Pages

Friday 14 September 2012

బాబోయ్....హోం వర్క్


నాకు హోం వర్క్ అంటే చచ్చేంత భయం...ఇలా చెప్పటం మీకు నవ్వు రావచ్చేమో కానీ చెప్పక తప్పదండి ఎందుకంటే...ఇది నిజ్జంగా  నిజమండి బాబు..నమ్మరూ? చదవండి మీరే ఒప్పుకుంటారు నేను భయపడటంలో తప్పేం లేదని..

రోజు సాయంత్రం 7 గంటలకి నా పుత్రరత్నానికి హోం వర్క్ చేయించాలి...దానికి ఓ పది పదిహేను నిమషాల ముందు నుండి సార్ గారిని బ్రతిమిలాడాలి...అదంతా ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మళ్ళీ అదో పెద్ద ఎపిసోడే అవుతుంది కానీ మనం విషయం లోకి వెళ్ళిపోదాం..ఆ హోం వర్క్ చూడగానే వాడికి బాధ భయం లాంటివి ఏమైనా కలుగుతాయో లేదో నాకైతే తెలీదు కానీ నాకు మాత్రం భయం లాంటి ఫీలింగ్ ఏదో కలుగుతుంది....దేవుడా ఈ రోజు 4 పేజీలా....ఏమిటీ శిక్ష ఎందుకు నాకీ పరీక్ష అనుకుని...ముక్కోటి దేవతలని ఒకసారి మనసులో తలచుకుని స్టడీ టేబుల్ దగ్గరకి వెళ్తాం...ఆ చైర్ లో అయ్యవారిని కుదురుగా కూర్చోబెట్టటానికి మళ్ళీ ఓ 10 నిమిషాలు ....అలా మాస్టారుగారు సర్దుకుని కూర్చునీ మొదలు పెడతారు...ఆ రోజు టీచర్ A - J  వ్రాసుకుని రామ్మన్నారే అనుకోండి...అంటే పేజిలో 8 లైనులు ఉన్నాయనుకోండి...ఒక్కో లైన్లో A - J  వ్రాయాలనమాట...ఇదేవిటీ చిన్నపిల్లలకి చెప్పినట్టు ఏవిటా చెప్పటం అని కసురుకోకండి..మా బుడతడికి చెప్పి చెప్పి అలా అలవాటైపోయిందనమాట..

 ఇక మా వాడు ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టు, వాడి చేతులోని పెన్సిల్ ఖడ్గం అయినట్టు ఒక 'expression ' ఇచ్చి మొదలు పెడతాడు..' A ' వ్రాయగానే ఓసారి నా వైపు అలా చూస్తాడు...అర్రేరే మీకు అసలు విషయం తెలీదు కదా.. అంటే అయ్యగారు వ్రాసే ప్రతి అక్షరం తర్వాత నేను చప్పట్లు కొట్టాలన్నమాట.....పొరపాటున మర్చిపోయనో ఇక అంతేసంగతులు.....అలగటం,దిగి వెళ్ళిపోవటం మళ్ళి బ్రతిమాలడానికి ఓ 10 నిమిషాలు వేస్ట్....ఇలా ప్రతిదానికి చప్పట్లు కొట్టి కొట్టి కొట్టీ నా చేతులు పడిపొయాయ్ అంటా అనుకున్నారు కదూ??? కాదు no నహీ!!!! నాకు అలా అన్నింటికి చప్పట్లు కొట్టటం అలవాటయిపోయింది. ఒక్కోసారి తెలియని వాళ్ళైతే దీనికి వేపకాయంత వెర్రి ఉన్నట్టుంది అనుకుంటారు కూడానూ...

 
అలా చాల కష్టపడి వాడికి హోం వర్క్ చేయించి.....హమ్మయ్య ఈ రోజుకి గండం గడిచింది అనుకుని....ఇక పడుకోబెడదాం అనుకుంటుండగా...అమ్మా కథ చెప్పు అంటూ ముద్దు ముద్దు గా అడిగాడు...అసలే వీడు పడుకునేదాకా మాట్లాడకుండా ఎలా ఉండాలి రా దేవుడా అనుకునే నేను...వాడు అడగటమే ఆలస్యం అన్నట్టు కథ చెప్పటం మొదలు పెట్టేసా....
 ఏదో కొత్త 'creative ' కథ చెప్తానేమో అని expect చేసేరు  సుమీ!!....అబ్బే మనకి (అంటే నాకే) అంత talentu  knowledgu ఎక్కడిదీ...మన పురాణాలలోని ఒక స్టొరీనే చెప్పటం మొదలెట్టాను...
"అయితే ఎం జరిగిందంటే ఒక రోజు పార్వతి దేవి పసుపు రాసుకుంటూ, అ పసుపుతో ఒక బొమ్మని చేసింది,ఆ బొమ్మకి ప్రాణం పోసింది,అంటే ఇక ఆ బొమ్మ అన్నీ మనలానే చేస్తుంది...నీలాగే మాట్లాడుతుంది, నడుస్తుంది, అల్లరిచేస్తుంది.

ఆ బాబు పార్వతి దేవిని 'అమ్మా' అని పిలిచాడు, పార్వతి దేవి ఆ బాబు కి గణేశ  అని పేరు పెట్టింది..ఆ బాబు వాళ్ళ అమ్మ చెప్పినట్టు వింటాడు "

నువ్వు కూడా నేను చెప్పినట్టు వింటావా మరి????ఈ మాట అనగానే మా వాడు ఏంటి తల్లి కథ చెప్పమంటే మళ్లీ నీతులు మొదలుపెట్టావ్ అన్నట్టు ఒక చూపు చూసి సిగ్గు+వెటకారం తో కూడిన ఒక smile ఇచ్చాడు. నేను ఓ చిరునవ్వునవ్వి మళ్ళీ మొదలు పెట్టాను..


"అయితే ఒక రోజు పార్వతి దేవి స్నానం చేయటానికి వెళ్తూ ...గణేశ కి చెప్పింది 'నేను స్నానానికి వెళ్తున్నాను...ఎవరు వచ్చినా లోపలికి రానివ్వకు, ఈ ద్వారం దగ్గరే కూర్చో' అని

'అలాగే అమ్మా' అన్నాడు గణేశ .
'ఆటల్లో పడి మర్చిపోవుకదా 'అడిగింది పార్వతి.
'లేదమ్మా అస్సలు మర్చిపోను..ఎవరినీ లోపలికి రానివ్వను,ఇక్కడే కూర్చుంటా' అన్నాడు గణేశ.
పార్వతీదేవి లోపలికి వెళ్ళిపోయింది "

ఇంతలోనే మా సిసింద్రి కి ఒక డౌట్ వచ్చింది...అమ్మా గణేశ వాళ్ళ బాత్రూం కి డోర్ లేదా??

నేనూ ఆ ఫ్లో లోనే చెప్పేసా డోర్ ఉంది నాన్నా కాని బోల్ట్ ఊడిపోయింది అని..

మళ్లీ మొదలు పెట్టాను...


"ఇంతలో శివుడు అక్కడికి వచ్చాడు....లోపలికి వెళ్ళబోగా గణేశ శివుడిని ఆపాడు....'లోపల మా అమ్మ స్నానం చేస్తుంది వెళ్ళటానికి వీళ్ళేదు' అన్నాడు.

శివుడు 'నేను వెళ్ళొచ్చు నాయనా తప్పులేదు' అని నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు...కానీ గణేశ వినలేదు,శివుడికి అడ్డు నిలిచాడు శివుడికి చాలా కోపం వచ్చింది.
త్రిశూలం తీసి గణేశ మీదకి విసిరాడు అంతే...."

ఆహా ఇప్పుడు చూడాలండి మా వాడి మొహం.....ఒక విధమైన భయం....తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే తపన తాపత్రయం పిల్లల్లో మరీ ఎక్కువ ఉంటుంది సుమీ!! చెప్పూ ఆపేసావే..చెప్పు తర్వతా ?? చెప్పు అంటూ ముద్దుగా అడుగుతున్నాడు..

నేను మళ్లీ మొదలు పెట్టాను..

"శివుడు త్రిశూలం విసరగానే  గణేశ తల తెగి కింద పడిపోయింది...'అమ్మా' అని అరిచాడు.లోపల ఉన్న పార్వతిదేవి పరిగెత్తుకుంటూ వచ్చింది....'అయ్యో వీడు నా బాబే దేవా,ఎందుకు ఇలా చేసారు, నా బాబు నాకు కావలి' అని ఏడ్చింది.

అప్పుడు శివుడు ఒక ఏనుగు తల తెప్పించి గణేశ కి పెట్టాడు.అలా గణేశ కి ఏనుగు తల వచ్చిందన్నమాట!! "అని ముగించాను..

మా చిచ్చరపిడుగు పడుకోలేదు సరికదా ...అమ్మా అంటూ మొదలెట్టాడు నా మెదడుకి పదును పెట్టే వాడి 'doubts session' ...."అమ్మా!! గణేశ తల తెగిపోతే అదే తల మళ్ళీ పెట్టొచ్చుకదా???పార్వతీదేవికి ప్రాణం పోయటం వచ్చుకదా??(నడిచేలాగా మాట్లాడేలాగా మళ్లీ చేయోచ్చుకదా)??లేకపోతే గణేశ లాంటిదే వేరే బొమ్మ చేసుకోవచ్చుకదా??"


ఇన్ని ప్రశ్నలు ఒకే సారి విని నా 'mind block' అయ్యింది.నాకు ఇక ఏం చెప్పాలో తెలియక ఇక పడుకోనాన్న ప్లీజ్ అని పడుకోబెట్టేసా.


కానీ నిజంగా ఆ ప్రశ్నకి ఏం చెప్పాలో నాకు అర్ధం అవ్వలేదు...నాకు ఎప్పుడు ఈ doubt కూడా రాలేదు...నాకైతే సమాధానం తెలీదు...మీకు తెలిస్తే చెప్పరూ??


22 comments:

  1. Me homework tippalu bavunayi Kavya garu.. same to same, chala mandi ivee tippalu padutunaru. Meru cheppina katha kooda bavundi :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములండి. అవునండి ఇవి అందరి ఇంట్లో ఉండే తిప్పలే....మీకు నచ్చినందుకు సంతోషం :)

      Delete
  2. :)) మీరు బాగా రాస్తున్నారండీ.

    ReplyDelete
    Replies
    1. దన్యవాదములు శిశిర గారు :)

      Delete
  3. అవునండి, ఆ doubts నాకూ రాలేదండి. ఏంటో, అప్పట్లో పెద్దలు చెప్పేది వినడమే కాని, ప్రశ్నించేంత ధైర్యం ఉండేదా.

    ReplyDelete
    Replies
    1. అవును Kishore గారు, మనం ఇప్పటి పిల్లల్లా ఆలోచించేవాళ్ళం కాదో, మరి అంత sharp కాదో కాని మనకి ఇలాంటి doubts వచ్చేవి కాదు,ఒకవేళ వచ్చినా అడిగేంత ధైర్యం ఉండేదీకాదు

      Delete
  4. బాగుందండి మీ అబ్బాయి homework ముచట్లు.మావాడు ఇప్పుడే preschool కి వెల్తునాడు ఆయనగారు లేచిన దగరనుంచి స్కూల్ కి వెళ్ళేదాకా బ్రతిమాలి చేయించాలి లేకపోతే రాగం అందుకుంటాడు.ఇంకా మన పని finish. మీ బ్లాగ్ చదువుతుంటే నాకు రాబోయే examki మోడల్ పేపర్ ల వుంది .థాంక్స్ అండి. nice post

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు స్వాతి గారు,మా వాడు LKG అండి..మీకూ భవిష్యత్తులో ఇలాంటివి చాలానే ఎదురవుతాయి లెండి...అవునండి ఈ బ్రతిమాలటం అనే కాన్సెప్టే కష్టం గా ఉంటుంది :) అవసరమయినప్పుడు నా మోడల్ పేపర్స్ రెఫెర్ చేస్కొండి మరీ :)

      Delete
  5. హహహ..చిన్న పిల్లలలో ఎదన్నా చెప్తే దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి బాగా ఉంటుందండి. అలాగే ఒక్కోసారి వాళ్లు అడిగే ప్రశ్నలు కూడా భలే నవ్వు తెప్పిస్తాయి.

    ReplyDelete
    Replies
    1. అవును Srinivasarao గారు, మా వాడికి ఆ ఆసక్తి కాస్త ఎక్కువే ఉంది. ప్రొద్దున్న లేచిన దగ్గరనుంచి ఒకటే ప్రశ్నల వర్షం అనుకోండి. ఒక్కోసారి తికమక పడ్డా...తర్వాత గుర్తుచేసుకుంటే నవ్వువస్తుంది :)

      Delete
  6. మీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

    లాస్య రామకృష్ణ
    బ్లాగ్ లోకం

    ReplyDelete
  7. దన్యవాదములు లాస్య గారు...:)

    ReplyDelete
  8. chala bagundhi andi mee blog.......... chala baga rastunnaru meeru.....

    ReplyDelete
  9. bagundhi andi me tapa.....regular ga rasthundandi maku off lo pani lenapudu me tapa le maku timepass

    ReplyDelete
  10. మనం కథలను బుద్ధిగా వినేవాళ్ళం. ఇప్పటి పిల్లల సందేహాలు చూస్తుంటే మనం ఎంత అమాయకంగా వుండేవాళ్ళమో అర్ధం అవుతోంది. బాగా రాస్తున్నారు కావ్య గారు.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు జ్యోతిర్మయి గారు..:) అవునండి నిజమే...ఈ కాలం పిల్లలు చిచ్చరపిడుగులు...మా వాడైతే పెద్ద 'question bank ' :)

      Delete
  11. Ha ha ha ha suuuuuper naku future elaa untundoooo oka chinna episode lagaa chupinchaaruuu...

    ippudu pillalu chala active....
    yentha active ante active ane word kee chukkalu chupisthunnaruuu...

    my Nephew is good example for that.

    ReplyDelete
    Replies
    1. Thank u,meeku naa episode nacchinandhuku :-)....avunu praveen gaaru erojullo pillalu chaala 'hyper active'....:)

      Delete
  12. Manchi questions,evaru answer cheppagalaru.kani meeru,mee abbay chala manchi combination

    ReplyDelete
    Replies
    1. అవును chaitanya sagar గారు, మంచి questions,answers మాత్రం చాలా కష్టం :)...అవునండి వాడు లేకపోతే నాకేం తోచదు....మీ కామెంట్ కి ధన్యవాదములు :)

      Delete

 

View Count




Useful Links