Pages

Monday, 10 September 2012

అది సహాయమా లేక భాద్యతా??

హెలో అండీ  అందరికీ  నమస్కారం!!! భ్లాగ్ రాయటం ఇదే మొదటి సారి,తప్పులు ఉంటే మన్నించండి. భ్లాగ్ రాయాలనే కోరిక ఎప్పటినుండో మనసులో అలా ఉండిపోయింది. ఒక స్నేహితుడి ప్రోత్సాహంతో ఇలా మొదలు పెట్టాను. ఏదో సరదాగా జరిగిన సంఘటనలన్నీ మళ్ళీ గుర్తుచేసుకోవచ్చనీ,నవ్వుకొవచ్చనీ, నవ్వించవచ్చనీ(అనుకుంటున్నాను) మొదలు పెడుతున్నాను .నాకు నవ్వటం అంటే భలే ఇష్టం లెండి.

                ఇక  విషయంలోకి వస్తే, ఈ రోజు త్వరగానే పని ముగించుకుని కంప్యూటర్ ముందు కూర్చున్నా. ఆ మద్య ఏదో వస్తువు కొనడానికి తెగ సర్వే చేస్తుండగా నాకొక ఇండియన్ సైట్ దొరికింది లేండి, సోషల్ నెట్ వర్కింగ్ లాంటిదనమాట. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెబుతున్నావు తల్లి!! అనుకోకండి. చెప్తా చెప్తా!!! సిస్టం ముందు కూర్చున్నాని చెప్పాను కదా. కూర్చున్నదాన్ని కూర్చొని నా పని నేను చేస్కోకుండా,ఆ సైట్ ఓపెన్ చేసి అక్కడ ఒక అమ్మాయి రాసిన సమస్యని చదివాను. అక్కడ ఆవిడ ఎమని రాసారంటే .......

             "మావారు నాతో ప్రేమగానే ఉండటం లేదు, ఇంట్లో అసలు ఏ పనీ చేయరు,ఏదీ పట్టించుకోరు. పిల్లల్ని చూసుకోవడంగాని, వాళ్ళనీ స్కూల్ లో దించడంగానీ, అసలు పొరపాటున కూడా వంట గది లోకి రారు. పొద్దున లేచిన దగ్గర నుంచి అన్ని నేనే చూసుకోవాలి, ఇంట్లో అన్ని పనులు చేసి, పిల్లల్ని రెడీ చేసి, వాల్లకి బాక్స్ పెట్టి, మాకు పెట్టుకుని, వాల్లని స్కూల్ లో దించి నేను అఫీస్ కి వెళ్ళాళి. ఎప్పుడైనా కూరగాయలు తెమ్మని చెప్పినా కూడా తీసుకురారు. పొరపాటున ఏదైన పని చేసినా ఆ రోజంతా  దెప్పుతూనే ఉంటారు..ఫైగా నేను ఎప్పుడు పని పని అంటు ఆఫీస్ లోనే అలసిపోయి ఇంటికి వచ్చిన తనని పట్టించుకోవటంలేదు అని తన కంప్లైంట్. నేనూ ఆఫీస్ కి  వెలుతున్నా కదా,నేను అలసిపోతున్నాను కదా.తను ఒక్కరే కష్టపడుతున్నట్టు తను ఒక్కరే సంపాదిస్తున్నట్టు మాట్లాడటం నాకు చాలా భాదగా ఉంటుంది. తన ఫీలింగ్ ఏంటంటే, మగమహారాజులు ఇంటి పనులు చేయకూడదు, ఆ పనులన్నీ ఆడవాళ్లు మాత్రమే చేయాలి, మగాళ్ళు అలా 'సహాయం' చేస్తే, భార్య ధృష్టిలో లోకం ధృష్టిలో లోకువ అవుతారట!!!! "


నేను చదివి ఊరుకోకుండా, ఓ పెద్ద వీరనారీమణిలా ఫీల్ అయిపోయి.. ఇల కామెంట్ పెట్టాను…

             " ఏం భర్త ఇంట్లో కాస్త పని  చేస్తే తప్పేంటట, మగ వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేయాలా? కనీ పెంచిన అమ్మ నాన్ననీ , తోబుట్టువుల్నీ, పుట్టి పెరిగిన ఊరినీ  వదిలేసి,తన భర్త కోసం అతను కట్టిన తాళి కోసం, భర్త ఇళ్ళే తన ఇళ్ళు, భర్త తరపు వాళ్ళే   తన వాళ్ళు  అనుకొని, మౌనంగా తన ఇంట్లో  అడుగుపెట్టిన అమ్మాయిని ఇలాగేనా చూసుకునేది? ఆ అమ్మాయికి  అన్నీ తనై  చూసుకోవాల్సిన భర్త, ఇలా మగాళ్ళు అవి చేయకూడదు, ఇవి చేయకూడదు అంటే ఎలా?? రెండు మనసులు కలిస్తేనే ప్రేమ, రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. అలాగే భార్యాభర్తల ప్రేమకి ప్రతి రూపాలే పిల్లలు. అలాంటప్పుడు భర్త పిల్లల్ని చూసుకోవటంలో తప్పేం ఉంది, అందులో లోకువ అయిపోవటం ఏం ఉందీ..భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు భర్త ఇంట్లో కాస్త పని చేస్తే అది 'సహాయం' ఎలా అవుతుంది, భాద్యత కాదా??!! మగాళ్ళు ఎందుకు దాన్ని 'హెల్ప్(సహాయం)' అని ఆడవాళ్ళు చేయవలసిన పని తాము చేస్తున్నామనీ ఫీల్ అవుతారో నాకు అర్ధం కాదు. ఈ విషయంలో నేను ఒక్కదాన్నే ఇలా అలోచిస్తున్నానా??"

                            అదనమాట మన రిప్లై....విప్లవం వర్ధిలాలి టైప్ అనుకోండి...

మనకి ఇంత భారీ డైలాగులు అవసరమా!!! ఆసలే ఆవిడ కోపంగా ఉంటే మన రిప్లై ఇంకా రెచ్చగొడుతున్నట్లు లేదూ?? అని నన్ను నేను ప్రశ్నించుకుంటుండగానే...టిడిన్ అని ఒక రిప్లై "అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారండి సూపర్ అసలు మీరు" అంటూ. అది చూసి మురిసిపోతున్నానా, అంతలోనే మరోసారి టిడిన్, మరో రిప్లై అన్నమాట "ఆహా భలే అడిగారండి,అది 'హెల్ప్' ఎలా అవుతుంది.గ్రేట్"  అంటూ..

అంతే ఇక మనం ఆగితేగా,అలా ఆకాశపు అంచులదాకా వెల్లిపోయా,అలా అలా ఆకాశం లో విహరిస్తుండగా..మరోసారి టిడిన్, మరో రిప్లై, కొబ్బరిచిప్పవంక ఆశగా చూస్తున్న కోతిలా ఆశగా మానిటర్ వైపు చూసా.. అంతే!!అప్పటివరకు అంత ఎత్తున ఉన్న నేను ధడేల్ మని  కిందపడ్డాను. సంగతేంటంటే..అది -ve రిప్లై అన్నమాట!!!

"భార్యలకి 'హెల్ప్' చేసే భర్తలు కూడా చాలా మందే ఉన్నారు.అయినా ఎదైనా ప్రొబ్ల్లెం వస్తే భర్త తోనే చెప్పొచ్చుగా.. నేనూ సంపాదిస్తున్నాను నేను ఎందుకు అడగాలి అనే అహంకారం కాకపొతే,నాకు కాస్త 'హెల్ప్' చేయరూ..అని ప్రేమగా అడగొచ్చుగా..ఆ విషయం ఇలా పబ్లిక్ సైట్ లో రయటం ఏంటో..ఎవరో కూడ తెలీని వాళ్ళ సానుభూతి కోసం మొగుడి మీద చాడీలు చెప్పటం ఎంటో, దానికి మళ్ళీ వేరే పనేంలేనట్లు  జనాలు రిప్లైలు ఇవ్వటం ఏంటో!!!"    ఇది ఆ  ప్రతికూల రెప్లై....

అయితే మనం ఇక్కడ గమనించవలసిన సంగతి ఏంటంటే ఇంతసేపు మనని ఆహా ఓహో సూపర్ బంపర్ అన్నవాళ్ళంతా ఆడ లేడీస్ అనమాట!!! ఇప్పుడు హట్టాత్తుగా ఒక మగ పురుష్ ఎంటర్ అయ్యారన్నమాట!!!

    నిజానికి ఆయన చెప్పిన మాట కూడా నిజమే గొడవలు అనేవి ఎక్కడైన సహజం. ఇంట్లో,పైగా భార్యాభర్తల మద్య ఏదైనా సమస్య ఉంటే ఇంట్లోనే పరిష్కరించుకోవాలి కానీ ఇలా నలుగురికీ చెప్తే ఏం వస్తుంది??  ఏమీ రాదు...కానీ ఇక్కడ పాపం ఆ అమ్మయికి నిజంగా ఇంట్లో అలా చెప్పుకునే పరిస్థితే ఉంటే, ఇలా వచ్చి అందరి ముందు చెప్పదు కదా. ఒక అమ్మయిని ఎవరైన మీ ఆయన పేరేంటి అంటేనే సిగ్గు పడుతుంది, అలాంటిది ఇలా ఒపెన్ గా తన సమస్య గురుంచి చెప్పింది అంటే, మనం కూడా ఆలోచించాలి కదా? అలా అని నేను ఆడవాళ్ళ పక్షపాతిని అని కాదండోయ్, మన సమాజంలో మంచి భర్తలు ఉన్నారు, మంచి భార్యలు ఉన్నారు, (అలగే చెడ్డవాళ్ళు ఇద్దరిలో ఉన్నారు). చెడ్డవాళ్ళు అనలేం కాని  తప్పులు ఇద్దరూ చేస్తారు.ఆ మటకి వస్తే అందరూ చేస్తారు,కాని సర్దుకుపోవాలి. నిజానికి ఒకరే ఉద్యోగం చేస్తున్నా,ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నా "నేనే సంపాదిస్తున్నాను","నేనూ సంపాదిస్తున్నాను", అనే ప్రస్తావన భార్యాభర్తల మద్య ఎప్పుడూ రాకూడదు.అన్ని విషయాలలో ఇద్దరూ సర్దుకుపోవాలి.సర్దుకుపోతేనే సంసారం సాఫీగా సాగుతుంది.

               కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే....మనం అసలు ఇలాంటి ప్రతికూల స్పందన వస్తుందని ఊహించనేలేదుగా..అక్కడ దెబ్బకొట్టేసిందనమాట...
ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్ధం కాట్లేదు భయ్యా!! అని మహేష్ బాబు అన్నట్టు, అవిడ చెప్పటం సరి మీ రెప్లైలు సరి అని ఆయన బాగా ఘాటుగానే స్పందించారనమాట!!!

  దాంతో.....దేవుడా!!! నా పాటికి నేను ఆ ఏడుపుగొట్టు సీరియల్ చూసుకోకుండా, నాకెందుకు ఈ విప్లవం,సంఘసంస్కరణా???? మనకి ఇవన్నీ అవసరమా అనిపించింది!!!....

ఇక అక్కడ వాతావరణం బాగా వేడెక్కడంతో "అవును సొ అండ్ సొ గారు xyz గారు చెప్పినట్లు మీ వారిని ప్రేమగా అడగండి 'హెల్ప్' చేయమని, సంసారం అన్నాక ఎవరో ఒకరు సర్దుకుపోవాలి లేదంటే సంసారం అనే పదానికే అర్ధం ఉండదు" అని రిప్లై ఇచ్చి మెళ్ళిగా అక్కడ్నించి జారుకున్నాను...

కానీ నా అమాయకపు బుర్రకి ఇంకా డౌటేనండి అది 'సహాయం' ఎలా అవుతుంది భాధ్యత కదా???

20 comments:

 1. Chala chala bavundi Kavyanjali garu. Modati post ayina chala anubhavam vunna varila rasaru.. all the best.. keep posting...

  ReplyDelete
 2. ధన్యవాదములు.

  ReplyDelete
 3. మొదటి ప్రయత్నం చాలా బావుంది...Keep it up... దయచేసి ఆ word verification తీసేయండి. లేకపోతే ఎవరూ వ్యాఖ్యలు పెట్టరు. అనుభవం మీద చెప్తూన్న సలహా ఇది...

  ReplyDelete
  Replies
  1. నమస్కారం phani babu గారు,
   మీరు ఇక్కడికి వచ్చినందుకు,నా టపా చదివినందుకు ధన్యవాదములు.మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.
   మీ సలహా మెరకు ఆ word verification తొలగించాను. తెలియజేసినందుకు ధన్యవాదములు...మీలాంటి అనుభవం గల వారి విలువైన సలహాలు..అభిప్రయాలు నాకు ఎప్పటికి అందుతాయని ఆశిస్తున్నాను.

   Delete
 4. Nice start..Krishna

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదములు Krishna గారు.మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది.

   Delete
 5. సహాయమో, బాధ్యతో మరేదైనానో అనుకోండి. పని అయ్యిందా లేదా అన్నది ముఖ్యం.

  రచ్చ చేయాలండి, లేదంటే మాలాంటి వాళ్ళకు తీర్పు ఇచ్చే అవకాశం ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? కనీసం బ్లాగుల్లో సలహాలిచ్చే అవకాశం ఇవ్వడం బ్లాగర్ల బాధ్యత లేదా చేయగల సహాయం.

  ఈ పోస్ట్ పురుషాధిక్య అజ్ఞాతలు కంట ఇంకా పడలేదే! అని చూస్తున్నా. Dr.ఓరి నాయనోయ్ గారు వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను :)

  ReplyDelete
  Replies
  1. ముందుగా నా టపా చదివినందుకు మీకు దన్యవాదములు.
   అవునండి,మగాళ్ళు నహాయం అనుకున్నా బాధ్యత అనుకున్నా, వాళ్ళూ కాస్త పని చేయటమే మాకు ముఖ్యం .

   Delete
 6. In the current day nuclear family generation, no doubt the lady of the house has to wear multiple hats.

  In my childhood days, my mother got ample help from my grand mother. Who used to do assist my mom in different ways. Say feeding to supper to kids after they come from school, puja, some helping hand in the kitchen, telling bed time stories to kids.. In the meantime my mom used to get some quality time with my father.

  In these days, there are no dependents in the family. Even the elders get bored with out TV. The laid back lifestyle is no where visible.

  Hence the lady of the house if forced to do everything. But the Men's (few I dont say all Men)thought process didnt change along with these changes in the society.

  ReplyDelete
  Replies
  1. Hi padma gaaru,
   Yes,'thought process'మారాలి.అది ఇంకా 'process' లోనే ఉంది. త్వరలోనే మారుతుందని ఆశిద్దాం. Thanks for the post.

   Delete
 7. చాలా బాగా రాసారు కావ్య గారు. మొదటి ప్రయత్నం లోనే ఆకట్టుకునేలా రాసారు, అభినందనలు.

  ReplyDelete
  Replies
  1. మీకు నా టపా నచ్చినందుకు సంతోషం Vajram గారు, మీ అభినందనలకు నా ధన్యవాదములు.

   Delete
 8. Interesting post...All the best Kavya garu.

  ReplyDelete
 9. Nice post...All the best...waiting for much more good posts..

  ReplyDelete
 10. నేను చివరగా మీ conclusionతొ ఏకిభవిస్తాను, కానీ ఎవరితొను చెప్పుకునే చనువు లేనప్పుడు ఇలా అక్షరరూపం ఇవ్వాల్సొస్తుంది. చాలా అలోచింపజేసారు.

  ReplyDelete
 11. దన్యవాదములు చిన్ని గారు :)

  ReplyDelete
 12. Sahaayam kadu 100% Badhyatheeee....

  i am un married but after marriage kuda nadi same reply.

  why because i know inti panulu cheyyadam valla parents yentha happy ga untaaroo vaallu happy ga undadam chusi nenentha happy ga untaano naku maatramee thelusu...

  Family ni wife ni Parents ni Happy ga chusukooleni vadu puttadam anavasaram & marriage inkaa anavasaram..

  ReplyDelete
  Replies
  1. Good praveen gaaru...chala baga chepparu....:)

   Delete

 

View Count
Useful Links