
ఇక రియాలిటీ లోకి వస్తే.....
నేను, మా వారు ఇద్దరం సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాం.... నేను ఉదయం 9:30 కి ఆఫీసులో ఉండాలి. తను 10 గంటలకల్లా ఆఫీసు చేరుకోవాలి..ఉదయాన్నే లేచి ఏదో వండేసి , వండింది ఇంత నోట్లో వేసుకుని....ఇంకాస్త బాక్స్ లో వేసుకుని...ఆఫీసులకి వెళ్తాం.....అక్కడ మేనేజర్ గారు "వచ్చారా మేడమ్, రండి రండి,ప్రయాణం కులాసాగా జరిగిందా అన్నట్టు చాలా వెటకారంగా చూస్తూ,టైం ఎంతయ్యింది అంటాడు" మనం ఎక్కడ లేని వినయం చూపిస్తూ ఓ నవ్వు నవ్వితే అక్కడితో ఆపేస్తాడు.....లేదు అని రెచ్చిపోయమో పుచ్చిపోయామే....అలా సర్దుకుని....ఏదో ఉన్న పని చేసుకుని...లంచ్ అవర్ లో తనకి ఒకసారి కాల్ చేసి తిన్నారా, ఏంటి విశేషాలు అంటామో లేదో టైం అయిపోతుంది అని గుర్తుకు వస్తుంది....ఇక ఉంటానండి అని ఫోన్ పెట్టేసి.....బ్రతకాలంటే తినాలి అనుకుని, తెచ్చుకున్న డబ్బా ఖాలీ చేయాలి...ఇక మళ్లీ వెళ్లి పనిలో పడిపోతా.....ఇక కాస్త త్వరగా ఇంటికి చేరుకోగలిగితే పరవాలేదు....ఏదో వంట అనే కార్యక్రమం కాస్త సజావుగా సాగిపోతుంది...కానీ , పొరపాటున నాకు పని వల్ల కాస్త ఆలస్యం అయ్యిందో...ఇక అంతే సంగతులు....వంట చేయటానికి టైమూ,ఓపిక రెండూ ఉండవు.....అప్పుడు ఎక్కడో మనసు మూలల్లో ఏదో తెలియని ఒక అసంతృప్తి,అసహనం ....అయ్యో!!! మా ఆయనకి సరిగా వండి పెట్టలేకపోతున్నానే అని....పోనీ ఉదయాన్నే లేచి చక్కగా వండుదామా అంటే...అదేమిటో, నిద్రా దేవత ఇప్పుడు లేవనివ్వానంటే లేవనివ్వను అని పట్టుబడుతుంది.....ముందు రోజు పని అలసట వల్లనో ఏమో....శరీరం కూడా సహకరించదు......అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది,ఈ సమస్యని ఎలా అధిగమించాలి అని ఆలోచించే లోపే మళ్లీ ఆఫీసు టైం అయిపోతుంది....మళ్లీ పరుగో పరుగు.....
ఇలా 5 రోజులు పరుగులు తీస్తూ, ఒక రోజు ఇంట్లో ,ఒక రోజు బయట తింటూ గడిపేస్తూ, ఒకరిమోహాలు ఒకరం సరిగా చూసుకున్నామో లేదో తెలియని అయోమయంలో ఉంటూ ఆ 5రోజుల పండగ కాస్తా ముగించేస్తాం....
ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న వీకెండ్ వచ్చేస్తుంది...."శనివారం, ఆదివారం" . ఒరిస్సా తుఫాను బాధితుడికి తిండి దొరికినట్టు దొరికే ఆ రెండు రోజులు వస్తూనే....కూరగాయలు, సరుకులు,షాపింగ్,బిల్లులు కట్టడాలు,ఇల్లు శుబ్రం చేసుకోవటం , అలసిపోయి పడుకోవటం తో తుర్ర్ మని ఎగిరిపోతాయి రెండు రోజులు....

ఇక ఆఫీసుకి ఆలస్యంగా వెళ్ళామా ...అంతే...బాస్ గారు పంచబక్ష పరమాన్నాలతో సత్కరించి...సన్మాన కార్యక్రమం మొదలు పెడతారు....ఎప్పుడైనా టైం దొరికినప్పుడు,ఆఫీసు కాబ్ లో వెళ్తూ ఆలోచిస్తే చిన్న అసంతృప్తి, ఏదో వెలితి....ఏంటి ఈ జీవితం??? ఇలా ఎంతకాలం పరుగులు?? అసలు కుటుంబం కోసం నేను ఏం ేస్తున్నాను...అయిన వాళ్ళని ఫోన్ లో కూడా పలకరించే టైం లేకుండా అయిపోయింది...పోనీ ఆఫీసులో మనం ఏమైనా గొప్ప పోసిషన్ లో ఉన్నామా అని తరిగి చూసుకుంటే....అదే కుర్చీ,అదే టేబుల్,అదే కంప్యూటర్...నొక్కి నొక్కి అరిగిపోయిన మౌస్,కొట్టి కొట్టి అరిగిపోయిన కీబోర్డ్...ఒక వెయ్యో రెండు వేలో హైకు....మరీ జుట్టుపీక్కుని, కళ్ళు పోయేలా పని చేస్తే ఇంకో 4 బటానీలు చేతిలో పెడతారు...
అమ్మ ఇంటికి వస్తే గట్టిగా ఒక గంట తన పక్కన కూర్చుని మట్లాడే తీరిక లేని సంపాదన , భర్త పుట్టినరోజు నాడు ఒక గంట ముందుగా ఇంటికి రాలేని ఉద్యోగం...రేపు పిల్లలు పుడితే వాళ్ళకి తినిపించటానికి, ప్రేమగా దగ్గరకు తీసుకోవటానికి టైం ఉంటుందా?? బాబోయ్ !!!! వద్దు నాకీ సంపాదన అనిపించింది...
ఇంతలోనే నా మనసుకి నేనే సర్దిచెప్పుకున్నా...."బంగారం....ఇన్ని భాద్యతల మధ్య నీకు తోచిందేదో నువ్వు చేస్తున్నావ్,నిన్ను నువ్వు చూసుకుని గర్వపడాలి....పిల్లలు పుట్టేదాక ఉద్యోగంలో పైకి ఎదుగు...పిల్లలు పుట్టాక మనేయోచ్చులే...అప్పుడు కుటుంబానికే మన ఓటు" అని..

అసలు అమ్మాయిలు పెళ్ళయ్యాక ఉద్యోగం చేయాలా?? మానేయాలా???
ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.
నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)
ఏంటి?? ఈ అమ్మాయి ఏదో కష్టాలన్నీ అమ్మాయిలకే అయినట్టు చెబుతోంది.....బాగా ఆడవాళ్ళ పక్షపాతిలా ఉంది....అని నా మీద కారాలు,మిరియాలు నూరుతున్నారా?? ఆగండాగండి అక్కడికే వస్తున్నా.....ఇప్పటి వరకు నేను ఒక సగటు అమ్మాయి ఎలా అయితే ఆలోచిస్తుందో, మదన పడుతుందో చెప్పాను , కానీ ఇలా మదనపడే అబ్బాయిలూ ఉంటారు ...ఉద్యోగంలో busy గా ఉండి , ఫ్యామిలీ తో గడపలేకపోతున్నాం అని వాళ్ళు కూడా బాధపడతారు.
నోట్: ఇది నా కథ కాదు...నా స్నేహితురాళ్ళు, తెలిసినవాళ్ల అండ్ నా అనుభవాలు అన్నీకలిపి ఇలా రాసాను :)