Pages

Tuesday 20 November 2012

సహాయం...


నేను నా ఫ్రెండ్ ఒకరోజు బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాం....ఇంతలో ఒకతను నా దగ్గరకి వచ్చి, అక్కా నా పర్స్ పోయింది ఒక 15 రూపాయిలు ఇస్తారా....ఇంటికి వెళ్ళటానికి బస్ ఛార్జ్ కూడా లేవు అన్నాడు....నేను ఒక blank  look ఇచ్చాను.....కావాలంటే మీ మొబైల్ నెంబర్ ఇవ్వండక్క 15 రూ రీచార్జ్ చేయిస్తాను అన్నాడు ......డబ్బులూ ఇచ్చి, ఫోన్ నంబరూ ఇచ్చి.....అంత పుణ్యం నాకెందుకులే అనుకుని.....20 రూ ఇచ్చాను...థాంక్స్ అక్కా అని పరిగెత్తుకెళ్ళి బస్సు ఎక్కేసాడు....

ఇంకోరోజు మళ్లీ బస్ స్టాప్లో వెయిట్ చేస్తుండగా...అక్కా అక్కా  ఆకలేస్తుందక్క అని చేయి చాచాడు.....ఇదేంటి పిల్ల ఏమైనా మదర్ తెరెసాలా కనిపిస్తుందా ఏంటి అందరికి?? అని అనుకుంటున్నారా?? లేదండి, కుర్రాడు అడుక్కునే పిల్లాడు...నాకెందుకో పిల్లలు అడుక్కుంటే భలే చిరాకు....లా అడుక్కోమని పంపించే తల్లిదండ్రులంటే మహా చిరాకు....ఇక పిల్లలని వడిలోనే పెట్టుకు అడుక్కునే మృగాలూ లేకపోలేదు,వాళ్ళంటే  పరమ  చిరాకు...

సో....వాడిని చిరాకుగా చూపు చూసి, "ఎందుకురా అడుక్కుంటావ్ ....సిగ్గులేదు??? ఎవరు చెప్పారు ఆకలేస్తే అడుక్కోమని....మీ అమ్మా ?? "అన్నాను....వాడు చాలా అమాయకంగా అవునక్కా...అని వాళ్ళమ్మని చూపించాడు...కుష్టు అనుకుంటా, చేతులకి గుడ్డలు కట్టుకుని రోడ్ పక్కన కూర్చుని ఉంది...

"ఏయ్ కావ్య...నీకు ఇష్టం అయితే  ఇవ్వు లేదంటే మానెయ్.....మొన్న వాడెవడో పర్స్ పోయిందంటే ఇచ్చావ్గా ....వీడికి రూపాయి ఇవ్వటానికి క్లాసులు పీకుతావే??" అని నా ఫ్రెండ్ తిట్టటం మొదలెట్టింది....ఇంతలో బస్సు వచ్చేసింది...
నేను ఇంకా వాడికి హిత బోధ చేసే నిలోనే ఉన్నా....నా ఫ్రెండ్ అబ్బా,కావ్య ఇక ఆపవే...అని నా చేయి పట్టుకుని లాగి మరీ క్కించేసింది బస్...బస్ ఎక్కిన  రెండు నిముషాలకి నేను పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి ......డ్రైవర్ వైపు చూసి...అంకుల్ బస్సు ఆపండి నేను దిగేస్తా అన్నాను ...అసలు ఏం జరిగిందో  అర్ధం అవ్వక అయోమయంలో పడిపోయి...షాక్ అయ్యి ఆపేశారు...."షాక్ అయ్యి" అని specificగా ఎందుకు అన్నానంటే....జనరల్గా అయితే బ్రతిమాలినా ఆపరు....దీని గురించి ఒక జోక్ లాస్ట్లో చెప్తానులెండి....

అలా బస్ ఆగగానే నేను గబా గబా దిగేసాను...నా ఫ్రెండ్ బస్సు డ్రైవర్ కన్నా కాస్త ఎక్కువే షాక్ అయ్యింది...ఏమొచ్చింది దీనికి అనుకుని...ఒసేయ్ కావ్య ఆగు ఏం  అయ్యింది అంటూ, నా వెనకాలే వచ్చింది...
నేను ఆ పిల్లాడి దగ్గరకి వెళ్లి ,20 రూపాయిలు వాడి చేతిలో పెట్టి...సారీ అని చెప్పేసి....కామ్గా వచ్చి వేరే బస్సు ఎక్కేసా....ఎందుకో కానీ ....తెలీకుండానే ఒకరిని ఎంత తిట్టేసాను..పాపం చిన్న పిల్లాడు...అసలు సరిగా తెలుసుకోకుండా ఏదో ఊహించేసుకుని ఒకరిని ఎలా blame  చేస్తాం అని చాలా బాధతో....రోజు ఒక్క టాపిక్ కూడా వదలకుండా నా ఫ్రెండ్ బుర్ర తినేసే నేను... రోజు చాలా కామ్గా కూర్చున్నా...నా ఫ్రెండ్ నా మూడ్ నార్మల్ చేయటానికి విశ్వ ప్రయత్నం చేసి...ఇక తన వల్లకాదని, విసిగి వేసారి..."ఏంటోనే కావ్య నువ్వు నాకు అర్ధం కావు" అని చేతులెత్తేసింది...

ఇక తన స్టాప్ రాగానే..."మళ్ళీ వెనక్కి పరిగెత్తేవు....మీ ఆయన్ని tension పెట్టకు...తిన్నగా ఇంటికి వెళ్ళు...కాసేపు పడుకో మూడ్ అదే సెట్ అవుతుంది"...అని చెప్పి మరీ వెళ్ళింది...

అలా చాలా డల్గా ఇంటికి వెళ్ళిన నాకు, మా అమ్మ దగ్గర్నించి ఫోన్ వచ్చింది....హా అమ్మా చెప్పు అన్నాను...అదేంటో వెంటనే...."ఏంటే అంత డల్గా ఉన్నావ్అంది...ఎంతైనా అమ్మ కదా...ఒక్క మాటతో కనిపెట్టేసింది...  ఏం లేదమ్మా అని మొదలెట్టి జరిగినదంతా చెప్పాను....almost  ఎడిచేసాననుకోండి....
అప్పుడు మా అమ్మ "అయ్యో!!! పిచ్చి పిల్లా దీనికే బాధ పడతారా?? నీకు ఒకటి చెప్పనా...అసలు నేను నీకు ఎందుకు ఫోన్ చేసానో తెలుసా..అప్పట్లో మన ఇంట్లో వెంకటమ్మ అని ఒకామె పనిచేసేది గుర్తుందా??? అంది.

,ఇప్పుడు ఆమె గురించి ఎందుకు అన్నాను...

"చెప్తున్నా కదా...అంత తొందరేంటో  నీకు...ఇప్పుడు ఆమె హైదరాబాద్లోనే ఉంటుంది...పోయిన నెల వచ్చి 8000 రూపాయిలు ఇచ్చి,' అమ్మా, ఇవి నీ దగ్గర దాచి ఉంచుమళ్లీ వచ్చే నెల కూడా కొంత డబ్బు తెస్తా...అంతా కలిపి నా మనవరాలికి బంగారు గొలుసు కొందాం' అని చెప్పి వెళ్ళింది" చెప్పింది మా అమ్మ..

అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావ్ మా?? అన్నాను విసుగ్గా.

" !!!! గొలుసు షాపింగ్ చేయాలి" అంది మా అమ్మ వెటకారంగా...

పొమ్మా....అసలే నేను బాధగా ఉంటే....ఏం  మాటాడుతున్నావ్ నువ్వు??....అన్నాను నేను..

"అబ్బా!! చెప్పేది పూర్తిగా వినవే, అసలు వెంకటమ్మ హైదరాబాద్లో  ఏం చేస్తుందో తెలుసా?? గుడి దగ్గర అడుక్కుంటోందిట ....చెప్తే నేను షాక్ అయ్యాను తెలుసా " అంది మా  అమ్మ.
నేను 'వాట్????' అని షాక్ లో కాసేపు కాం  అయిపోయా
అప్పుడు మా అమ్మ అనింది..."సో....నువ్వు మరీ అంతలా ఫీల్ అవ్వకు....ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే నువ్వు  పిల్లాడిని తిట్టావ్...నీ తప్పేం ఉంది" అని.

కానీ నేను సెట్ అవ్వటానికి చాలా టైం పట్టింది...ఆ రోజంతా దానిగురించే ఆలోచిస్తూ ఉన్నాను....ఏంటి మాత్రానికే అంతలా అలోచించి మూడ్ పాడుచేసుకోవాలా అనుకుంటున్నారా???? ఏంటో,నేను అంతేనండి !!!!!

ఇలా ఉండగా ఒకరోజు నేనూ,మా వారు  సరదాగా బయటకి వెళ్లి, నాకు ఎంతో ఇష్టమైన పానీపూరి తింటుండగా....ఒక చిన్న పిల్లాడు వచ్చి....exactly, correct గా guess  చేసారు.....ఎదావిధిగా అక్కా ఆకలేస్తుంది అన్నాడు ...నేను రాకెట్ స్పీడ్లో మా వారి పాకెట్ నుంచి 5 రూపాయిలు తీసి ఇచ్చాను. పానీపూరి బండివాడు "అబ్బో!!" అన్నట్టు చూపు చూసాడు, మా వారేమో తింగరి దానితో వేగలేం  మనకెందుకులే బాబు అనుకున్నారేమో కామ్గా ఉన్నారు......
పిల్లాడి మోహంలో కాస్త అయినా సంతోషం లేదు....తిట్టకుండానే ఇచ్చానే  ఏం అయ్యింది వీడికి అని వాడినే గమనించాను...వాడు వాళ్ళ అమ్మ అనుకుంటా, రోడ్ పక్కన ఉన్న ఒకావిడ దగ్గరకి వెళ్ళాడు...ఏం మాట్లాడుకున్నారో కానీ...ఆవిడ వీడి తలమీద ఒక్కటిచ్చి...డబ్బులు లాక్కుని సంచిలో పెట్టుకుంది(అమ్మ అని నేను అనుకున్నాను..కాని కొట్టి లాక్కున్నాక కాదేమో అనిపించింది...బహుశా వాళ్ళ team lead ఏమో మరి)....వాడు మళ్లీ  వచ్చి మా పక్కన ఉన్నవాళ్ళని అడుక్కుంటున్నాడు....నేను చాలా ఆలోచించి...ఒక చాట్ పార్సెల్ చేయించి వాడికి ఇచ్చాను....
మళ్లీ ,as usual, మా పానీ పూరీ  బండివాడు నన్ను ఎగా దిగా చూసి పెదవి విరిచాడు, మా వారేమైనా తక్కువా....వాడికన్నా భయకరంగా అదోల చూస్తున్నారు నా  వైపు....'5రూపాయిలు ఇస్తే పోనిలే దీని వెర్రి అనుకుంటే... చాట్ ఇస్తోంది 'అని...కానీ దానికి సమాధానం నాకు మాత్రమే తెలుసు...డబ్బులు ఇచ్చినప్పుడు లేని సంతోషం, ఫుడ్ ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో కనిపించింది...

అలా మా షాపింగ్ అంతా అయ్యాక ఇంటికి వెళ్తుంటే...5 రూపాయిలు ఇచ్చినప్పుడు జరిగింది గమనించని మా వారు అడిగారు....డబ్బులు ఇచ్చావ్...మళ్లీ చాట్ ఎందుకు ఇచ్చావ్ అని.....జరిగినదంతా చెప్పాను...అంతకు ముందు నాకు జరిగిన అనుభవాలు కూడా చెప్పాను....అప్పుడు తను అన్నారు..."మన సొసైటీలో సహాయం చేయటం సులభమే....సహాయం పొందటం కూడా మరీ కష్టమేమి కాదు....కాని మనం చేసే సహాయం సరైన వాళ్ళకి చేయటమే చాలా కష్టం.... నిజంగా అవసరంలో ఉన్నవాళ్లకే అందుతుందా అని తెలుసుకోవటం చాలా కష్టం " అని.

బాగా ఆలోచిస్తే నిజమే అనిపిస్తోంది...నిజమే....సహాయం చేయాలని చాలా మందికి ఉంటుంది....కానీ అది సరైన వాళ్ళకి చేరుతుందో లేదో అనే అనుమానమూ ఉంటుంది......నాకు షాప్స్లో....పెట్రోల్ పంప్లో డొనేట్ చేయమని పెట్టే డబ్బాలు చూస్తే అనిపిస్తుంది...అవి నిజంగా అవసరమైన వాళ్ళకి చేరుతాయా అని....కాని అది సరైన వాళ్ళకి చేరితే, సహాయం చేసినవాళ్ళకీ, తీసుకున్నవాళ్ళకీ అందరికీ సంతోషమే :)

బాగా analyse చేస్తే  నాకు అనిపించింది.....2005లో 35,000 కోట్లు ఉన్న మన రాష్ట్ర బడ్జెట్....ఇప్పుడు 1,45,854 కోట్లు న్నా  కానీ....అదే పేదరికం,అవే ఆకలి చావులు,అవే కరెంటు కష్టాలు...దీనికి కారణం  గవర్నమెంట్  పెట్టే  కర్చు సరైన వాళ్ళకి చేరటం లేదనే....

ఇక్కడ కూడా అదే సమస్య....సహాయం చేయటానికి సరిపడా డబ్బు గవర్నమెంట్ దగ్గర ఉంది... సహాయం కోసం సామాన్య ప్రజలూ ఎదురు చూస్తున్నారు. కానీ  గవర్నమెంట్ చేసే సహాయం పేదవాడికి అందుతోందా???          
                                                                                                                                                                                                                                                          
                                                                Hands that Help are Holier than Lips that Pray                                 


               



We ourselves feel that what we are doing is just a drop in the ocean. But the ocean would be less because of that missing drop


అయ్యో!!మర్చిపోయాను అనుకున్నారా,లేదండి చెప్తా చెప్తా జోక్ :D
ఒకరోజు నేను,నా  ఫ్రెండ్ బస్సులో కాలేజీ నుండి ఇంటికి వస్తున్నాం ....బస్ స్టాప్ సిగ్నల్కి కాస్త దూరంలో ఉంది ....సోమేము సిగ్నల్ దగ్గర బస్సు ఆగితే దిగేద్దాం అని ముందుకి వచ్చాం.... రెడ్ సిగ్నల్ పడలేదు......నా ఫ్రెండ్ అంకుల్ 1 సెకండ్ స్లో చేయండి మేము దిగేస్తాం అని రిక్వెస్ట్ చేసింది...ఆయన చిరాగ్గా చూపు చూసారుఆపలేదు... ఇంతలో ట్రాఫిక్ జాం అయ్యి బస్సు స్లో అయ్యింది...మేము దిబోయాం....  డ్రైవర్ గారు....మా వైపు చిరాగ్గా చూస్తూ "సీదా  పర జానా హై "? అన్నారు....హిందీ అంతంత మాత్రం వచ్చిన నా ఫ్రెండ్, అవును అన్నట్టుగా తల ఊపి దిగేసింది...వెనకే నేనూ దిగాను....తర్వాత ఆయన అన్నదానికి అర్ధం ఏంటో నేను నా  ఫ్రెండ్కి చెప్పి...ఇద్దరం ఇల్లు చేరుకునేదాక నవ్వుకున్నాం.....
ఇంతకీ ఆయన అన్నదానికి అర్ధం ఏమిటో తెలుసా???(హిందీ రానివాళ్ళ కోసం) పైకి పోవాలని ఉందా అని....నా  స్నేహితురాలేమో....మీరు ఇటే వెళ్ళాలా అని అడిగారేమో అనుకుంది...అదన్నమాట సంగతి :)


                                                                                                      .............మీ కావ్యాంజలి ♥♥♥

28 comments:

  1. నిజంగా ఇప్పుడు సహాయాన్ని అర్థించేవాళ్లకు సహాయం చేయాలన్న అలోచించాల్సి వస్తోంది. ఈ విషయంలో ఎప్పుడూ మదిలొ అంతర్మథనం. వీళ్లకు పని దొరకడం లేదా? లేకా, ఒంట్లో ఓపిక ఉన్నా కూడా పని చేయట్లేదా అని? ఒకరోజు నేను ఒక ఆమె అడుక్కుంటుంటే 2 రూపాయలు ఇచ్చాను, వెంటనే ఆమె ఈ రెండు రూపాయలకి ఏం వస్తుంది అని అసంతృప్తి వెలబుచ్చింది. ఇలాంటప్పుడు సహాయం చేసి కూడా మనకు అసంతృప్తి కలుగుతుంది. ఇంక పడుకున్న పిల్లల్ని చూస్తుంటే వీళ్ల కోసం ఏం చేయలేనా? అని అనిపిస్తుంది.. Really I am helpless and how can i help children who dont have shelter and whom dont know who is their parents and why they born..ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు :( :(

    ReplyDelete
    Replies
    1. Mee bada artam ayyindi chinni garu. Em cheyalema ani adigaru? nijamga cheyali anukunte chalane cheyyavachu. Yes, roadside children chala mandi vunnaru. For ex, idi chali kalam. so meeru, meeku telsina friends kalisi blankets distribute cheyochu. childrens ke kadu, old people ki kooda try cheyyochu. at least oka self satisfaction vastundi, em antaru?

      Delete
    2. హాయ్ Chinni గారు,మీ మాటల్లో మీ ఆవేదన అర్ధం అవుతోంది....పైన Anonymous గారు చెప్పినట్టు...మీకు తోచిన సహాయం చేయండి...."If u can't feed a hundred,then feed just one" అన్నారు Mother Teresa.... కష్టాల్లో ఉన్నవాళ్ళకి ఒకరికైనా సహాయపడటంలో మీ వంతు ప్రయత్నం మీరు చేయండి....అంతకన్నా మనం చేయగలిగింది ఏం ఉంది చెప్పండి :)

      Delete
    3. Chinni garu, I can understand your dilemma. As Anonymous said above, you can distribute blankets and anything that is useful for the kids. But, if you feel that the kids don't really know their parents and are willing to join any orphanage, please take them to an orphanage and join them in that orphanage. Giving money does not solve their problems.

      As a great man said "give a man a fish and you feed him for a day. Teach a man to fish and you feed him for a lifetime", we can try to join the kids in any NGO that can teach them skills that are useful to live them life without depending on anyone.

      Delete
  2. Mee visleshana bavundi kavya garu. Samasyani chala baga vislesinchi, daniki tagga parishkaram kooda cheparu.

    ReplyDelete
    Replies
    1. హాయ్ Anonymous గారు,మీకు నచ్చినందుకు Thanks :)...పాపం కష్టాల్లో ఉన్న పిల్లాడిని తిట్టాను అని రెండు రోజులు బాధ పడ్డాను...ఆ బాధలోనుంచి వచ్చిన విశ్లేషణ(ఆలోచన)ఇది....

      Delete
  3. Mee post chala bagundi kavya garu,naku okati cheppalanipistundi.naku oka frnd vundedi,haritha ani.tanu yeppudu musali variki tappa inka evariki money echedi kadu.nannu evvanichedi kadu.yeppudu anukunta,nenu eche prati rupee lo half rupee tanu echinatte ani.nijam ga pillalaki evvadam kante old people ki evvadam better,aina begging kuda oka mafia ga tayaru aindi.daniki meeru cheppina vishayam tho telisipotundi

    ReplyDelete
    Replies
    1. హాయ్ చైతన్య గారు,మీకు నచ్చినందుకు ధన్యవాదములు...అవునండి మీ ఫ్రెండ్ హరిత గారు చెప్పినట్టు ఒంట్లో శక్తి లేక,చూసుకునే వాళ్ళు లేక, రోడ్డున పడ్డ ముసలి వాళ్ళకి సహాయం చేయటంలో పెద్ద తప్పేమీ లేదు....కానీ చక్కగా పని చేసుకునే శక్తి ఉన్నా అడుక్కుంటున్న మా వెంకటమ్మ లాంటి వాళ్ళకి కాదు :)..ఇక పిల్లలకి డబ్బులు ఇవ్వటం ....మన future generation ని మనమే అడుక్కోమని encourage చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు...

      Delete
  4. "మన సొసైటీలో సహాయం చేయటం సులభమే....సహాయం పొందటం కూడా మరీ కష్టమేమి కాదు....కాని మనం చేసే సహాయం సరైన వాళ్ళకి చేయటమే చాలా కష్టం.... నిజంగా అవసరంలో ఉన్నవాళ్లకే అందుతుందా అని తెలుసుకోవటం చాలా కష్టం" - this is very true. I have experienced it myself many times.

    From my experiences, road-side and signals daggira beg chese pillalki we should never give any money. As Anjali garu said, donating food or other items instead of money is far better.

    And Anjali gari mother cheppinattu, chalamandi(even old people) beg here in Hyderabad and send the amount to their kids/relatives in their home-town/village.

    I will strongly say that we should never donate the money to beggars. But it is very difficult to differentiate between the real people who are need because of a lot of fake beggars(people who make use of kids).

    ReplyDelete
    Replies
    1. హాయ్ srinivasarao గారు,Thank You for the response :)

      Even i experienced it many times :( అవునండి....giving money to kids or beggars is like encourage "easy money" concept...వాళ్ళని ఇంకా సోమరి గా చేస్తున్నాం.....as u said....its really hard to know if someone is truly the needy becoz' of fake beggars...చాలా సార్లు fake people ki హెల్ప్ చేసి తిట్లు కూడా తిన్నా నేను .....హెల్ప్ చేసి కూడా fools అవుతాం.sad but true....

      Delete
  5. "మన సొసైటీలో సహాయం చేయటం సులభమే....సహాయం పొందటం కూడా మరీ కష్టమేమి కాదు....కాని మనం చేసే సహాయం సరైన వాళ్ళకి చేయటమే చాలా కష్టం" this is 100% correct.

    ReplyDelete
    Replies
    1. హాయ్ పద్మర్పిత గారు,మీకు నచ్చినందుకు థాంక్స్ :)
      అవునండి, that's really true....చాలా incidents చూసాక అర్ధం అయ్యింది నాకు..

      Delete
  6. devudi hundi lo money veyadaniki evvaru alochincharu 100's and crores vesestharu sthomatha batti return lo punyam ravalani so adhi mana svardham adhe beggers ki ivvataniki chalamandhiki manasu oppaddhu...

    ReplyDelete
    Replies
    1. మీకు నచ్చినందుకు ధన్యవాదములు Anonymous గారు :), నిజమే, గుడిలో ఆలోచించకుండా వేస్తారు....కానీ ఊరికే beggars కి ఇవ్వటానికి మనసు ఒప్పదు...అలాగే restaurant/hotelకి వెళ్లి....తిన్నాక tips బానే ఇస్తాం....అదే tip amount ఆ restaurant బయట beggarకి ఇవ్వాలి అంటే ఇవ్వం....ఇదంతా general human psychology...ఏంటో :(

      Delete
  7. Hello kavya garu elaa unnaru,

    nenu copy paste chesina kinda lines ki hats off andi... chala easy ga artham ayye ee lines rayadam antha easy kaadani naku thelusu. chalaaa kastam kudaaa....

    {"మన సొసైటీలో సహాయం చేయటం సులభమే....సహాయం పొందటం కూడా మరీ కష్టమేమి కాదు....కాని మనం చేసే సహాయం సరైన వాళ్ళకి చేయటమే చాలా కష్టం.... నిజంగా అవసరంలో ఉన్నవాళ్లకే అందుతుందా అని తెలుసుకోవటం చాలా కష్టం "

    "సహాయం చేయాలని చాలా మందికి ఉంటుంది....కానీ అది సరైన వాళ్ళకి చేరుతుందో లేదో అనే అనుమానమూ ఉంటుంది.....నాకు షాప్స్లో....పెట్రోల్ పంప్లో డొనేట్ చేయమని పెట్టే డబ్బాలు చూస్తే అనిపిస్తుంది...అవి నిజంగా అవసరమైన వాళ్ళకి చేరుతాయా అని....కాని అది సరైన వాళ్ళకి చేరితే, సహాయం చేసినవాళ్ళకీ, తీసుకున్నవాళ్ళకీ అందరికీ సంతోషమే :)"}

    First nundi gamanisthunnanu me way of presentation suuuper andi...

    ReplyDelete
    Replies
    1. హాయ్ Praveen గారు,నేను బాగున్నాను,మీరెలా ఉన్నారు??
      మీకు నచ్చినందుకు ధన్యవాదములు :).... నిజమేనండి, నాకు జరిగిన experiences తర్వాత నేను ఫీల్ అయినవే ఆ lines......

      Delete
    2. adenandi aaa line raayaalante chala experience and talent kaavaali antunnanu, meeru yenthoo feel ayithe thappa alaaaa rayaleru antunnanu.

      any how keep it up and "all the best". waiting for the next topic....

      Delete
  8. Nice one Kavya :) !! Chala chakkaga chepparu. What ever you told is true , off course you are a REALITY WRITER as experienced it from your previous blogs.

    REALITY WRITER award meeke andi.... :) :)

    ReplyDelete
    Replies
    1. హాయ్ Teju గారు, మీకు నచ్చినందుకు Thanks :) మీరు మరీ నన్ను పొగిడేస్తున్నారు కానీ, ఏదో నా అనుభవాలు అందరితో పంచుకుంటున్నానంతే !!!!! once again , మీ అభినందనలకి ధన్యవాదములు :)

      Delete
  9. HAI KAVYA GARU HOW R U
    AM SYLISH NENU KONCHAM FRANK GA MATLADATHANU PARLEDA

    ADYNA OKA VISHAYAM GURINCHI GANTATARABADI MATLADATAM CHALA EASY KANI DANNI ACHARANA LO PETTALANTAY CHALA KASTAM

    ANY HOW ME CONCEPT BAGUNDI ROUTINE GA PUSHPANJALI

    ReplyDelete
    Replies
    1. Hai Stylish garu, meeru frank ga nijalu matladite naku elanti problem ledandi.. kani ikkada meru frank ga em matladutunaro naku artham avvaledu... post lo nenu em oorike speechlu ivvalendhandi....naaku jarigina experiences.....and nenu aacharinchinave cheppaa....anyhow meku concept nachinanduku thanks..

      Delete
    2. Perfect reply Kavya garu..

      Hi Sylish garu meeru adagali anukunnadi adagaledemoo ani na abhiprayam kudaaa...

      Delete
  10. peda vaadiki saayam andite e paatiki maname pedavaallam ai undevaaramemo....mana govt sangati rajakiya naayakula sangati telisi miru ala anukunte ela cheppandi....tapa baavundi

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకి స్వాగతం మంజు గారు :)....
      అయ్యో అలా అనేసారేంటండి......అలా అందరికి అందితే, అందరు గొప్పవాళ్ళే (మనసున్న) అనిపించుకునే వారు :) నిజమే నాయకుల్లోనే మార్పు రావాలి...రావాలని ఆశిద్దాం :)

      Thank you :)

      Delete
  11. గత వేల సంవత్సరాలుగా ఈ చర్చ జరుగుతూనే ఉంది...బైబిల్ లో జీసస్ ఒక మాట అంటాడు. "మీ దగ్గర రెండు దుస్తులు ఉంటే ఒకటి లేనివాడికి ఇవ్వండి...మీ దగ్గర రెండు రొట్టెలు లేనివారికి ఒకటి ఇవ్వండి" అని ... జీసస్ మాటలు నమ్మి నేడు అనేక మంది క్రైస్తవులు పేదలకు ధాన, ధర్మాలు చేస్తున్నారు (thankx giving festival) కాని ఇక్కడే ఒక ప్రశ్న వేయాల్సి ఉండి, "అసలు ప్రపంచంలో కొందరు ధనవంతులుగా ఎందుకు ఉన్నారు మిగితావాళ్ళు పేదలుగా ఎందుకు ఉన్నారు....కొందరు ధానం చేసే స్థితిలో ఎందుకు ఉన్నారు, కొందరు అడుక్కునే స్థితిలో ఎందుకు ఉన్నారు" అని......ఆడుక్కుతినడం వృతిగా, మాఫియాగా మారిపోయిండవచ్చు...కాని అనేకమంది, నిలువనీడలేక, ఉపాడి లేక, ఇతరులతో మోసగించ బడి పనిచెయడానికి శక్తి లేకా (వృద్దులు) అనివార్యంగా అడుక్కుతినడం వౄత్తిగా ఎంచుకుంటున్నారు....ఇలాంటి వారికి సహయం చేస్తే మనసు కాస్తా మనశామి దొరకవచ్చు... కాని వారికి శాశ్వతంగా ఆ వృత్తినుండి మార్పించలేము.

    ReplyDelete
    Replies
    1. హాయ్ డేవిడ్ గారు, వృ ద్దులకు(ఒంట్లో శక్తి లేని వాళ్ళు),వికలాంగులకు సహాయపడటం లో తప్పేం లేదండి......కానీ చిన్న పిల్లలకి ఇవ్వద్దు అని నా ఉద్దేశం...ఒకవేళ ఆ పిల్లలకి వేరే దిక్కు లేదు అనుకుంటే పైన శ్రీనివాస రావు గారు చెప్పినట్టు orphanage చేర్పించాలి.....కామెంట్ కి ధన్యవాదములు :)

      Delete
  12. well said padmarpita gaaru........

    ReplyDelete

 

View Count




Useful Links