogu chaalaa chaalaa bagundi. Mee blogu choosi aanandamu vesindi.
Kavyanjali madam garu meeku, mee kutumba sabhyulaku mariyu mee snehithulaku naa Deepavali subhakamshalu.
Kavyanjali madam garu idi naa Deepavali sandesamu Lamps of India message (Bhaaratha Desamulo Deepamulu) ni nenu naa Heritage of India bloglo ponduparichitini.
http://indian-heritage-and-culture.blogspot.in/2013/09/lamps-of-india.html
Kavyanjali madam garu meeru naa Lamps of India message ni choosi oka manchi sandesamuni english lo ivvagaluaru.
Alage meeru naa bloguki memberga join avutharu ani aasisthunnanu.
Kavyanjali madam garu meeku naa Lamps of India message nachite danini mee facebook mariyu ithara friends networks lo share cheyagalaru.
Kavyanjali madam garu meenunchi naa Lamps of India message ki oka manchi sandesamu englishlo vasthumdani alaage meeru naa blogulo membergaa join avutharu ani aasisthunnanu.
SIMPLY SUPER.
ReplyDelete