Pages

Thursday, 20 September 2012

మన గురించి అవతలివాళ్ళు ఏం అనుకుంటున్నారో??

"Actual  గా ప్రతి మనిషికి తన గురించి అవతలి వాళ్ళు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది..అది సహజం  "..ఇప్పుడు  sudden గా ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? చెప్తా చెప్తా!!!!!!!!

ఈరోజు నాకు మనసేం బాగోలేక ఏదైనా comedy సినిమా చూస్తే కాస్త నవ్వుకోవచ్చనీ...త్వరత్వరగా పని ముగించుకుని నా all time favourite సినిమా 'మన్మధుడు'  చూడటం మొదలెట్టా...ఆ సినిమా లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు చెప్పిన డైలాగే  ఇదనమాట!!!

అప్పుడు అనిపించిందండి....అవును నిజమే! "మన గురించి అవతలి వాళ్ళు ఏం అనుకుంటున్నారో తెలుసుకోవాలని   ప్రతి మనిషికి  ఉంటుంది..అలాగే పక్క వాళ్ళ సంగతులు తెలుసుకోవాలనే curiosity కూడా మనిషికి ఎక్కువే..."

ఇదిగో సరిగ్గా ఈ point నే catch చేసి,cash చేసుకుంది 'facebook '....సరిగ్గా ఈ point వల్లనే చాల famous అయిపోయింది ...ఈ రోజుల్లో facebook గురించి తెలియని వాళ్ళు చాలా అరుదు అంటే అతిశయోక్తి కాదేమో..మన గురించి నలుగురికీ చెప్పటం..అదేలెండి status updates ..మన ఫోటోలు అందులో పెట్టటం....అంటే ఊరికే పెడతామా ఏంటి??అందంగా వచ్చినవాటికి మరి కొన్ని మెరుగులు అద్ది (అదే ఎడిటింగ్ అన్నమాట) మరీ పెడతాం..కొందరైతే ఇంకాస్త ముందడుగేసి  facebook లో  పెట్టటం కోసమే ఫోటో తీసుకున్నారేమో అనిపించేలా ఉండే ఫొటోలు పెడతారు..అబ్బో ఎందుకులెండి!!!  ఇక పెట్టినదగ్గర్నుంచి...అవతలివాళ్ళు మన గురించి ఏం అంటారో,ఏం పొగుడుతారో అన్న ఎదురుచూపులు..గంట గంట కి ఓపెన్ చేసి చూసుకోవటం...ఎవరైనా లైకితే(like ) మురిసిపోవటం...ఇంకా చాలానే ఉన్నాయ్ లెండి..

ఇక మన విషయానికి వస్తే...నిజానికి మొదట్లో నేను కూడా ' కొత్త బిక్షగాడు పొద్దెరుగడు" అన్నట్టు ఓఓఓ అదే పనిలో ఉండేదాన్ని...ఫోటోలు,లైకులు,స్నేహితులు,కామెంట్లు అంటూ..దానికి తోడు నా ర్మకి అదేదో ఆట ఉందిలెండి...farmville అని...కంప్యూటర్ లో పొలం అన్నమాట..మన సిటీల్లోనూ,ఈ దరిదాపుల్లోనూ పొలాలు కనిపించకపోవటం పైగా నాకు పొలాలు అంటే పిచ్చి ఉండటం వళ్ళ కాబోలు...ఒకటే అదే పని...పంట వేయటం తీయటం..చెట్లకి నీళ్ళు పోయటం...గేదెలు కాయటం...రోజంతా ఇదే పననుకోండి...ఒక్కోసారైతే మరీనూ...మా వారు ఆఫీసు నుండి వచ్చినా చూస్కోకుండా ఆడేసేదాన్ని...అమ్మగారు కాస్త టీ మొహాన కొడతారా అంటే...ప్లీజ్ అండి ఇంకా కొంచెం పొలం పని ఉంది,మళ్లీ ఎండిపోతుందేమో అనేదాన్ని...ఏమిటో మరీ విడ్డూరం కాకపోతే...(భలే నవ్వొస్తుంది ఇప్పుడు అవన్నీ తలచుకుంటే)...బొంచెద్దామా అని తను అడిగితే...సరే నేను అన్ని సర్దేలోపు మీరు ఈ పొలం పని కాస్త ముగించేసి రండి అని తనకి అప్పచెప్పిన రోజులు కూడా ఉన్నాయంటే నమ్మండి.....నువ్వు చెప్తే  మాత్రం ఆయన వింటారా అనుకుంటున్నారా?? వినకపోతే అట్లకాడ ఉందిగా!!

అలా అలా నా పిచ్చి ముదిరి పాకాన పడినట్లు..బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్టు...మావాడు  స్కూల్ కి వెళ్ళటం మొదలెట్టాక, వాడి 'హోం వర్క్' పుణ్యమా అని మొత్తం మీద నాకూ ఓ శుభముహుర్తాన జ్ఞానోదయం అయ్యి ఆ facebookని అటకెక్కించేసా...ఆ గేమ్ ఆడే నా స్నేహితులంతా 'అయ్యో' అనుకున్నారు కానీ..ఒకరు  మాత్రం 'అబ్బ' అనుకున్నారు ....ఎవరూ అంటారా ??? ఇంకెవరూ...మా వారే!!! 

34 comments:

 1. Mana gurunchi avatala vallu em anukuntunaro telsukovalani manaki vuntundi, kani telsukovalane 'asa, curiosity' telsukunaka kooda vunte manchidee.. kani vuntundi antara?

  ReplyDelete
  Replies
  1. adhi mana meedhe aadhaarapadi untundhemo andi :)....manaki edhutivallaki unde anubandham meedha kooda aadhaarapadi untundhi anukuntunnanu:)

   Delete
  2. Mari manaki edutivallato anubandam bavundi anokondi.. mari vallu mana gurunchi manchigane anukuntaru ani meru cheptunaru.. correct? Mari alantapudu eduti vallu em anukuntunaro ani think cheyalsina Q ledu kada? :) em antaru?

   Delete
  3. manchigane anukuntaaru emo anukuntaam...kani em anukuntunnaro thelusukovali ani kooda anukuntaam :)

   Delete
 2. బాగా రాసారు కావ్య గారు

  ReplyDelete
 3. Mee creativity ki mechukokunda undalekapothunna ante nammandi!! :)

  ReplyDelete
 4. As usual, chala baga rasaru kavya garu. Ila naku telsi prati okaru alochistu vuntaru, talchukunte funny ga vundi.. anyhow good post, good idea.. keep doing.. :)

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు వజ్రం గారు.మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది :)

   Delete
 5. Wow.. nice attempt.. i like the way of your presentation..

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు,నేను చెప్పిన విధానం (presentation ) నచ్చినందుకు సంతోషం.

   Delete
 6. హమ్మయ్య, మొత్తం మీద జ్ఞానోదయం అయినందుకు, మీకు అభినందనలండి. చక్కగా రాశారు.
  మంచి ముహూర్తంలో బ్లాగ్ ను కూడా ఓ చూపు చూసేయండి,..

  ReplyDelete
 7. ధన్యవాదములండి :)...ఆఆ మొత్తం మీద జ్ఞానోదయం అయ్యిందండి :)

  ReplyDelete
 8. baga rasaru kavya garu kani me vari ni thalchukunte ne kastha pitty ga anipinchindhi miku gnanodhyam avagane egiri ganthu vesi untaru....

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు. అవునండి నాకు కూడా జాలేస్తుంది...అవన్నీ భరించినందుకు అవార్డు కూడా ఇవ్వాలనిపిస్తుంది.

   Delete
 9. Chaala baagundandi. Kadupubba navvinchaaru 2nd half lo...
  Facebook users gurinchi chaala correct gaa raasaaru..

  ReplyDelete
 10. పాపం మీవారు ఎన్ని దేవుళ్ళకి/దేవతలకి పూజలు చేసారో మీరు ఆ ఫేస్బుక్ని ఎప్పుడు అటకెక్కిస్తారో అని :)

  ReplyDelete
 11. హహ్హహ్హ....అవునండి.....మొత్తం మీద ఆయన పూజలు త్వరగానే ఫలించాయ్.....

  ReplyDelete
 12. Yup Kavyaa nuv post chesina prathi daanni support cheyyadam kaadu kaani U r 100% right about FB status messages, photos and postings...

  Ika Farm Ville vishayaanikosthee nenu more than one year aadanu around 100th level daataanu..

  Ha ha ha ha navvosthundi yentha time waste chesaanoo ani manesaaka thelisindi.... :-)

  ReplyDelete
  Replies
  1. హ హ్హ హ్హ.....అవును ప్రవీణ్ గారు....చాలామంది టైం వృధా చేస్కున్నరండి....ఇంకా చేసుకున్తునీ ఉన్నారు కూడా.....
   నా బ్లాగ్ కి స్వాగతం :)

   Delete
 13. మీ అట్లకాడ రహస్యాన్ని దొంగిలించుకుని నా టపాలో రాసుకుంటాను..ఎందుకంటే నాకు అనుభవం లేదు కనక..నా అమ్మాయి మనసుకి మంచి ఎలిమెంట్ దొరికింది..హహహ ..నాకు కూడా ఇప్పుడు నా వ్యాఖ్య చూసి మీరు ఏమనుకుంటున్నారో అని curiousగా వుంది. Nice.

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హ......చిన్ని మరి దొంగతన్నాన్ని నువ్వే బయటపెట్టేసావే???? అట్లకాడ రహస్యం గురించి రాయాలనే ఆలోచన బానే ఉంది కాని....ఇలా నువ్వు అన్ని secrets public గా చెప్పేస్తే ఎలా???

   Delete
 14. నేను కుడా మీ కోవకి చెందినవాన్నే :). ఆ పిచ్చి ఆట లో ఎన్ని గంటలు వృధా చేసానో నాకే తెలియదు. వాళ్ళు ఇచ్చే గిఫ్ట్స్ 'నాకంటే నాకు' అని గొడవపడి మరీ సాధించుకున్న రోజులు కుడా ఉన్నాయి :)
  ఇంకా అసలు విషయానికి వస్తే, అసలు మన గురించి ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో అన్నదే ఆలోచిస్తూ సగం కాలం వృధా చేస్తాము మాములుగా. . మనం చేసేది మంచి అని, సరైనది అని మనకు అనిపిస్తే చాలు, ఎదుటి వాళ్ళు ఎం అనుకుంటారు అని ఆలోచించకుండా , కాలం వృధా చెయ్యకుండా చేసెయ్యొచ్చు అని నా అభిప్రాయం :)

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగు కి స్వాగతం తీపి గుర్తులు గారు :)....నా బ్లాగు చదివినందుకు ధన్యవాదములండి....పాపం పిచ్చి ఆట అనకండి..ఎంతైనా ఒకప్పుడు మన అభిమాన ఆట కదా...హహ్హహ్హ....
   అవును మనం చేసి పనిలో మనకి సంతృప్తి ఉంటే చాలు :)..మీ అభిప్రాయం చాలా చక్కగా చెప్పారండి....

   Delete
 15. Nenu fb lo pettukodanike photos teeyinchukuntunna ee madhya kalam lo. Pichi peak ki cherindi naku kavya garu

  ReplyDelete
  Replies
  1. హహ్హహ్హా..... peakలో ఉన్న పిచ్చిని కాస్త తగ్గించే ప్రయత్నం చేయండి మరి :)

   Delete
 16. చాలా బాగుందండి. ముఖ్యంగా ఆదంత్యాలు , లైకితే, పొలం దున్నడం, facebook కోసమే photo దిగటం

  ReplyDelete
  Replies
  1. హాయ్ Sasikanth గారు, నా బ్లాగ్ కి స్వాగతం.....మీకు నచ్చినందుకు ధన్యవాదములు :)

   Delete
 17. nice presentation kavya gaaru.........

  ReplyDelete
  Replies
  1. థాంక్స్ పండు గారు :)

   Delete

 

View Count
Useful Links