Pages

Tuesday, 27 November 2012

"ఎ లెటర్ టు గాడ్"


" ఎన్నోకలలతో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెట్టిన అమ్మాయి, భర్తకి ప్రేమని పంచి ప్రతిఫలంగా ప్రేమని ఆశించి, అది అందనప్పుడు పడే బాధేంటో నీకు తెలుసా???? నాకు తెలుసు....

ఎవరికీ చెప్పుకోలేక, ఏడుస్తూ పడుకున్న రాత్రుళ్ళు, ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోతాయ్ అని నీకు తెలుసా??? నాకు తెలుసు....

అత్తమామలని సొంత తల్లిదండ్రుల్లా చూసుకుంటున్నా...'వాళ్ళు ఎప్పుడు చస్తారా అని ఎదురు చూస్తున్నావ్'  అని భర్త సూటిపోటి మాటలు అంటుంటే...మనసు పడే  మధన ఏంటో నీకు తెలుసా??? నాకు తెలుసు....

భర్త సుఖంగా సంతోషంగా ఉండాలని ఎన్నో ఉపవాసాలు చేసే అమ్మాయిని, తన భర్తే , నేను సుఖంగా ఉంటే  నువ్వు ఓరవలేవు అన్నప్పుడు...దేవుడిపై  ఉన్న నమ్మకం కూడా కరిగిపోతుందని నీకు తెలుసా??? నాకు తెలుసు....

ఏ మగాడితో మాట్లాడినా పెడర్థాలు తీసి, సంబంధం అంటగట్టి దెప్పి పొడిచే  మాటలు అంటుంటే ఆ మనసు పడే ఆవేధన ఎలా ఉంటుందో  నీకు తెలుసా?? నాకు తెలుసు....

దేవుడు కూడా దయతలచడం లేదని, ఏ దిక్కు లేక తల్లిదండ్రులే దిక్కు అనుకుని...'అమ్మ నేను సుఖంగా లేను...నాన్నా నేను ఇక అక్కడ ఉండలేను' అని మొరపెట్టుకున్నప్పుడు.....పిల్లల మొహం చూసైనా సర్దుకుపో తల్లి...అతను మగాడు....ఎం చేసినా చెల్లుతుంది...ఆడపిల్లవి నువ్వే సర్దుకుపోవాలి....ఎప్పటికైనా అతనే నీకు దిక్కు...ఇక అదే నీ ఇల్లు....వెళ్ళు తల్లి అన్ని అవే సర్దుకుంటాయ్...అని పైకి  ధైర్యం చెబుతూ...ఏమి చేయలేక లోలోపల వాళ్ళు పడే బాధ చూస్తే..ఆ గుండె పడే వేదన ఏంటో  నీకు తెలుసా??? నాకు తెలుసు.....

ఆత్మాభిమానం చంపుకుని..మళ్లీ ఆ ఇంట్లో అడుగుపెట్టి జీవస్చవంలా   బ్రతుకుతుంటే......'ఎలా ఉన్నావ్'  అని నా ప్రాణ స్నేహితురాలు అడిగినప్పుడు... "fine, all is well" అని రాని చిరునవ్వుని పెదవులకి పులుముకుని, పైకి వచ్చే కన్నీళ్ళని ఆపినప్పుడు....నరనరాలు చిట్లిపోతాయేమో అన్నంత బాధ నీకు తెలుసా??? నాకు తెలుసు....నాకు మాత్రమే తెలుసు....""


...చదువుతుంటేనే గుండె భారంగా అనిపిస్తోంది...కదా??? ఎవరో తెలియని అమ్మాయి రాసింది చదివిన మీకే  అలా ఉంటే...నా ప్రాణ స్నేహితురాలు ఇలా రాసుకుంది అని తెలిసి నాకు ఒక్క సారి ప్రపంచమంతా తలక్రిందులైనట్టు అనిపించింది....

ఇలా చదువుతుండగానే....hey కావ్య....ఇదిగోనే నీ special coffee అంటూ వచ్చింది....వెనక్కి తిరిగి చూసాను....పెదవులపై చిరునవ్వు ఎప్పుడూ  చేరగనివ్వని నా స్నేహితురాలు....ఎన్నో విషయాల్లో నాకు inspiration...నాకు ఎన్నో సలహాలు ఇచ్చిన నా స్నేహితురాలి మనసులో ఇంత బాధ దాగి ఉందా??? అని తన మొహంలోకి చూస్తూ నిలబడిపోయా...అంతే...నా చేతినుండి తను రాసుకున్న... " Letters  to  GOD " అనే title  ఉన్న డైరీని లాక్కుని, ఇదెందుకు తీసావ్? అంది కంగారుగా....


ఇక ఆ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు....ఏదైనా అడిగితే ఏడుపు....ఏడిపించటం ఎందుకులే....కాస్త కుదుటపడితే తనే  చెప్తుంది అనుకుని ఇంటికి వచ్చేసా...

ఈ ఇన్సిడెంట్ తర్వాత మనం ఎలా ఉంటామో మీకు seperate గా చెప్పాల్సిన పని లేదుగా...రోడ్ మీద జరిగిన చిన్న విషయానికే (మన సహాయం పోస్ట్ లో చెప్పాగా) గంటలు గంటలు thinke నాకు .... నా చిన్నప్పటినుంచి కలిసి ఉన్న స్నేహితురాలి గురించి ఇలా తెలియటం ఒక పెద్ద షాక్ అనే చెప్పాలి....అవే ఆలోచనలు, నిద్ర పట్టదు...ఆ diary నే గుర్తొస్తోంది...అందులోని మాటల echos వినిపిస్తూనే ఉన్నాయ్...అలా ఆలోచిస్తూ ఒక్కసారి గతంలోకి వెళ్ళిపోయా....(సినిమాలో చూపించినట్టే నా ముందు గిరగిరా ఒక చక్రం తిరిగింది )

దివ్య శృతి ....ఆనందానికి, అల్లరికి మారుపేరు......తను చేసే అల్లరి తట్టుకోవటం ఒకింత కష్టమే...ఒక్కోసారి అది చేసే పనులకి కోపం కూడా వచ్చేది....మన కోపాన్ని మన మనసు కన్నా fast గా కనిపెట్టేసి ఒక cute smile ఇచ్చేది....అది చూసాక ఇక మనం ఏమి అనలేం...తనతో పాటే నవ్వేయటం తప్ప. తన స్మైల్ తనకంటే అందంగా ఉంటుంది మరి...అలా అని అల్లరి పిల్ల అనలేమండోయ్...చాలా తెలివైనది...చదువులో ఎప్పుడూ ముందుండేది....ఎంతో గొప్ప కలలు కనేది...బాగా చదువుకోవాలి...మంచి ఉద్యోగం చేయాలి....ఉద్యోగం చేసి మంచి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు అంతా..తను మాత్రం ఎప్పుడూ అనేది...'నాన్న నా కోసం చాలా కష్ట పడ్డారు, అప్పు కూడా  చేసారు , job చేసి తన ప్రాబ్లంస్  అన్ని తీర్చేసి, తనకి రెస్ట్ ఇవ్వాలి' అని. ఇలా అన్నో ఆశలు, ఆశయాలు తనవి..


అలా  మేము ఫైనల్ ఇయర్ లో ఉండగా ఒకరోజు తను నా దగ్గరకి వచ్చి....'కావ్య నాకో హెల్ప్ చేస్తావా' అంది....'నేనా??? నువ్వు అడగటం నేను చేయకపోవటమా...చెప్పు' అన్నాను....'నాన్న నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు ...నాకు ఇప్పుడే చేసుకోవాలని లేదు....నా ప్రాబ్లం నీకు తెలుసు..పెళ్లి అయితే నేను అనుకున్నదేది చేయలేను, నాన్నతో మాట్లాడి ఎలా అయినా ఒప్పించవా ఇప్పుడే వద్దని '  అంది...
నేను భయపడుతూనే...తనకోసం....లేనిపెద్ధరికాన్ని తెచ్చుకుని...అంకుల్ ని   కలవటానికి వెళ్ళా...నన్ను చూస్తూనే...."ఏంటి రా కావ్య, దివ్య పెళ్ళంటే వద్దంటోంది, విషయం ఏంటో కనుక్కో అన్నారు"...అప్పుడు నేను.
 " నేను అది మాట్లాడటానికే వచ్చా అంకుల్, తను పెళ్లి వద్దు అనటం లేదు....ఇప్పుడే వద్దంటోంది" అని తన అనుకున్నవన్నీ అంకుల్ కి చెప్పాను'. సరే అయితే తన ఇష్టం, ఉద్యోగం వచ్చాకే చూద్దాంలే...మంచి సంబంధం అని ఆలోచించాను అంతే అన్నారు అంకుల్ ....ఒక్కగానొక్క కూతురు నొప్పించలేక....అలా  అని వెళ్ళిపోయారు అంకుల్.
ఇది జరిగాక కొన్నాళ్ళు అంతా  బాగానే ఉంది..ఒకరోజు నేనూ ,దివ్య వాళ్ళింట్లో చదువుకుంటూ ఉండగా ...అంకుల్ వచ్చి...."వాళ్ళతో , మాట్లాడానురా, మీరు job కోసమే గా పెళ్లి వద్దన్నారు....వాళ్ళు పెళ్లి అయ్యాక job చేయటానికి ఒప్పుకున్నారు. అబ్బాయి కూడా చాలా మంచివాడు, ఉద్యోగం, తన ఆశయాలు, ఆలోచనలు దేనికి ఎప్పుడు అడ్డు చెప్పను అన్నాడు. ఇప్పుడైనా హ్యాపీనా దివ్య??" అని చాలా సంతోషంగా అన్నారు  అంకుల్....ఇది విన్న నేను great  అంకుల్, అలా అయితే దివ్య కి కూడా ఏం objection లేదనుకుంటా...అని తన వైపు చూసా....వద్దనటానికి reason ఏం లేక, తన తండ్రి మొహం లో సంతోషం చూసి  సరే అనేసింది...తర్వాత వెంటవెంటనే engagement ,పెళ్లి జరిగిపోయాయి ....పెళ్లి రోజు ప్రతి క్షణం తనతోనే ఉన్నా...ఇక వెళ్ళాల్సిన సమయం వచ్చినప్పుడు ఏమి మాట్లాడలేక అలా తన కళ్ళలోకి  చూసి వెళ్ళిపోయాను ....ఇక తను మాకు దూరం అవుతోంది అనే ఫీలింగ్ వచ్చేసింది ఎందుకో!!!!

కాలం చాలా తొందరగా గడిచిపోయింది....నాకు పెళ్లి అయ్యి, నా లైఫ్ తో నేను busy అయిపోయాను....మనసులో ప్రేమలు అలానే ఉన్నా మాట్లాడుకోవటం, కలుసుకోవటం తగ్గిపోయింది.....ఇక పిల్లలు పుట్టాక మరీ...ఫ్రెండ్స్ ని కలవటం, గుడికి వెళ్ళటం, ఆకరికి అమ్మ వాళ్ళతో మాట్లాడటానికి కూడా టైం ఉండదు..ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మిస్ అయిన  ఫీలింగ్ . అలా ఉండగా అనుకోకుండా ఒకరోజు దివ్య వాళ్ళ ఇంటికి వెళ్ళా...తను కాఫీ తీసుకొస్తా అని కిచెన్ లోకి వెళ్తే....చాలా casualగా తన చీరలు చూద్దాం అని అలమార ఓపెన్ చేసిన నాకు...."Letters To God" అని పెద్దపెద్ద అక్షరాల్లో డైరీ కనిపించింది...ఓపెన్ చేసాను.....పర్సనల్ డైరీ   చదవటం తప్పు అనిపిస్తున్నా.... అందులో ఆవేదన....బాధ అనే పదాలు కనిపించి చదవకుండా ఉండలేకపోయా...
ఎంత మర్చిపోదాం అనుకున్నా మర్చిపోలేకపోతున్నా, చెప్పాలనిపించినప్పుడు చెప్తుంది అని మనసుకి ఎంత నచ్చజెప్పుకున్నా...అవే ఆలోచనలు...మేము అదృష్టవంతులం....మంచి వాళ్ళు దొరికారు....హ్యాపీ లైఫ్ అనుకునేదాన్ని....అలాంటిది....తను అంత బాధ పడుతోందా??....ఇక నా వల్లకాదని....ఒకరోజు తనని మా ఇంటికి రమ్మన్నాను...ఏం జరిగిందో చెప్తే కానీ వెళ్ళనివ్వను అని మొండికేసాను....గుండెలు పగిలేలా గట్టిగా ఏడ్చేసింది...జరిగింది చెప్పటం మొదలు పెట్టింది...

తన మాటల్లోనే " పెళ్ళికి ముందు 'అంతా నా ఇష్టం' అన్న మా అత్తింటివాళ్ళు...పెళ్లి అయ్యాక మాట మార్చేసారు...ఏదీ నాకు ఇష్టం అయినట్టు ఉండదు...మొదట job  చేయొచ్చు....జీతం కూడా నాన్నకి ఇవ్వొచ్చు అన్నవాళ్లు...నా మొదటి నెల జీతం రాగానే...అందులో నుండి కొంత కూడా నాన్నకి ఇవ్వటానికి ఒప్పుకోలేదు...అలా ఎలా ఇస్తావ్ అని పెద్ద గొడవ చేసారు...డబ్బు నిజంగానే పాపిష్టిదే కావ్య...తర్వాత ఏవో అనుమానాలు, అవమానాలు...ఉద్యోగమే మాన్పించేసారు ....ఏమైనా అంటే...ఇంట్లో పని ఎవరు చేస్తారు అంటారు....అమ్మాయి అంటే ఇంటి పని, వంట పని చేయాలి అని ముద్ర పడిపోయింది వీళ్ళకు...ఉద్యోగం చేసేటప్పుడు కూడా పనంతా నేనే చేసేదాన్ని..అయినా నా ఇల్లు, నా వాళ్ళే  కదా అని సంతోషంగా చేసేదాన్ని....అలాగే చేస్తా అన్నా ఒప్పుకోలేదు....ఒక్కటి అంటే ఒక్కటి కూడా నా ఇష్టానికి జరుగదు....పొద్దున లేస్తే పేస్టు దగ్గర్నుంచి, breakfast ,lunch, ఆకరికి టీవీ చూడాలన్నా....అన్నిటికి adjust అవ్వాలి ,వాళ్ళకి నచ్చిందే చేయాలి.......సరదాగా బయటకి వెళ్ళినా ఏదో వచ్చాం అన్నట్టు ఉంటారు.....సంతోషం అనేదే ఉండదు....నీకు ఏమైనా కావాలా అని అడిగిన పాపాన పోరు...అదే నాన్నతో బయటకి వెళ్తే...ఏం కావలి,ఏం తింటావ్? హ్యాపీ నా??  అని ఎన్ని సార్లు అడిగేవారో... ఎందుకు కావ్య,నా లైఫ్ ఇలా అయ్యింది??? అమ్మాయిలు పెళ్ళైతే మారిపోవాలా?? ఆడపిల్లగా పుట్టటం పాపమా?? మన ఇంట్లో మహారాణీలా ఉండే మనం పెళ్లి అవ్వగానే...అత్తారింట్లో బానిసలా ఉండాలా??  పోనీ బానిస అనుకోవటం ఎందుకు వాళ్ళు నా వాళ్ళే అనుకుని కలిసిపోతుంటే ,నన్ను తమ మనిషిలా చూడలేరా???మాటలు అంటుంటే ఎలా??? అపురూపంగా చూసుకునే అమ్మానాన్న కూడా ఇప్పుడు ఏం చేయలేక ఎడుస్తున్నారు ...నాకోసం నిలబడరే ??" అని తన మనసులోని బాధంతా చెప్పింది...

నాకు నిజంగా ఇది నమ్మాలో లేదో కూడా అర్ధం అవ్వలేదు...సరదాగా నవ్వుతూ ఉండే దివ్య మనసులో ఇంత బాధ ఉందా అనిపించింది....'దివ్యా ఉద్యోగం ఎందుకు మానేసావ్??  అని ఎవరైనా అడిగితే...చిరునవ్వు నవ్విందే తప్ప...తను సంతోషంగా లేనని ఎప్పుడూ చెప్పలేదు.....అలా  ప్రవర్తించలేదు కూడా...వాళ్ళాయన చాలా 'మంచివాడు'  అనే పిక్చర్ మా మనసులో తనే ముద్రించేసింది.....నిదానంగా, ఓపికగా, ఎప్పుడూ పెదవులపై చిరునవ్వు చేరగనిచ్చేది కాదు....

ఆలోచిస్తే అనిపిస్తుంది...ఆడపిల్ల అంటే అంతేనేమో.....పెళ్లి అయ్యాక నా అనే మాటకి స్థానం లేదేమో...పెళ్లి అయ్యాక అమ్మాయి జీవితం ఎంత మారిపోతుందో కదా...20 ఏళ్ళు ఎంతో గారబంగా పెరిగి..తనకి నచ్చినట్టు ఉంది..నచ్చిన డ్రెస్, నచ్చిన ఫుడ్, అన్ని తనకి నచ్చినట్టే...మహారాణిలా ఉండే అమ్మాయి...సడన్ గా పెళ్లి అవ్వగానే కొత్త ఇంట్లో, కొత్త వాళ్ళ మధ్య ఉండాలి...అమ్మాయిలు, సొసైటీ ఎంత మోడరన్ అవుతున్నా ఈ పద్ధతి అయితే మారదు...అదే ఒక అబ్బాయి అలా వాళ్ళ వాళ్ళని వదిలేసి అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒక సంవత్సరం ఉంటారా??? ఊహించుకోండి !!!!!

అలా కొత్త వాళ్ళతో ఉండే అమ్మాయి అన్నిటికి adjust అవుతూనే ఉంటుంది....కట్టుకున్నవాడు, అత్తమామలు మంచివాళ్ళు అయితే ఆ adjustment  కూడా సంతోషంగా చేస్తుంది...అదే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, తనని అర్ధం చేసుకోకపోతే?? తన జీవితమే ఒక adjustment అయిపోతుంది...కానీ తను పడే నరకం ఎవరికి  తెలుస్తుంది....ఒక్క ఆ అమ్మాయికి తప్ప..

అమ్మాయిని చిన్నప్పట్నించి కష్టపడి పెంచి అప్పోసొప్పో చేసి చదివించి, కట్నం అంటూ మళ్ళీ అప్పు చేసి...పెళ్లి చేస్తే పోషించటం భర్త భాద్యత కాదా??? ఆ అమ్మాయి సుఖంగా లేను అని తల్లిదండ్రులకి చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఆ అబ్బాయిని అడగకుండా...సర్దుకుపోమనటం తప్పు కాదా....తను ఏ అఘాయిత్యమో చేసుకుంటే???ముమ్మాటికి తప్పు మీదే అవుతుంది 'తల్లిదండ్రులు'....

నాకు అర్ధం అవ్వక అడుగుతానండి....నా స్నేహితురాలికి 20 లకారాలదాక కట్నం ఇచ్చారు మా అంకుల్...చాలా అప్పులు కూడా చేసి...అంటే మీ కూతురిని ఏ కష్టం లేకుండా పోషిస్తాం అని ఆ డబ్బు తీసుకున్నట్టా? అలా  అయితే  హ్యాపీ గా  ఉంచాలి కదా ?? తనని పోషించటానికే అయితే తన ఉద్యోగం, జీతం ఉందిగా? పోనీ మరి కట్నం ఉందిగా, జీతం అయినా  అమ్మానాన్నలకి ఇవ్వొచుగా ??? వాళ్ళు తన పెళ్ళికోసం చేసిన అప్పులు తీరేదాక అయినా??
కట్నం జీతం రెండూ అమ్మాయి కర్చులకే  ???

లేక నా కొడుకుని ఇంత కర్చు చేసి చదివించాం....మావి మాకు ఇస్తే అబ్బాయిని అప్పగించేస్తాం అన్నట్టా??? ఇక ఇదంతా చాలదన్నట్టు ఆడపడుచు కట్నం అంటూ మళ్ళీ  ఓ లకారం తీసుకున్నారు...అంటే మా అన్నయ్య తో ఉన్న అనుబంధం తెంచేసుకుంటాను లేదా తగ్గించుకుని నీకు అప్పగించటానికి నాకు కొంత సొమ్ము కావలి అన్నట్టా???

బాబోయ్!!!!!మీరు మరీ అలా కొట్టేసేలా చూడకండి....ఇవన్నీ నా మట్టి బుర్రకి వచ్చిన doubts ....అది అడిగే      యక్షప్ర శ్నలూనూ  :D

NOTE:  నేను ఎవరినీ ఇక్కడ తక్కువ చేసి మాట్లాడటం లేదు....నా ఫ్రెండ్ కి జరిగింది మాత్రమే చెప్పానంతే....ఎవరూ దీన్ని -ve గా తీసుకోవద్దని మనవి....
ఇంకో విషయం , అమ్మాయిలంతా కష్టపడిపోతున్నారు....మేమే ఎందుకు పనులన్నీ చేయాలి???అబ్బాయిలతో చేయించాలి....అబ్బాయిల జులుం నశించాలి...విప్లవం వర్ధిల్లాలి type అస్సలు కాదండోయ్....
మేము(అంటే అమ్మాయిలం) ఏది చేసినా సంతోషంగా చేస్తాం...'మన' వాళ్ళకే చేస్తున్నాం అనే త్రుప్తి ఉంటుంది  ..so, ఆ 'మన' అనే పదానికి న్యాయం చేయండి చాలు :)
అలాగే నేను మగాళ్ళంతా మంచివాళ్ళు కాదు అనటం లేదు....ఎందరో మహానుభావులు కూడా ఉన్నారు...అందరికి వందనములు :)....నేను చెప్పింది మంచివాళ్ళు కానీ వాళ్ళ గురించి...ex :నా  ఫ్రెండ్ case


                                                                                                            .............మీ కావ్యాంజలి ♥♥♥

31 comments:

 1. nice post good topic...your way of expressing is good...

  ReplyDelete
 2. Nijame Kavya garu, Pelli ayaka iddaru adjust avvali. kani meeru cheppinattu chala cases lo ammayi adjust avadame ekkuva. Ammayiki pelli ipothe thana parents ki financial support or moral support peddaga ivvanavasaram ledu ane janam theeru maraali. Mee friend bada choosthe ardam avtundi ila lopala lopala kumili poye vallu chala mande unnaru ani....

  ReplyDelete
  Replies
  1. హాయ్ teju గారు....అవునండి అలాంటి వాళ్ళు చాలా మందే ఉన్నారు....financial support విషయం లో చదువుకున్నవాళ్ళు కూడా ఇలా ప్రవర్తించటమే చాలా బాధ కలిగించింది నాకు....

   Delete
 3. సమాజంలో ఉన్న ఒక పెద్ద సమస్యను కళ్ళకుకట్టినట్టు చెప్పారు.

  ReplyDelete
  Replies
  1. హాయ్ Srinivasarao గారు, నచ్చినందుకు థాంక్స్ .....ఈ సమస్య త్వరలోనే తీరిపోవాలని కోరుకుందాం...

   Delete
  2. అంత త్వరగా సమసిపోయే సమస్య కాదండి ఇది. But, yes..త్వరలోనే తీరిపోవాలని నేను కూడా కోరుకుంటున్నా.

   Delete
  3. అవును శ్రీనివాస్ గారు, ......కాని మనిషి ఆశ కి అంతుండదు అంటారు....అందుకే ఈ సమస్య త్వరలోనే తీరిపోవాలని మనం ఆశిద్దాం :)

   Delete
 4. chakkagaa chepparu chaduvutunte baadha ga vundi....janaale alaa vunnaru marpu eppudu vastundo...mari..!!

  ReplyDelete
  Replies
  1. హాయ్ మంజు గారు, Thank You ....అవునండి...నాకూ చాలా బాధ అనిపించి రాసాను.....త్వరలోనే ఆ మార్పు రావాలని ఆశిద్దాం ...

   Delete
 5. Kaavya garu,mee post chadivanu.chala baga rasaru.mee frnd tho paatu inka alanti paristhithi vunna andari prblms teeripovalani manaspurthiga korukuntunna.ma lanti chala mandi abbaylani alochinchela vundi mee post.
  Mee ee post ki ekkuva comments rakapovachu,chala mandi magavariki nachakapovachu.kani nijam chala goppadi.vallu aa topic gurinchi alochinchina chalu,mee post ki sardhakatha chekurinatle.

  ReplyDelete
  Replies
  1. హాయ్ చైతన్య సాగర్ గారు,మీకు నచ్చినందుకు ధన్యవాదములు...అలా ఆలోచింపజేయగలిగితే అంత కన్నా సంతోషం ఎం ఉందండి.....
   అవునండి మీరు అన్నట్టు చాలా మందికి ఈ పోస్ట్ నచ్చకపోవచ్చు,కానీ నిజానికి నేను జరుగుతున్నది...జరిగిందే చెప్పాను.....ఏ తండ్రి అయినా తన కూతురు జీవితాంతం సంతోషంగా ఉండాలని...కష్టమైనా ఇష్టంగానే ఇస్తాడు కట్నం/సొమ్ము(అలా తీసుకోవటం/ఇవ్వటం తప్పే అయినా,సమాజం అలా ఉన్నప్పుడు మనం ఒక్కరం ఏమి చేయలేమేమో..అలా ఇవ్వను అని భీష్మించుకు కూర్చుంటే అమ్మాయికి పెళ్లి అవుతుందో లేదో కూడా చెప్పలేని రోజులు).............కానీ అంత చేసినా ఆ అమ్మాయి సుఖంగా లేకపోతే దాని అర్ధం ఏంటి??? ఆ తండ్రి ఎంత బాధ పడతాడు...అనేదే నేను చెప్పాలనుకుంటున్న point....మీకూ కూతురు ఉండి ,ఆ అమ్మాయి పెళ్లి చేస్తుంటే మీకు తెలుస్తుంది.....అందరు మగాళ్ళకి నచ్చకపోయినా, కూతురు ఉన్న తండ్రులకి తెలుస్తుంది (నచ్చుతుంది) నా ఆవేదన.....

   Delete
 6. manchithanam kosam vedike badulu aanandaanni ela konukkovaalo alochinchandee

  ReplyDelete
  Replies
  1. తనూజ్ గారు....మీరు రాసి డిలీట్ చేసిన కామెంట్స్ చూసాను...మీకు నచ్చినందుకు థాంక్స్......ఇక మీరు చెప్పిన jalsa డైలాగ్స్ అయితే గుర్తు లేవు కానీ,మీరు చెప్పిన డైలాగ్స్ చూస్తే అవీ ఒకరి బాధ నుండి పుట్టుకొచ్చినవే అనిపిస్తోంది...ఇక సొసైటీ ని లెక్క చేయొద్దు అని మీరన్న మాట నిజం చేస్తూ అమ్మాయిలు damn సొసైటీ అని అనుకుంటే....మన marriage system కి ఉన్న value పోతుంది.....ఇక అంగడిలో దొరికేది ఆనందం కాదేమో????....అలా కొనుక్కోగలిగితే...ఎక్కడ దొరుకుతుందో కూడా మీరే చెప్పాలి.....

   Delete
 7. అంజలి గారు, ఇలాంటి మానసిక సంఘర్షణ అనుభవిస్తున్న అబ్బాయిలు కూడా ఉన్నారు. దాంపత్యం అంటే ఒకరి పై ఇంకొకరి ఆజమాహిషీ కాదని తెలుసుకోనంత వరకు భార్య,భర్తల బంధం నిలబడదు. మీ స్నేహితురాలు ఈ బాధనుంచి తొందరగా కోలుకోవాలని ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నాను.

  ReplyDelete
  Replies
  1. హాయ్ చిన్ని...అవును, అలా suffer అయ్యే అబ్బాయిలూ ఉండచ్చు.....కాని నేను నా ఫ్రెండ్ సమస్యని దృష్టిలో పెట్టుకుని రాసాను........కానీ, ఇలాంటి cases లో victims సంఖ్య అయితే అమ్మాయిలదే ఎక్కువ ఉంటుంది.....anyways, నా ఫ్రెండ్ husband లాంటి వాళ్ళందరిలో కాస్తైన మార్పు రావాలనేదే నా ఆశ....

   Delete
 8. hey naa comment enduku delete chesaaru i demand an explanatioooooooooooooooooooon

  ReplyDelete
  Replies
  1. sorry thanooj gaaru, mee opinion cheppatam lo thappem ledhu...kani nenu delete cheyataniki kaaranam "f******f to any1 who doesnt deserve u .that's it .teah it's my kindaa b******t" aa two words plz avi edit chesi malli me opinion pettandi....

   Delete
 9. కావ్యా గారు మీ స్నేహితురాలి గురించి మీరు రాసిన పోస్ట్ అలొచించేలా వుంది... ఒక మంచి చర్చను చేశారు...అనేక ప్రశ్నలు అడిగారు...కాస్తా సిరియస్గా అలోచించండి...మీరు అడిగిన ప్రశ్నలకన్నింటికి సమధానం దొరుకుతుంది. ...".అలా కొత్త వాళ్ళతో ఉండే అమ్మాయి అన్నిటికి adjustment అవుతూనే ఉంటుంది....కట్టుకున్నవాడు, అత్తమామలు మంచివాళ్ళు అయితే ఆ adjustment కూడా సంతోషంగా చేస్తుంది...అదే వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే, తనని అర్ధం చేసుకోకపోతే?? తన జీవితమే ఒక adjustment అయిపోతుంది...కానీ తను పడే నరకం ఎవరికి తెలుస్తుంది....ఒక్క ఆ అమ్మాయికి తప్ప".......మీరు రాసిన పై వాఖ్యంలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంది....నా దృష్టిలో (కరెక్ట్ కావచ్చు, కాకపోవచ్చు) నేడు జరుగుతున్న అనేక పెళ్ళిలు "లాటరి" లాంటివి.. మనం డబ్బులు పెట్టి లాటరి టికెట్ కొంటాం, అది తగులుతుందో లేదో తెలియదు...తగులుతే సంతోషం, తగలకపోతే డబ్బులు వృదా అవుతాయి, దానితోపాటు తల్లి దండ్రులని, మన అశలని, అశయాలని అన్నింటిని దూరం చేసుకొని జీవితాంతం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది. అదే మీ స్నేహితురాలి విషయంలో జరుగుతున్నది.

  ReplyDelete
  Replies
  1. హాయ్ డేవిడ్ గారు, మీరు చెప్పింది నిజమే అనిపిస్తోందండి....నిజంగానే లాటరి లా ఉంది....మీ స్పందనకి ధన్యవాదములు :)

   Delete
 10. chinni gaaru cheppindi correct andi......alaanti baditullo nenokadini

  ReplyDelete
  Replies
  1. హాయ్ పండు గారు, అలా suffer అయ్యే అబ్బాయిలూ ఉన్నారు ....కానీ,నేను నా ఫ్రెండ్ సమస్యని దృష్టిలో పెట్టుకుని రాసాను...మీ సమస్య త్వరలోనే తీరిపోవాలని ఆశిస్తున్నాను

   Delete
 11. but oka vishayamandi.....meeru ee post pettina sangati mee frnd ki telusa????? okavela ee post mi frnd husband ki edo vidhanga teluste???? who is the responsibility for that??? wht is her position at tht situation? guest i can guess wht will happens at tht time?? be careful, dont feel bad about my comments, i hope u can understand.........

  ReplyDelete
  Replies
  1. thelusu pandu gaaru...athanu choodalani thanu kooda korukuntundhi :)

   Delete
 12. A small Story

  Little girl and her father were crossing a bridge. The father was kind of scared so he asked his little daughter, 'Sweetheart, please hold my hand so that you don't fall into the river.'
  The little girl said, 'No, Dad. You hold my hand.'
  'What's the difference?' Asked the puzzled father?
  'There's a big difference,' replied the little girl. 'If I hold your hand and something happens to me, there is a chance that I may let your hand go. But if you hold my hand, I know for sure that no matter what happens, you will never let my hand go.'
  In any relationship, the essence of trust is not in its bind, but in its bond.
  So hold the hand of the person who loves you rather than expecting them to hold yours.
  This message is short......but carries a lot of Feelings.

  ReplyDelete
  Replies
  1. "So hold the hand of the person 'who loves' you rather than expecting them to hold yours."

   But in this case,the person doesn't have any love towards her....

   Delete
 13. కొన్ని సార్లు దురదృష్టం అని సర్దుకునిపోలేము. అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. తెలిసినప్పుడు మాత్రమే ఏదో బాధ ఏమీ చెయ్యలేని అసక్తత. మీ శైలి బావుంది.

  ReplyDelete
  Replies
  1. హాయ్ జ్యోతిర్మయి గారు,అభినందనలకి ధన్యవాదములు :)

   Delete
 14. దివ్యశృతి గారికి అన్ని కష్టాలు తొలగి పోయి, తను హాపీ గా వుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నా.
  'ఎ లెటర్ టు గాడ్' ఆవేదనకీ గురిచేసింది, ఆలోచింపచేసింది.
  ఆ అత్త కుడా ఒక ఆడదే కదా, ఒక అమ్మే కదా..
  ఆ దివ్య గారి సిచియేషణ్ లో తన కూతురు ని ఒక్క సారైనా ఊహించుకోలేక పోయిందా?
  -----------------------

  జెనరల్ గా ఇలాంటి సమస్యలు ఇలా మొదలవుతాయేమో:
  అబ్బాయి మీద అమ్మ ప్రభావం లేక పెళ్ళాం ప్రభావం చాలా వుంటుంది. (అమ్మ, పెళ్ళాం మధ్య సఖ్యత లేనపుడు లేకుంటే అత్త కోడలి మీద డామినేషన్ చేయాలి అనుకున్నపుడు ఇలాంటివి జరుగుతాయి )
  పెళ్ళాం ప్రభావం ఎక్కువ వున్నపుడు అమ్మ మీద ప్రతాపం చూపిస్తాడు,
  అమ్మ ప్రభావం ఎక్కువ వున్నపుడు పెళ్ళాం మీద ప్రతాపం చూపిస్తాడు.
  ఇన్ బొత్ ది కేసెస్ విమెన్ ఇస్ ది విక్టిం :(

  ReplyDelete
  Replies
  1. అవునండి నిజమే, అందరు ఆలోచించాల్సింది (అమ్మ,పెళ్ళాం,అబ్బాయి) ఏంటంటే..... అందరూ మన కుటుంబ సభ్యులే అనుకుని అందరూ సర్దుకుపోతేనే బాగుంటుంది....అందరూ సంతోషమైన జీవితమే కదా కోరుకుంటారు.....

   Delete
 15. మీ పోస్ట్ చదివాక చాలాసేపు నిశ్శబ్దంగా మారిపోయాను ముఖ్యంగా మీ స్నేహితురాలు రాసిన లెటర్స్ టు గాడ్ డైరీ కళ్ళ వెంట నీళ్ళు తెప్పించింది. నేను ఇప్పుడు రాస్తున్న నాన్న నవలలో కొంత అయిన ఈ పాయింట్స్ టచ్ చేసాను . ఈ అంశం మీద పూర్తీ నవల రాయాలనే ప్లాన్ ఉంది. మీ స్నేహితురాలి కస్టాలు తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  ReplyDelete

 

View Count
Useful Links