Pages

Thursday, 4 October 2012

యంగ్ ఇండియన్ మోడల్ కావలెను!!!!!


మీరు ఇది చదివి ఎం చేస్తారో కానీ.......నేను అయితే.....తెగ నవ్వేసాను...... అసలు విషయం తెలుసుకుని బాధ పడ్డాను కూడా ....
అసలు ఎం జరిందో చెప్పితగలడు అనుకుంటున్నారా??? నా స్నేహితురాలు ఒక ad agency లో పనిచేస్తుంది తను ఈరోజు నాకు  ఫోన్ చేసి "సిగ్గు తో చచ్చిపోయానే బాబు " అన్నప్పుడు నేను కూడా ఇలాగే అన్నాను ఎం జరిందో చెప్పి తగలదు అని...... "సిగ్గులేదటే అలా నవ్వుతావు నేను బాధ పడుతుంటే.."అంటూ అసలు విషయం చెప్పింది..
                              
"ఈరోజు ఒక client ఫోన్ చేసి కొన్ని "Indian female models " ఫోటోలు కావాలి....మేము ఒక tourism ad చేస్తున్నాము.... మీరు భారతదేపు యువతి ఫోటోలు ఇవ్వండి... background  విదేశపు చిత్రం మేము ఎడిట్ చేసుకుంటాం అన్నాడు....

సరే అని....మా దగ్గర ఉన్న మోడల్స్ ఫోటోలు అన్ని పంపించాను...

ఆయన కాసేపటికి మళ్ళి ఫోన్ చేసి..."చైత్ర గారు మీరు పంపించిన ఫోటోలు బాగానే ఉన్నాయ్....కానీ మా ప్రాజెక్ట్కి నప్పేలా లేవు...నేను ఇండియన్ అమ్మాయి విదేశ యాత్రకు వెళ్లినట్టు ఉండాలి అని చెప్పానుఅన్నాడు....

నేను...అవునండి,నాకు అర్ధం అయ్యింది....మీరు "young Indian female models " చాలు background ఏది ఉన్నా పరవాలేదు అన్నారు కదా...అన్నాను...

ఆయన:అవును కానీ అమ్మాయి ఇండియా నుండి విదేశం వచ్చినట్లు ఉండాలి మా ad అన్నాడు...

నా మట్టిబుర్రకి అయన చెప్పేది ఎం అర్ధం అవ్వక...నాకు అర్ధం అవ్వలేదండి....అన్నాను .

ఆయనఎలా చెప్పాలి....ఇండియన్ అమ్మాయి ఫోటోలు కావాలండి..అన్నారు 

నేను ఓస్ ఇంతేనా..ఆయన సరిగా చూసినట్టు లేరు....నేనైతే నా పని సక్రమంగానే చేసాను బాబు అనుకుంటూ ఒకింత గర్వంగా .... అవి ఇండియన్ అమ్మయిలవేనండీ....అన్నాను 

ఆయన:మీకు అర్ధం అయ్యేలా ఎలా చెప్పాలో నాకు తెలియటం లేదు...అని కాస్త ఇబ్బందిగా అన్నారు...

అప్పుడు నేను  యన ఇబ్బందిని అర్ధం చేసుకుని....పరవాలేదండి...మీరు మా  client ...మీకు నచ్చే ఇమేజ్ మీకు అందాలి...మేము అందించాలి...అది నా వృత్తిధర్మం....మొహమాటపడకుండా చెప్పేయండి..నేను ఏమి అనుకోను అన్నాను 

ఆయన కాస్త నావ్వుతూ...అంటే  ఫోటోలోని అమ్మాయిల బట్టలు మరీ పొట్టిగా ఉన్నాయండి....foreign లో పుట్టి పెరిగిన అమ్మాయి...రోడ్ పైన తిరుగుతున్నట్టు ఉంది..ఇండియా నుండి ఇప్పుడే వచ్చినట్టు లేదు...కాస్త 'decent 'గా డ్రెస్ చేసుకున్న మోడల్ ఫోటోలు ఉంటే  పంపించండి అన్నారు.....

నాకు ఒక్కసారి షాక్ తగిలినట్లయ్యింది..."మా దగ్గర నిండుగా బట్టలు వేసుకున్న young female model  ఫోటోలు లేవండిఇప్పుడు ఇండియా లో కూడా చాలా మంది అమ్మాయిలు ఇలానే ఉన్నారు అని చెప్పాలంటే నేనే పోట్టిబట్టలు వేసుకున్నంత సిగ్గేసిందే  బాబు " అని ముగించిందండి.....

నాకు నవ్వు ఆగలేదు సుమీ!!!...మొదట మోడల్స్ ఇలా ఉన్నారు అని నవ్వుకున్నా....నా స్నేహితురాలు వాళ్ళ క్లైంట్ ఒక foreigner అని చెప్పగానే....ఏదో తెలియని బాధ....వాళ్ళు ఏం  అనుకుంటున్నారో మన సంస్కృతి గురించి అని ....అసలు మన సంస్కృతి ఎటు పోతుంది..అసలు ఆయన ప్రత్యేకించి ఇండియన్ అమ్మాయిని ఎందుకు అడిగారు.....ఆ nativity ...ఆ వస్త్రధారణా ...ఆ సంస్కృతి ....ఉంటాయనే కదా....కావాలంటే నల్ల జుట్టు  ఉన్న  ఏ తెల్లతోలునో పెట్టుకునే వారు....ఆ nativity ...ఆ వస్త్రధారణ...మన సంస్కృతి మన యంగ్ మోడల్స్ లో ఏది??ఎందుకు లేదు??......దీనికి కారణం ఏం అయి ఉంటుంది అనే బాధతో 
 నేను నా స్నేహితురాలిని అడిగాను అసలు నిజంగా మీ దగ్గర ఒక్క ఫోటో కూడా లేదా ఇండియన్ డ్రెస్ లో అమ్మాయి అని....
అప్పుడు తను ఉంటాయ్ ,కానీ గృహిణి ఫొటోలే అలా ఉంటాయ్ అంటే చీర కట్టుకుని,పెద్ద బొట్టు,మంగళసూత్రం,సిందూర్ తో పెద్దగా ఉంటారు....అంతే కానీ యువత ఎవరు ఇండియన్ డ్రెస్ వేసుకుని pose చేయరు...ఒకవేళ మేము అలా చేయించినా....కొనే వాళ్ళు తక్కువే....ఎక్కడో ఈ రోజు లాంటి క్లైంట్ మహానుభావులు తప్ప....అసలు ఇండియన్ clients కూడా ఇష్టపడరు అలాంటి ఫోటోలు...ఇక మోడల్స్ అంటావా...అలాంటి ఫొటోస్ ఇస్తే ఇక అలాంటి అవకాశాలే వస్తాయ్ అని అసలు ఇష్ట పడరు....అంటే detergents .....toilet cleaner ...మసాల...diapers ...ఇలాంటివన్నమాట...ఇక ఇలాంటివి చేసాక వాళ్లకి గ్రుహినిగానే ముద్రపడిపోయి....ఎక్కువ అవకాశాలు రావు...పైగా సినిమా అవకాశాలు అసలే రావు అని వాళ్ళ బాధ.....
 అదే పొట్టి బట్టలు వేసుకున్నారు అనుకో....perfumes ...soaps ...షాంపూ...మొబైల్ ఫోన్స్....మొబైల్ networks ....ఒకటనేమిటి....ఆడ  మగ తేడా లేకుండా ఏ ప్రోడక్ట్ కైనా అమ్మాయి ఉండాల్సిందే .....పైగా ఏ ప్రొడ్యూసర్ కంట్లో నైనా పడితే హీరోయిన్ అయిపోతాం అని వాళ్ళ ఆశ  .....అని నా ఫ్రెండ్ వివరించింది ...

ఆలోచిస్తే అదీ నిజమే అనిపించింది....మొన్న ఏదో ad చూసాను....అబ్బాయిల perfume ...అది వాడితే ఆ అబ్బాయికి .."even angels will fall "అట....ఆకాశం నుండి ఒక అమ్మాయి రెక్కలు కట్టుకుని ధడేల్ మని  కింద పడింది పాపం ,వాడు ఆ perfume కొట్టుకోగానే.....ఏంటో???!!!!!!!.....

15 comments:

 1. మీరన్నది నిజమే మోడల్ అనగానే ఫారిన్ స్టైల్లోనే వుంటాయి మరి. నిండుగా చీర కట్టులో వుంటే మోడలింగ్ అనుకోరు మన అమ్మాయిలు..మీ స్నేహితురాలి ఇబ్బంది అర్థవంతమే..

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగుకి సుస్వాగతం వర్మ గారు :) అవునండి తెలుసుకుని నేను కూడా బాధ పడ్డాను.....మీ comment కి ధన్యవాదములండి :)

   Delete
 2. చీర కట్టుకునే ఇండియన్ మోడల్స్ ని చూడటం దాదాపు అసాధ్యం అనుకుంటాను.
  అబ్బాయిల పనే బెటర్ ఏమో. పొట్టి బట్టలు వేసుకునే అవకాశం లేదు కదా :)

  ReplyDelete
  Replies
  1. చీర కట్టుకున్న మోడల్స్ అందరు 'aunties' అయిపోతరటండి.....అదట వాళ్ళ భయం :( ...ఎందుకు అవకాసం లేదండి.....షర్టు తీసేస్తున్నారుగా!!!!!

   Delete
  2. వాళ్ళ భయానికి కూడా అర్ధం ఉందిలెండి. చుట్టూ ఉన్న సమాజం అలా ఉన్నప్పుడు వాళ్ళేమి చేయగలరు పాపం.

   Delete
  3. అవునండి నిజమే :(....మీ కామెంట్ కి ధన్యవాదములు :)

   Delete
 3. మోడలింగ్ అంటేనే మోడ్రన్....
  చీరకట్టు సంప్రదాయానికి చాన్స్ లేదుగా:-)

  ReplyDelete
  Replies
  1. చీరకట్టుకి ఛాన్స్ లేదేమో కానీ...ఆయన పాపం చీర కూడా అడగలేదండి....కాస్త decentగా ఏదైనా ఇండియన్ డ్రెస్ చాలు అన్నారు.... ఆయన నిండుగా డ్రెస్ వేసుకున్న అమ్మాయి కావాలన్నారు.....అలాంటివి కూడా లేకపోవటమే బాధాకరం...
   మీ కామెంట్ కి ధన్యవాదాలు...

   Delete
 4. అబ్బో! ఇప్పుడు విప్పుకుతిరగడమే కదండీ మోడలింగ్ అంటే

  ReplyDelete
  Replies
  1. అవునండి అలానే ఉంది..మీ కామెంట్ కి ధన్యవాదములు

   Delete
 5. పల్లెటూళ్ళలో లంగా ఓణీ వేసుకున్న ఆడపిల్ల కనిపించటం లేదండి...
  చీరని కూడా ముందుతరాల వాళ్ళు నెమ్మదిగా కనుమరుగు చేసినా ఆశ్చర్యం లేదు కావ్య గారూ!
  పోస్ట్ బాగుంది...@శ్రీ

  ReplyDelete
  Replies
  1. అవును మీరన్నదీ నిజమే శ్రీ గారు!!!.... మీ అభినందనలకు ధన్యవాదములు :)

   Delete
 6. Next post kosam waiting kavya garu :)

  ReplyDelete

 

View Count
Useful Links