Pages

Wednesday 26 September 2012

నేనూ....మా నాన్న!!!!!


మా ఊర్లో మంచి స్కూల్ లేకపోవటం...ఉన్నది కూడా 5 తరగతి వరకు మాత్రమే ఉండటం వల్ల నన్ను,మా తమ్ముడిని పక్క ఊర్లో చదివించారు. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. నేను ఉండను అని మారాం చేస్తే "మా నాన్నకి అంత స్తోమత లేకనో...మరే కారణం చేతనో మమ్మల్ని చదివించలేదు...చాదువులేకనే నేను ఇలా కష్టపడుతున్నాను...మేరూ నాలా  కష్టపడటం నాకు ఇష్టం లేదు రా కన్నా!!!  మేము మాత్రం మిమ్మల్ని వదిలి ఉండగలమా చెప్పు...కానీ తప్పదు..మన ఊర్లో మంచి స్కూల్ లేదుకదా...బుద్ధిగా  చదువుకోరా బంగారుతల్లి!!! వారానికి ఓసారి వచ్చివెల్తాగా" అని నాన్న ఎంతో నచ్చజెప్పారు.  
                                                 మొదట్లో అయితే నన్ను స్కూల్ కి అలవాటు చేయటానికి ఒక chocolate ప్యాకెట్ కొని టీచర్ కి ఇచ్చారు....టీచర్ రోజు ఒక chocolate ఇచ్చేవారు... chocolate కోసం నేనూ ప్రతిరోజు స్కూల్ కి వెళ్ళేదాన్ని.. అమ్మ అప్పుడప్పుడు వచ్చి ఒక రోజు మాతో ఉండి వెళ్ళేది కానీ నాన్న మాత్రం అప్పుడప్పుడు వచ్చి ఏదైనా కావాలంటే కొనిచ్చి వెళ్ళేవారు. " !! నాన్న  అయితే ఎంత అడిగినా ఒక్కరోజు కూడా ఉండరు" అనుకునే దాన్ని. అప్పుడు తెలియలేదు మా కోసమే అంత కష్టపడుతున్నారని..
  
                     ఇక వేసవి సెలవులు రాగానే ఎంతో సంతోషంగా ఊరికి వెళ్ళేవాళ్ళం.. మా అత్త కూతురుఅబ్బాయి కూడా వచ్చేవాళ్ళు....రాత్రుళ్ళు, మేడపైన ,ఆరు బయట...మా నాన్నమ్మ కథలు చెప్తుంటే .... చుక్కల్ని లెక్కపెడుతూ పడుకునేవాళ్ళం ...ఈరోజుల్లో పిల్లలకి ac లు ఫ్యాన్ లు  తప్ప బయటకూడా పడుకోవచ్చు అనే విషయం కూడా తెలియదేమో కదండి!!.  కోడి కూయగానే....నాన్నమ్మ లేవండి రా పిల్లలూ....కోడికూడా కూసింది అనగానే...దుప్పటి కప్పేసుకునేదాన్ని......ఇక సూర్య భగవానుడు తన లేత కిరణాలతో నా మొహం ఫై చక్కిలిగింతలు చేస్తుంటే చూడాలి నా అవస్థలు...ఇక ఇంకో తమాషా ఏంటంటే...ఆకరున ఎవరు లేస్తే వాళ్ళే దుప్పట్లన్ని లోపల పెట్టాలన్న మాట... అందుకని నేను తెలివిగా...ఇంకా ఒకరు పడుకుని ఉండగా లేచేదాన్ని....ఇక లేవగానే ఈత నేర్చుకోవటానికి  పొలం దగ్గరకి  వెళ్ళేవాళ్ళం...నేను బావి లో ఉన్నంత సేపు మా నాన్న నా చేయి పట్టుకునే ఉండాలి....పోరాపటు నా వదిలేసారో....ఏడ్చేసేదాన్ని....        "నీకు నేనంటే  ఇష్టం లేదా..నేను చచ్చిపోయిన పర్లేదా" అని...నాన్న నవ్వుతూ "అలా నేను పట్టుకునే ఉంటే నీకు ధైర్యం ఎలా వస్తుంది రాతల్లి!! " అనేవారు.  ఒకరోజు నేనూ ఈత కొడ్తుంటే బావిలో నా పక్కనే ఒక పాము వుంది....నాకు తెలియదు...నాన్న రాయి విసిరారు...పాము అని అరిస్తే భయంతో ఎక్కడ మునిగిపోతానో అని..నాన్న నా పక్కనే  దూకి  నన్ను బయటకి లాగారు...నేనేమో అది తెలియక...."నువ్వు నన్ను రాయి తో కొట్టావ్..గట్టిగా నా పక్కనే దూకావ్ నాకు ఎంత భయం వేసిందో తెలుసా!!"....అని ఒకటే గోల... బయటకి వచ్చాక చెప్పారు నాన్న అసలు సంగతి...ఇక  నేను చచ్చిన ఈత కొట్టాను అని మల్లీ గోల మొదలు పెట్టాను....అప్పుడు నాన్న నాకు చాలా ధైర్యం చెప్పారు....
"You will always be my king నాన్న"
                           
ఇక మా నాన్నమ్మ ఆవకాయ అన్నం కలిపి అందరికి ముద్దలు పెట్టేది.... అసలే ఆకలితో ఆవురావురుమంటూ వచ్చిన మాకు ఆవకాయ అన్నం..ఇక వేరే చెప్పాలా...అమృతం అంటే ఇలానే ఉంటుందేమో అనుకునేదాన్ని....ఇక లంచ్ కూడా అయ్యాక....మా నాన్న పొలం పనులు చేస్కుంటుంటే నేను వెనకాలే తిరిగేదాన్ని...మా నాన్నకి పనిచేస్తున్నా radio ఉండాల్సిందే... "ఆడుతుపాడుతూ పనిచేస్తుంటే అలుపుసొలుపేమున్నది"...అని కాబోలు..... మా నాన్న ఏ సమయానికి ఎక్కడ పాటలు వస్తున్నాయో.. frequency కి ట్యూన్ చేస్తూ ఉండేవారు....మా నాన్న పని చేస్తున్నా అలా  radio పక్కన పెట్టుకుని whistle వేస్తూ చేసేవారు... ఈరోజు మనం ఉన్నాం కదా.... పని మనదన్నమాట...ఏమిటి??? whistle వేయటమా అనుకుంటున్నారా......ఛి  ఛి!!! మీరు మరీనండి బాబు....ట్యూన్ చేయటం నా పని అన్నమాట... ఇప్పటి పిల్లల్లాగా  బోర్ అనకుండా...ఏది వస్తే అదే వినేదాన్ని...ఇప్పుడు గుర్తుచేస్కుంటే నవ్వొస్తుంది కానీ...పిచ్చివాళ్ళలా  బాషలో కార్యక్రమాలు వచ్చినా  వినేవాళ్ళం....ఆదివారం అయితే మరీను.....పెద్దయ్య.... చిన్నమ్మ అంటూ ఏదో కార్యక్రమం, అప్పుడు నాకు అసలు అర్ధం అయ్యేది కాదు....అయినా బుద్ధిమంతురాలిలా చక్కగా వినేదాన్ని....ఇక బాలవినోదం  అయితే  మరీ ముచ్చటగా వినేదాన్ని..... "బాలబలికలమందరమూ బాలవినోదం విన్నాము వచ్చేవారం వద్దాము ఇక చెంగు చెంగు నా పోదాము"అని radio పాడుతుంటే...నేను కూడా చెంగు చెంగు  మని ఎగురుతూ మరీ dance వేసేదాన్ని....నాన్న పొలం పనులు చేస్తుంటే పొలం అంచున radio పట్టుకుని  నాన్నని చుస్తూ  కూర్చునేదాన్ని, ఎపుడైనా నాన్నా  నేను కూడా చేయనా అంటే..."వద్దు తల్లి నీ కాళ్ళకి మట్టి అంటుతుంది " అని నాన్న అన్నప్పుడు...' !! నాన్న  అయితే   ఏం చేయనివ్వరు అనుకునేదాన్ని'....ఎంత పిచ్చిమాలోకాన్నో నేను.....ఏంచేస్తాం "అర్రే మన కాలికి మట్టి కూడా అంటకుండా పెంచుతున్నారు" అని తెలుసుకోలేని వయసు....వెర్రితనం... ఇప్పుడు అర్ధం అవుతుంది....అమ్మాయిలని ఎంత గారాబంగా  పెంచుతారో తల్లిదండ్రులు....

అందుకేనేమో....ఎప్పుడు మా నాన్న కళ్ళల్లో నీళ్ళు చూడని నేను...."ధైర్యం అంటే నాన్నే"అనుకున్న నేను నా పెళ్లి రోజు నాన్న కళ్ళల్లో నీళ్ళు చూసా....

నిజానికి టపా నా చిన్ననాటి   పిల్ల చేష్టలు... చిట్టి చిట్టి జ్ఞాపకాలు పంచుకుందాం అనే ప్రారంబించాను....కానీ ఇప్పుడే అర్ధం  అవుతుంది ...నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ నాన్న చుట్టే తిరుగుతున్నాయ్ అని.... :)

16 comments:

  1. ఆర్ద్రతతో నిండిన టపా రాశారండి. పిల్లలు అందరూ తల్లితండ్రులు పడే కష్టాన్ని అర్ధం చేసుకుంటే వాళ్ళకి అంతకన్నా ఇంకేం కావాలి.

    ReplyDelete
    Replies
    1. అవును శ్రీనివాస్ రావు గారు...తల్లిదండ్రులు ఎం చేసినా పిల్లల మంచి కోరే చేస్తారు...అది పిల్లలు అర్ధం చేసుకోవాలి :)...ధన్యవాదములు

      Delete
  2. Kallu chemarchela chesaru kavya garu me tapa toti. Patha gnapakalu ani okasari gurthukostunayi. Chala baga rasaru

    ReplyDelete
  3. మీ జ్ఞాపకాలతో మేము మా జ్ఞాపకాలని తలచుకునేలా చేసారు. బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు పద్మ గారు :)

      Delete
  4. మీ తీపి జ్ఞాపకాలను పంచుతూ మా లోని జ్ఞాపకాలను మేల్కొల్పినందుకు అబినందనలు కావ్య గారు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు రమేష్ గారు :)

      Delete
  5. manam peddavallam ayyaka mana pillalaki cheppetappudu gurtostundi ,parents manalni entha baga pencharo .....chala baga rasaru :)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు.....నిజమే క్రాంతి గారు.....మా అబ్బాయి చేసే అల్లరి చూస్తుంటే అనిపిస్తుంది...మా తల్లిదండ్రులకి ఎంత ఓపిక ఉండేదో.....తల్లిదండ్రుల విలువ తెలుసుకోలేని వాడు మనిషే కాదు.....

      Delete
  6. chala baga rasaru andi prathi okarru valla parents gopathananni jeevethantham marchi povodhu vallu manalni entho kashtapadi penchutharu kani manam vallani vrudhapyam ragane patinchukovadam manestham ela chesevallu na drustilo manushule karu.

    ReplyDelete
  7. kaavya garu,chala chala bagundi mee chinnanati gnapakalu and mee nanna garu chala chala goppavaru,mimmalni kannanduku mee nanna garu,mee nanna lanti nanna vunnanduku meeru chala chala arvapadali

    ReplyDelete
    Replies
    1. Thank u so much for such a nice compliment and comment chaitanya sagar gaaru...

      Delete
  8. Replies
    1. హాయ్ ఫోటాన్ గారు,
      నా బ్లాగుకి స్వాగతం.....అభినందనలకి ధన్యవాదములు :)

      Delete

 

View Count




Useful Links