సుమారు 15 రోజులు నా బ్లాగుకి, నా బ్లాగు మిత్రులకి దూరంగా ఉండటానికి కారణం దసరా సెలవులు....ఆ సెలవుల్లో నా ప్రయాణం....ఈ సారి దసరా బెంగుళూరు లో జరుపుకుందాం అని మా అత్తగారు,మా వారు అనటంతో....(అక్కడ మా ఆడపడుచు వాళ్ళు ఉంటారన్నమాట)....నేను ఇంతకు ముందు ఎప్పుడు బెంగుళూరు వెళ్లకపోవటం వల్ల ..పనిలోపని సెలవులు కలిసోస్తాయ్...పండగ అందరం కలిసి జరుపుకున్నట్టు ఉంటుంది..బెంగుళూరు కూడా చూసినట్టు ఉంటుందని....సరే అని తలాడించేసాను...
అలా బెంగుళూరు బయలుదేరాం .... వారం రోజులు ఆఫీస్కి సెలవు,పని పాట లేదు అన్న సంతోషంలో ప్రయాణంలో అలసట పెద్దగా అనిపించలేదు కాని....మన రోడ్ల మీద ఉన్న టోల్ గేటులు చూసే విరక్తి వచ్చేసింది......సుమారు 600 రూపాయిలు,అంటే ఒక మనిషి టికెట్ ఖర్చు మన టోల్ గేటులకే చెల్లించాల్సొచ్చింది.....ఏమిటో ఖర్మ....రోడ్ టాక్స్ ఇంత కడుతున్నాం అంటూ కాసేపు నసిగారు మా వారు...
ఇక ఆ సాయంత్రానికి బెంగుళూరు చేరుకున్నాం....అయ్యో అప్పుడే ఒక లీవ్ అయిపోయిందే అని లోపల ఒక చిన్న బాధ ఉన్నా....ఇంకా 6 రోజులు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని చాలా సంబరపడిపోయి....
ఆ సంతోషంలో కాస్త ఎక్కువే తిని..ఇక మరునాడు చూడటానికి మంచి places ఏం ఉన్నాయో కనుక్కుని......పడుకున్నా....వాళ్ళు suggest చేసిన places ఇస్కాన్ టెంపుల్.....బుల్ టెంపుల్...మంత్రి మాల్....
ఇక ఉదయాన్నే లేచి స్నానం చేసి....పుష్టిగా ఫలహారం తిని....ముందుగా ఇస్కాన్ టెంపుల్ చూద్దాం అని బయలుదేరాం...."నేను 3 సార్లు చూసాను..నాకు దారులన్నీ బాగా తెలుసు అని మా మామయ్య గారు మా వెంట వచ్చారు".... ఇక బయలుదేరిన 2 కిలోమీటర్లు అనుకుంటాను బానే ఉంది.....ఆ తర్వాతే మా మామయ్యగారు ఇటా అంటే ఇటేనేమో....అటా అంటే ఆ ఆ అటే అనుకుంటా అనటం మొదలెట్టారు....
కాసేపు మమయ్యగారినే నమ్ముకుని తిరిగాక....ఒక షాప్ బోర్డు చూసిన నేను కెవ్వున కేక పెట్టాను......ఏవండోయ్ మనం ఇందాకే ఈ షాపు ముందు నుండి వెళ్లాం అని.....అది నగల షాపు లెండి అందుకే అంత కచ్చితంగా చెప్పగలిగాను.....అప్పటికి గానీ అర్ధం అవ్వలేదు...మేము అక్కడ మూడవ ప్రదక్షణ సగంలో ఉన్నాం అని....ఇక ఇది చాలదన్నట్టు.....మామయ్యగారు ఒకటే బెంగుళూరుని పొగడటం....హైదరాబాద్తో పోల్చటం.....అసలే మా వారికి హైదరాబాద్ని ఏమైనా అంటే చెప్పలేనంత కోపం....పైగా ఊరుకాని ఊరిలో తప్పిపోయాం....పైగా AP కార్ అని ఏ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయినా ఆపితే ఎంతో కొంత చెల్లించాలి....అన్నీ కలగలిపి అంతసేపు శోభన్బాబులా హహ్హ హహ్హ అని నవ్వుతున్న మా వారు ఒక్కసారి రాజనాలలా మారిపోయారు....ఇక పరిస్థితి విశమించేలా ఉందని గ్రహించి ...నేను కలగజేసుకుని....కాస్త స్లోగా వెళ్ళండి, ఆ ముందు వెళ్ళే అంకుల్ని అడ్రస్ అడుగుదాం అన్నాను....మా వారు,హట్ట్ ఆయనకీ తెలిసుండదు నీకేం తెలీదు ఊరుకో ....నేను అడుగుతా చూడు అని,ఒక కుక్కని వెంటబెట్టుకు వెళ్తున్న అంకుల్ (కుక్క ఉంది గనుక అక్కడే సెటిల్ అయిన వారు అయి ఉంటారు అని అతితేలివితో అన్నమాట )ని ఆపి "ఇస్కాన్ టెంపుల్" అన్నారు...ఆయన ఎగాదిగా ఓ చూపు చూసి...."i don 't know " అని అడ్డంగా తల ఊపి వెళ్ళిపోయారు......నేను లోలోపల జింకిచకా జింకిచకా తిక్క కుదిరింది అని నవ్వుకుని.....స్లో చేయమని ఒకతన్ని అడ్రస్ అడిగాను.....ఆయన బాగా అలోచించి...బాగానే వివరించినట్టున్నారు కానీ....అందులో చాలా లెఫ్ట్లు చాలా రైట్లు ఉండటంతో....మళ్లీ confuse అయ్యి ఏటో వెళ్ళిపోయాం...మళ్లీ ఒకతన్ని అడిగితే మళ్లీ చాలా లేఫ్ట్లు చాలా రైట్లు.....ఈ గోలంతా ఎందుకు.....నేను gps ఆన్ చేసి చూస్తా వెయిటండి...అని ఫోన్ కోసం వెతికాను ..అప్పుడు గుర్తొచ్చింది,రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం వెంట ఎందుకులే అని అతి తెలివితో మా సెల్ ఫోన్ లు ఇంట్లో పడేసి...ఏదైనా అవసరం అయితే ఇంటికి ఫోన్ చేయాలనీ మా మామయ్య గారి ఫోన్ మాత్రమే తీసుకొచ్చాం అని .....
అందులోనేమో gps లేదు....ఇక తప్పదురా దేవుడా అనుకుని.....వాళ్ళని వీళ్ళని అడుగుతూ....మొత్తం మీద ఇస్కాన్ టెంపుల్ చేరుకునే సరికి.....నిజంగానే దేవుడు కనిపించాడు.....
ISKCON TEMPLE(హరే కృష్ణ హిల్స్,chord రోడ్,బెంగుళూరు )ఒక అందమైన,అద్భుతమైన కట్టడం...చాలా ప్రశాంతంగా ఉంది....అక్కడ నాకు నచ్చిన ఇంకో విషయం ఏమిటంటే....."హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే" అని స్మరించుకుంటూ వెళ్ళటం....మా పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు అలసిపోయారు....లైన్లో నిలబడలేరు అని పూజారిని అడుగగా...అయన నవ్వుతూ....హరే కృష్ణ అనుకుంటూ లైన్ లో వెళ్ళండి .....దేవుడే వాళ్ళకు ఆ శక్తిని ఇస్తాడు అని చెప్పారు :)
ISKCON Images source :Google
నిజానికి 1987 లో ఒక ఇంట్లోనే కృష్ణుడికి పూజలు భజనలు నిర్వహించేవారట....ఆ తర్వాత ISKCON (International Society for Krishna
Consciousness ) వాళ్ళు స్థలం కోసం బెంగలూరు డెవలప్మెంట్ అథారిటీ కి అప్లై చేయగా...ఒక పెద్ద రాయిగా ఉన్న ఒక కొండ లాంటి (వేస్ట్ ల్యాండ్) స్థలాన్ని 11 లక్షలకు అనుమతించారట....ఆ స్థలంలో ఒక షెడ్డు లాంటిది ఏర్పాటు చేసుకుని,పూజలు నిర్వహించేవారట...ఇక ఇప్పుడు ఉన్న గుడి నిర్మాణం అంతా 1990 -97 మధ్యలో జరిగిందట...దీనికోసం 600 మంది నేర్పరులైన కళాకారులు పనిచేసారట...ఇక శ్రీ శ్రీ కృష్ణ బలరాం , శ్రీ ప్రహ్లాద నరసింహ , శ్రీ శ్రీనివాస గోవింద , రాధాకృష్ణుల విగ్రహాలు అద్భుతంగా ఉంటాయ్... చూడడానికి రెండు కళ్ళు చాలవనుకోండి .... బాధలన్ని మరచిపోయి అలా భజన చేస్తూనే ఉండాలనిపిస్తుంది...

(Radha krishna and venkashwara swamy Images source :Google)
ఇక అలానే బుల్ టెంపుల్....మంత్రి మాల్ రెండు కాస్త దగ్గర దగ్గరే ఉండటంతో...వాళ్ళని వీళ్ళని అడుగుతూ వెళ్లాం....
Dodda Basavanna Gudi (బుల్ టెంపుల్.)....పవిత్రమైన నందీశ్వరుడిని బుల్ అనటం నాకు ఎదోల అనిపించింది....ఆ గుడి పేరు....దొడ్డ బసవన్న గుడి(పెద్ద బసవన్న గుడి అని అర్ధం )....1537 వ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు అయిన కెంపే గౌడ అనే రాజు ఈ గుడి నిర్మించారట.....నిర్మాణంలో విజయనగర కళ కనిపిస్తుంది.... శివుని భక్తుడు...బంటు అయిన మన నందీస్వరుడికి...ఇది ప్రపంచంలోనే అతి పెద్ద గుడి...బెంగుళూరుని వెళితే.....తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఇదీ ఒకటి :)
ఇక మంత్రి మాల్ అనేది ఒక పెద్ద షాపింగ్ మాల్.....హైదరాబాద్ లో ఉండేవాల్లకైతే...మన inorbit లా అన్నమాట...బాగుంది...ఓపిక ఉంటే ఒక రోజంతా అక్కడ గడిపెయోచ్చు.....'ఆడవారిమాటలకు' సినిమాలో వెంకటేష్ లాంటి పాత్రలు చాలానే కనిపించాయి...అంటే ఆడవాళ్ళు షాపింగ్ చేస్కుంటుంటే....పిల్లలని చూసుకుంటూ మెట్లపై కూర్చునే బాపతు...హహ్హహ్హా...
దారితేలియక తిరిగి తిరిగి అలసిపోయి ఆ దెబ్బకి....మరుసటి రోజు ఎక్కడికి వెళ్ళలేదు...కాసేపు అలా ఇంటిదగ్గరే ఉన్న పార్క్కి వెళ్లి....బెంగుళూరుని పానిపూరి రుచి చూద్దాం అని వెళ్ళాం....ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవలండి....హైదరాబాద్ పానిపూరి is the best ....
ఇక ఆ మరుసటిరోజు....విజయదశమి....ఉదయాన్నే లేచి...పూజా కార్యక్రమం ముగించుకుని.....నంది హిల్స్కి ప్రయాణం .... ఈ సారి ఎందుకైనా మంచిదని gpsనే నమ్ముకున్నాం...పాపం గూగుల్ తల్లి బానే సహకరించింది..... ఉదయం 7 గంటలకి అక్కడికి చేరుకున్నాం....
Nandi Hills...ఆహ్లాదకరమైన ప్రదేశం...బెంగుళూరు నుండి సుమారుగా 62 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందమైన హిల్ స్టేషన్.....వేసవిలో టిప్పు సుల్తాన్ ఇక్కడ గడిపేవారట.....అప్పట్లో దీన్ని ఆనందగిరి అని పిలిచేవారట.....ఇప్పుడు నంది హిల్స్/ నంది బెట్ట అంటారు...కొండ పైన ఒక శివుని ఆలయం(యోగ నందీశ్వర గుడి ) ఉంటుంది,కొండకి అంచున ఒక పెద్ద నంది కూడా ఉంటుంది...ఇక్కడ "టిప్పు డ్రాప్"..అని ఉంటుంది...... టిప్పు సుల్తాన్ హయాంలో నేరస్తులని ఇక్కడి నుంచి కిందకి తోసేవారట....అందమైన కోట కూడా ఉంది...ఉదయం 6 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు వెళ్ళటానికి అనుమతిస్తారు. కానీ...ఉదయం వెళ్తేనే బాగుంటుంది....ఉదయం 6 - 6 :30 కల్లా అక్కడికి చేరుకోగాలిగితే మేఘాలు కప్పేసిన నంది హిల్స్ని చూడవచ్చు.....చలి చలిగా...తడి తడిగా....మంచు, మేఘాలు మనల్ని తాకుతూ వుంటే ...ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం....వీలైనప్పుడు ఒకసారి వెళ్లి చూసోచ్చేయండి :)
నాలా ఫోటోల పిచ్చి ఉన్నవాల్లకైతే చాలా మంచి ప్లేస్ అండ్ weather అని చెప్పొచ్చు.....ఇక ఫోటోలు తీసుకుని తీసుకుని అలసిపోయి....తిరుగు ప్రయాణం.....ఇంటికి చేరుకునే సరికే 2 అయ్యింది....బయట బాల్కనీలో ఫోటోలు తీసుకుంటుంటే ....ఒసేయ్ ఏమైనా తిని తగలడు.....నీ ఫోటోల పిచ్చి తగలెయ్య !!!! ...అని ఎవరో అన్నట్టు అనిపించి ఎవారా అని చూస్తే...... నా బుజ్జి పొట్ట పాపం :D
మర్చిపోయానండోయ్!!!!నందిహిల్ల్స్లో కోతులు చాలా ఎక్కువ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి.....ఇక ఫుడ్ కూడా పెద్దగా ఏం బాగోదు ...ఏమైనా వెంట తీసుకెళ్లటం ఉత్తమం...
ఇక ఆ మరుసటి రోజు ఉదయాన్నే నేను ఎప్పటినుంచో చూడాలి చూడాలి అనుకున్న కోటిలింగేశ్వర ఆలయానికి ప్రయాణం మొదలు.....దీనికి కూడా GPs నే నమ్ముకున్నాం..... కొంచెం ఇబ్బంది పెట్టింది.....గూగుల్ తల్లి మ్యాప్ లో కోటిలింగేశ్వర ఆలయం అంటే కాస్త తికమక పడింది ......కోటిలింగేశ్వర ఆలయం కమ్మసంద్ర ఊరిలో ఉంది (కోలార్ జిల్ల )...అందుకని కమ్మసంద్ర అని వెతికితే గూగుల్ తల్లి సహకరించింది.....మధ్యలో బంగారుపేట అనే ఊరు వస్తుంది.....
కోటిలింగేశ్వరం ఆలయానికి వెళ్ళే రోడ్ వెంట అంత శివలింగాలు.....ఇక ఆలయంలో ......108 అడుగుల ఎత్తైన శివలింగం(బహుశా ప్రపంచంలోనే అతి పెద్దదైన లింగం అయి ఉండవచ్చు )....ఒక అధ్భుతం......
35 అడుగుల నందీశ్వరుడు....
ఇక ఎటు చూసిన....వివిధ రకాలు,వివిధ సైజుల్లో లింగాలు....దాదాపుగా కోటి.....కోటికి 10 లక్షలు తక్కువ ఉన్నాయని అక్కడ పూజారి గారు చెప్పారు...ఎవరైనా స్థాపించాలి అనుకుంటే.....డబ్బు ఇవ్వచ్చట....
ఇక ఆలయం విషయానికి వస్తే .....మొదటి ఆలయంలో సతీసమేతంగా బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు దర్శనం ఇస్తారు.....ఇక్కడ చెప్పుకోవలసింది అలంకారం గురించి.....పూలమాలలతో అద్భుతంగా అలకరించిన మూర్తులను చూడటానికి రెండు కళ్ళు చాలవు.....అలంకారం చాలా బాగుంది అని మేము అన్నప్పుడు పూజారి గారు చెప్పారు
"శివుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు" అని.
ఇక్కడ ఒక దారం అమ్ముతారు....ఆ దారం పూజలో పెట్టి...కోరిక కోరుకుని ఆలయం బయటే ఉన్న చెట్టుకి కడితే కోరిన కోరిక తీరుతుందట.....
ఇక ఆ పక్కనే వెంకటరమని స్వామి (వెంకటేశ్వరా స్వామి )......అన్నపూర్ణేశ్వరి దేవి, పాండురంగ స్వామి,పంచముఖ గణపతి ,సీతారామ లక్ష్మణులు,ఆంజనేయ స్వామి,కన్యకా పరమేశ్వరి ఆలయాలు ఉన్నాయి... అందరు దేవుళ్ళూ ఉన్న ఆలయం లో ఉంటే స్వర్గంలో దేవుళ్ళ మధ్యలో ఉన్నట్టే ఉంది...
ఆలయంలో....చిన్న శివ లింగానికి మనమే అభిషేకం చేసే అవకాశం ఉంటుంది.....అలాగే పెద్ద లింగము పక్కనే....ఒక చిన్న ట్యాంక్ లాంటిది కట్టి ఆ మధ్యలో శివ లింగం ఉంచారు....భక్తులు అక్కడ కూడా అభిషేకం చేయోచ్చు....
సాయంత్రం 6 గంటలకి మల్లీ ఇల్లు చేరుకున్నాం...ఇక ఆ రోజుకి విశ్రాంతి....మరుసటి రోజు హైదరాబాదుకి తిరుగు ప్రయాణం...
ఉదయాన్నే బయలుదేరం....ఘటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం,లేపాక్షి దర్శించుకుని వచ్చాం....
ఇక Ghati Subramanya Swamy Temple (ఘటి సుబ్రమణ్య స్వామి ఆలయం) గురించి చెప్పాలంటే...బెంగుళూరు నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే , కార్తికేయుడు,నరసింహస్వామి విగ్రహాలు కలిసి ఉంటాయి...ముందు వైపు కార్తికేయుడు,వెనక వైపు నరసింహ స్వామిగా విగ్రహం వేలిసిందట ...నరసింహ స్వామి మనకి కనిపించటానికి వెనక ఒక అద్దం అమర్చారు....అంటే ముందు కార్తికేయుడు..అద్దంలో నరసింహ స్వామి కనిపిస్తారన్నమాట...ఇక్కడ కోరిన కోరికలు తప్పక తీరుతాయట...ఇక ఆలయ సమీపంలో ఒక చెట్టు కింద లెక్కలేనన్ని నాగ ప్రతిమలు ప్రతిష్టించి ఉంటాయి....
ఇక అక్కడి నుంచి లేపాక్షి....ఇక మొత్తం మీద మన ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎంటరయ్యాం.....హిందూపూర్కి దగ్గరలో(అడ్రస్ కరెక్ట్గా తెలియదు) ఒక శివాలయానికి వెళ్ళాం....అక్కడ కూడా పెద్ద శివుడు ,చాలా లింగాలు....
ఇక మా గురించి పట్టించుకోరా....మీ కడుపు మాడ అని లోపలినించి ఎవరో అరిచినట్టనిపిస్తే...ఓఒహ్ నిజమే కడుపు మాడుతోందని గ్రహించి ....హిందూపూర్లో భోజనం చేసి...లేపాక్షి బయలుదేరాం....
Lepakshi(లేపాక్షి)...హిందూపూర్ నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది లేపాక్షి......ఆలయంలో వీరభద్ర స్వామి ...ఒక వైపు అమ్మవారు....గుడివెనక వైపు ఏడుపడగల నాగరాజు తో శివలింగం ఉంది.....
ఆలయానికి దగ్గరలోనే ఉన్న పెద్ద నందీశ్వరుడు ఈ లింగాన్ని చూస్తున్నాడని ప్రతీతి..అంటే ఎదురెదురుగా అని....
ఇక్కడి sculpture ....carvings ..... ..చూస్తే విజనగర శిల్ప కళా వైభవం ఉట్టిపడుతుంది.....గుడి చాలా బాగుంది కానీ maintenance లేనట్టు అనిపించింది....మన ప్రభుత్వం ఇలాంటి కళా వైభవాలను కాపాడే ప్రయత్నం చేస్తే tourism డెవలప్ చేసిన వారవుతారు అని నా అభిప్రాయం...
ఇవండీ, నా బెంగుళూరు ప్రయాణం ముచ్చట్లు :)
ఇదంతా చదివి చాలా అలిసిపోయినట్టునారు...రెస్ట్ తీసుకోండి....మళ్లీ నెక్స్ట్ పోస్ట్ లో కలుద్దాం :) Keep Smiling :)
.............మీ కావ్యాంజలి ♥♥♥
నా కనులు నీవిగా చేసుకుని చూడు అన్నంతగా వివరించారు.....నేను మీ వల్ల బెంగుళూరు చూసేసానోచ్:-) థ్యాంక్యూ!
ReplyDeleteనా కనులు మీవిగా చేసుకుని చూసి, అభినంధించిన మీకు చాలా చాలా థాంక్స్ పద్మర్పిత గారు :)
Deleteబాగున్నాయండి మీ ప్రయాణ విశేషాలూ. నిజమే మీ మాటతో నేనూ ఏకీభవిస్తాను.. హైదరాబాద్ లో పానీ పూరీ సూపర్ అని :)
ReplyDeleteనా బ్లాగ్ చదివి,అభినందించినందుకు ధన్యవాదములు సుభ గారు :) అవునండి , hyderabad paani poori is really superb....
Deleteబాగున్నాయండి మీ బెంగుళూర్ విశేషాలు...మొత్తనికి మాకు కూడా మీ కల్లతో బెంగుళూర్ చూపించారు.
ReplyDeleteమీకు నచ్చినందుకు సంతోషం డేవిడ్ గారు , ఏదో నేను చూసింది మీ అందరితో పంచుకోవాలనే చిన్ని ప్రయత్నం :)....మీ అభినందనలకి ధన్యవాదములు :)
Deleteబెంగుళూరు మీ ప్రయాణ విశేషాలూ...ప్రదేశాలు బాగున్నాయండి!
ReplyDeleteనా బ్లాగుకి స్వాగతం నాగేంద్ర గారు....మీ అభినందనలకి ధన్యవాదములు :)
Deleteనంది హిల్స్ వెళ్ళినవాళ్ళు తప్పక చూడాల్సిన ప్రదేశం అక్కడికి దగ్గరలొనే ఉన్న ముద్దెనహళ్ళి.
ReplyDeleteఇక్కడ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇల్లు, చిన్న మ్యూజియం (భారత రత్న పతకం ఉంది), ఆయన సమాధి ఉన్నాయి.
నా బ్లాగుకి స్వాగతం bonagir గారు :)...అయ్యో !! నాకు ఎవరు చెప్పలేదండి....చెప్పినందుకు థాంక్స్...ఈ సారి వెళ్ళినప్పుడు తప్పక వెళ్తాను :) నా బ్లాగు చదివినందుకు ధన్యవాదములు :)
Delete
ReplyDeleteచాలా బాగుందండి. ఆ మధ్యనే నేను కూడా చూసొచ్చాను.bonagiri garu, అయ్యో! అది నేను కూడా మిస్ అయ్యానండి:(
నా బ్లాగుకి స్వాగతం జయ గారు :) నేను కూడా ఆ ప్లేస్ మిస్ అయ్యానండి :( అభినందనలకి ధన్యవాదములు జయ గారు :)
Deleteee saari holidays lo ekkadikee vella lekapoyamanna baadhani okka post tho theerchesaarandi
ReplyDeleteనా బ్లాగుకి స్వాగతం veenaa lahari గారు:) ఎక్కడికి వెళ్ళలేకపోయాం అన్న మీ బాధ నా టపా తీర్చింది అన్నారు...చాలా సంతోషంగా ఉందండి....ధన్యవాదములు :)
Deleteబెంగళూరు అద్భుతం.
ReplyDeleteనా బ్లాగుకి స్వాగతం బ్లాగు బాబ్జీ గారు :) అవునండి,నిజంగా అద్భుతంగా ఉంది....నా బ్లాగు చదివినందుకు ధన్యవాదములు :)
DeleteNice travelogue!! చాలా బాగా వివరించారు :)
ReplyDeleteThank you so much srinivasarao gaaru :)
Deletemeeru anni chusaru kani one of the 7th wonder in bangalore,adi matram chudaledu.
ReplyDeleteBANGALORE MAITREYA BUDDHA MEGA PYRAMID
akkadiki meeru velli vunte inkasta aanandam ni sure ga ponde varu
నా బ్లాగు కి స్వాగతం చైతన్య సాగర్ గారు :)....అయ్యో!!! ఈ సారి వెళ్ళినప్పుడు తప్పక చూస్తానండి .....ఇంకా చాలా places మిస్ అయ్యాము....ఈ సారి వెళ్ళినప్పుడు అన్ని చూసొచ్చి ఆ అనుభవాలు కూడా అందరితో పంచుకుంటాను :)
Deleteధన్యవాదములు :)
బెంగుళూరులో మీరు చూసిన ప్రదేశాలని బాగా వివరించారు. మీరన్నట్టు నంది హిల్సు ఉదయం పూట చాలా బాగుంటుంది.
ReplyDeleteముద్దెనహళ్ళి...దీని గురించి మాకూ తెలియలేదు..ఈ సారి వెళ్ళినప్పుడు చూడాలి.
నా బ్లాగుకి స్వాగతం సిరిసిరిమువ్వ గారు :)...అవునండి నేను కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి ఇల్లు,మ్యూజియం మిస్ అయ్యాను, ఈసారి చూడాలి...నా బ్లాగు చదివి,అభినందించిన మీకు నా ధన్యవాదములు :)
Deleteబావుందండి మీ బెంగుళూరు ప్రయాణం... పెద్ద బసవన్న గుడికి దగ్గర్లోనే ఉంటున్నా ఎప్పుడు వెళ్ళలేదు మేము...
ReplyDeleteఅలా ఓసారి మైసూరు కూడా చుట్టేసి రావలసిందండి, వెళ్ళే దారిలో శ్రీరంగ పట్నం (ఆది రంగ) బావుంటుందండి...
నా బ్లాగుకి స్వాగతం ఏరువాక గారు :).....నా బ్లాగ్ చదివి,అభినందించినందుకు ధన్యవాదములు .......
Deleteఓ మీరు బసవన్న గుడి దగ్గరే ఉంటారా??? దగ్గర ఉంటే అంతేనండి ...దగ్గరే కదా ఎప్పుడైనా వేల్లోచ్చులే అనుకుంటాం...గుడి చాలా బాగుంది....కుదిరనప్పుడు వెళ్లి చూసిరండి :) మైసూరు వెళ్లాలని నాకూ ఉందండి...కాని టైం సరిపోలేదు...ఈ సారి సెలవుల్లో తప్పక వెళ్తాం...శ్రీ రంగ పట్నం గురించి చెప్పినందుకు థాంక్స్ అండి .....
poojalu punskaaraalu vrathalu nomula ento uththa.............
ReplyDelete??? anyway thanks for visiting my blog
DeleteBaavundani mee trip :)
ReplyDeleteThank u Priya gaaru :)
Deleteమీ బెంగుళూరు ట్రిప్ చాలా హేపీగా ఆహ్లాదంగా జరిగి దసరా పండగ సెలవులను బాగా ఎంజాయ్ చేసినందుకు అభినందనలు కావ్యాంజలి గారు.. ఇంత చక్కగా ఆయా స్థలల ప్రత్యేకతను ఫోటోలతో వివరిస్తూ పంచుకున్నందుకు ధన్యవాదాలు..బెంగళూరు వెళ్ళి వచ్చినట్టుంది...
ReplyDelete"బెంగళూరు వెళ్ళి వచ్చినట్టుంది" అని మీరు అనటం చాలా సంతోషాన్ని కలిగించింది....మీ అభినందనలకి ధన్యవాదాలు వర్మ గారు :)
Deletemeeru prapancham lo ea moolaku vellina aa trip vishhaayalu thappani sariga rayandi naaku Travelogue ante chala istham
ReplyDeleteతప్పకుండా రాస్తాను.....thanooj గారు :)
Deleteఅంజలి గారు, ఫోటోస్ చాలా బావున్నాయి. లేపాక్షి నేను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను.. మళ్లీ మీ వల్ల ఇంకొకసారి చూడగలిగాను.
ReplyDeleteధన్యవాదములు చిన్ని గారు :)
Deleteఅన్ని ప్రదేశాల గురించి చాల చక్కగా వివరించారండి....థాంక్స్
ReplyDeleteనా బ్లాగ్ కి స్వాగతం శేఖర్ గారు :)....మీ అభినందనలకి ధన్యవాదములు :)
DeleteWoww.. wonderful.. i feel i'm in banglore now.. keep writting..
ReplyDeleteనా బ్లాగుకి స్వాగతం :)......Glad that you liked it....పోస్ట్ చదివి B'lore లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను అన్నారు,చాలా సంతోషంగా ఉంది....Thank You :)
DeleteSuper Kavya garu!! Chala bagaaaa Bangalore choopincharu sumeee!!!
ReplyDeleteహాయ్ teju గారు, మీకు నచ్చినందుకు థాంక్స్ :)
Deletenaaku kalalo vellochinatluga undandi.....mee post chadivite, but 2006 lo banglore lo job chesanu kaani city maatrame tirigaanu....anyway very nice
ReplyDeleteహాయ్ పండు గారు,నా బ్లాగుకి స్వాగతం :).....అభినందనలకి ధన్యవాదములు :)
Deletesuper photoes and super explanation.....
ReplyDeleteబాగుందండి మీ టూర్ విశేషాలు.
ReplyDelete