Pages

Wednesday 3 October 2012

25 ఏళ్ళ దాంపత్యంలో....చిన్న గొడవ కూడారాలేదా????


ఒక జంట 25వ పెళ్లి రోజు వేడుకలు జరుపుకుంతున్నారట....అయితే 25 ఏళ్ళ దాంపత్యంలో వాళ్ళకి  ఒక్క చిన్న గొడవ కూడా రాలేదని తెలుసుకున్న విలేకరి అక్కడికి చేరుకున్నాడట..

విలేకరి: సార్, నమ్మలేకపోతున్నా...అసలు ఒక చిన్న గొడవ కూడా లేకపోవటం అసలు ఎలా???ఎలా సాధ్యపడింది???

పెద్దాయన: వాళ్ళ హనీమూన్ రోజులు గుర్తుచేసుకుంటూ...మేము పెళ్లి అవగానే  హనీమూన్ వెళ్ళామయ్య ...అక్కడ గుర్రపు స్వారి చేద్దాం అనిపించి....ఇద్దరం ఒక్కో గుర్రం మీద  స్వారి మొదలెట్టాం....నా గుర్రం బానే ఉంది కానీ...మా ఆవిడ గుర్రమే కొంచెం పొగరుబోతు,తిక్క గుర్రం అనుకుంటా...దారిమధ్యలో దానికి ఏమోచ్చిందో ఏమిటో...ఒక్కసారిగా ఎగిరి మా ఆవిడని కింద పడేసింది....మా ఆవిడ పైకి లేచి సర్దుకుంది ....గుర్రాన్నీ నిమురుతూ..."ఇది మొదటిసారి" అని మళ్ళి స్వారి మొదలెట్టింది.....కాసేపటికి గుర్రానికి మళ్ళి  ఏమోచ్చిందో కానీ పడేసింది....మా ఆవిడ మళ్ళి గుర్రం వీపు తడుతూ "ఇది రెండో సారి" అని మళ్ళి స్వారి మొదలెట్టింది....ఇక గుర్రం మూడోసారి పడేయగానే....purse లో నుండి రివాల్వేర్ తీసి కాల్చి చంపేసింది ...
నేను గట్టిగా అరిచాను...'నీకేమైనా పిచ్చిపట్టిందా...పాపం దాన్ని అలా చంపేసావ్' అని...
తను నా వైపు చూసి "ఇది మొదటిసారి" అంది 
అంతే నాకు అర్ధం అయ్యింది.....(ఇక నేను తనని తానుగా స్వీకరించటం నేర్చుకున్నా) ...ఇక తరవాత మేము కలహం లేకుండా సంతోషంగా జీవించాం :)" 

నోట్ : నాకు వచ్చిన మెయిల్ ని ఇలా తెలుగు లోకి అనువదించి మీతో పంచుకుంటున్నా :)

24 comments:

  1. Replies
    1. నా బ్లాగుకి స్వాగతం జలతారువెన్నెల గారు :)

      Delete
  2. Replies
    1. మొదటిసారితోనే ఆగిపోయింది లాస్య గారు :)

      Delete
  3. కెవ్వ్వ్వ్వ్వ్వ్....

    ReplyDelete
    Replies
    1. కేక కదా సుభ గారు...నాకు కూడా చూడగానే అలానే అనిపించింది అందుకే మీ అందరితో పంచుకోవాలనిపించింది :) నా బ్లాగు కి స్వాగతం :)

      Delete
  4. తెలివైన భర్త ముఖ్యలక్షణం:-)

    ReplyDelete
    Replies
    1. అవును పద్మర్పిత గారు...అందుకే, నేను చదవగానే మా వారికీ forward చేసాను ...

      Delete
  5. Replies
    1. :) నా బ్లాగ్ కి స్వాగతం శ్రీ గారు :)

      Delete
  6. హ్హహ్హహ్హ...ఇలాంటిదే ఇంకోటి చదివానండి!! కానీ ఆ లింక్ గుర్తు లేదు. గుర్తొస్తే ఇక్కడ షేర్ చేస్తాను :)

    ReplyDelete
    Replies
    1. త్వరగా గుర్తుచేసుకుని share చేసేయండి మరీ :)

      Delete
  7. Simple and nice.. bavundi kavya garu. andaru ilage vunte ee prapancham lo sagam godavalu taggipotayi :)

    ReplyDelete
    Replies
    1. హహ్హహ్హ.... అవును వజ్రం గారు....:)

      Delete
  8. kavya garu me vari ki forward chesanu ani annaru ante indirect hecharika na me blog lo lady degara gun undhi kabati kalchindi so me degara kuda gun undha.

    ReplyDelete
    Replies
    1. adhi english mail andi...andhuke gun...nenu bharatha desapu mahilanu...atlakaada chaalu :P

      Delete
  9. "nenu bharatha desapu mahilanu...atlakaada chaalu :P" :) Meeru translate chesina joke kante mee comment baagundi!

    ReplyDelete
    Replies
    1. ప్రియ గారు....నా బ్లాగ్ కి స్వాగతం......నా కామెంట్ నచ్చినందుకు థాంక్స్ అండి :)

      Delete
  10. Mee blog Chaala Bagundi Kavya gaaru, Nenu mee blog ni iroje choosani. really meelo chaala vishayam vundandi. Meeru Nijamga naalo vunna chala allochanalni nidhura leputunnarandi. Keep it up. All the Best.

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగుకి స్వాగతం M.V.R.S.Sastry గారు, మీకు నా పోస్టులు నచ్చినందుకు థాంక్స్ ......ఏదో నాకు తోచింది రాస్తున్నాను....మీకు నచ్చి,మెచ్చినందుకు మరో సారి ధన్యవాదములు :)

      Delete
  11. super ma ,very very good super

    ReplyDelete

 

View Count




Useful Links