Pages

Wednesday 17 October 2012

దూరదర్శన్


ఇప్పటి పిల్లలకి చెప్తే ఒక 'cheap look'  ఇస్తారేమో కానీ....అప్పటివాళ్ళకు తెలుస్తుంది.....అప్పట్లో మా ఇంట్లో టీవీ ఉండేది.... రోజుల్లో టీవీ ఉండటం,అదీ పల్లెటూరిలో  అంటే చాలా గొప్ప విషయమే...EC tv ...లాంటి ఒక కంపెనీ/బ్రాండ్ ఉందని కూడా ఇప్పటివాళ్ళకి తెలియదేమో....కానీ మా ఇంట్లో టీవీ ఇంకా పని చేస్తోంది సుమీ!!! ఒకటి రెండు సార్లు దానికి కాస్త సుస్థి చేస్తే నాన్నగారు  ఏదో శస్త్ర చికిత్స చేయించాక కుదుటపడింది..
అయితే...ఇప్పటిలా అప్పుడు ఇన్ని చానల్స్ వచ్చేవి కాదు.... దూరదర్శన్ ఒక్కటే!!!! దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం 23 October,1977 లోనే నీలం సంజీవ రెడ్డి గారిచేత ప్రారంబించబడింది... కానీ నిరంతరంగా తెలుగు కార్యక్రమాలు వచ్చేవి కాదు.... నిజానికి 1996 తరవాతే వేరే తెలుగు చానల్స్ మొదలయ్యాయి......
                              
పేరు దూరదర్శన్ కదా దూరం నించే చూడాలి అనుకున్నారో ఏమిటో .....తాతగారు అసలు నన్ను టీవీ దరిదాపుల్లోకి వేల్లనిచ్చే వారే కాదు...తను స్విచ్ నొక్కితే...నేను,తమ్ముడు అల్లంత దూరాన కూర్చుని చూడాలన్నమాట... అందులో కూడా రోజంతా కార్యక్రమాలు వచ్చేవి కాదు....తెలుగులో అయితే వార్తలు...అదీ పావుగంటే... ఇంకా ఏవో కొన్ని కార్యక్రమాలు వచ్చేవి...కానీ నాకు అంతగా గుర్తులేవు కూడా...ఎందుకంటే నేను అంత ఆసక్తిగా చూసిన గుర్తేమి లేదు ......తంబురాలు..మృదంగాలు లాంటివి వాయించటం....బుర్ర కధలు చెప్పటం, ఒక అమ్మాయి అదే పనిగా భరతనాట్యం చేయటం..లాంటి కార్యక్రమాలు ఏవో వచ్చేవి....భరతనాట్యం మాత్రం బానే గుర్తుందండోయ్...ఎందుకంటే మా అమ్మ నువ్వు అలా డాన్సు నేర్చుకుంటే నీకు లాంటి నగలు చేయిస్తా అనేది...నేను అమ్మాయి నగలు చూస్తూ కూర్చునేదాన్ని...ఇక వారానికి ఒకరోజు..శుక్రవారం చిత్రలహరి అని ఒక  కార్యక్రమం...కొత్త సినిమా పాటలు వచ్చేవి...౩౦ నిముషాలు వచ్చే కార్యక్రమం కోసం వారం ఎదురుచూసేవాళ్ళం.....
  ఇక మా అమ్మ  అయితే  చెప్పనేవద్దు బాబు....శుక్రవారం రోజు ఉదయాన్నే లేచి చకచకా  చకచకా పనులు ముగించి....సాయంత్రం చిత్రలహరి వచ్చినప్పుడు తినటానికి పలహారాలు తయారు చేసేది.....అబ్బా ఎప్పుడో సాయంత్రం వచ్చే చిత్రలహరికి ఉదయం నుండే వంటలా ..మరీ విడ్డూరం కాకపోతే....వింటున్నాం కదా అని పిల్ల చెప్తూనే పోతుంది అనుకునేరు....మీరు నమ్మి తీరాలంతే.. ఎందుకంటే...నమ్మకం నమ్మకం నమ్మకం....నమ్మకమే లేకుంటే బ్రతుకేది.....జెమిని టీవీ చూడరు???...ఏమిటండి మీరు??? హరిశ్చంద్రుడి తోబుట్టువులాంటి దాన్ని నన్నే నమ్మకపోతే ఇంకేవారిని నమ్ముతారండి బాబూ!!!!!!
                                     ఇక పిండివంటలు ఫలహారాల విషయంలోకి వస్తే....మా ఇంట్లో వాళ్ళ మట్టుకే అయితే...పొద్దున్నించు చేయవలసిన పనేముంది కాని రోజు శుక్రవారం...అంటే చిత్రలహరి....మా పక్కింటివాళ్ళు....మా అత్తలు(మా నాన్న బాబాయిల అమ్మాయిలు) అందరు వస్తారుగా...అందుకన్నమాట...కార్యక్రమం మొదలయ్యే గంట ముందు నుండి ఇల్లంతా ఒకటే హడావుడి..ఇల్లంతా చాపలు వేసి సిద్ధంగా ఉంచేవాళ్ళం...ఏదో పండగ వాతావరణం కనిపించేది...ఆదివారం కూడా ఇంచుమించు ఇలానే ఉండేది... రోజు సినిమా  వచ్చేదిలెండి....అంటే తెలుగులో అనుకునేరు... బాషలో వచ్చినా చూసేవాళ్ళం(షేం టు షేం radio లానే)...ఇక చిత్రలహరి వస్తున్నంత సేపు నిశబ్ధం...పోరాపాటున నోరు తెరిచామా ఇక అంతే సంగతులు ...కళ్ళు ఆర్పకుండా చూసేవాళ్ళం..ఇక  పుణ్యకాలం కాస్త గడిచి...కార్యక్రమం అయిపోయాక...."చిరంజీవి భలే డాన్సు వేసాడు కదా...రాధా బాగా  లావయ్యింది కదా వదినా..శ్రీదేవి భలే అందంగా ఉంటుంది.. అబ్బ!!! భానుప్రియ కట్టినలాంటి చీరే నా దగ్గరా ఉంది తెలుసా  అక్కా" ఇలా కాసేపు discussion అయ్యాక.. ఇక ఆదివారం సినిమా తెలుగులో వస్తే బాగున్ను అని దేవుడికి మొక్కుకుంటూ...వచ్చే ఆది వారానికి,మళ్లీ శుక్రవారానికి  ఏం పలహారాలు చేయాలో మా అమ్మ...వాళ్ళ ఇళ్ళనుండి  ఏం పట్టుకురావాలో  మా అత్తలూ ఆలోచించుకుంటూ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెల్లిపోయేవాళ్ళు....ఇక మేము కూడా ఆదివారం కోసం ఎదురుచూసేవాళ్ళం...

ఇప్పటి పిల్లలైతేనా...ఒక క్షణం కేబుల్ పోతే..... కేబుల్ వాడిని నానా బూతులు తిట్టి...అమ్మ సారి వాడు వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వకు....ఇప్పుడు ఫోన్ చేసి వాడిని తిట్టు అని నానా గోల చేస్తారు...

కానీ రోజుల్లో కూడా దూరదర్శన్ లో పిల్లలకి కాస్త పర్లేదండి....నాకు బాగా గుర్తు రామాయన్మోగ్లి /జంగల్ బుక్మాల్గుడి డేస్హి-మాన్విక్రం ఔర్ బెతాల్పొట్లి బాబా కిచార్లీ చాప్లిన్  .....అని చిన్నపిల్లల కార్యక్రమాలు వచ్చేవి.... మహాభారత్ కూడా వచ్చేది. ....మా అమ్మ తిడుతుంటే ఇప్పటికి మేము అదే background score  వాడుతుంటాం....."మహాభారత్.... మహాభారత్..మహాభారత్ " అంటూ.....కాకపోతే ఇవన్ని హిందీ లోనే వచ్చేవి...
కానీ మాల్గుడి డేస్లో కానీయండి విక్రం ఔర్ బెతల్ లో కానీయండి ఎంత నీతి ఉండేదో.... ఇప్పటి కార్టూన్ లో అయతే ఒకటే గోల.....ఒక్కోసారి వాళ్ళు  మాట్లాడేది  తెలుగేనా అని డౌట్ కూడా వచ్చేలా.. మా ఇంట్లో  అయితే  ఎప్పుడూ అదే గోల...."నోబితా.... డోరేమాన్...జియాన్.. సుజుక... "అంటూ.. కార్టూన్ గురించి తెలియని వాళ్ళు అయితే నోబిత అనే పేరుతో మా ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అనుకుంటారు.... 

అప్పట్లో వచ్చే కొన్ని కార్యక్రమాలు చూడటానికి కూడా  మేము అమ్మ అనుమతి అడిగి మరీ చూసేవాళ్ళం...కళ్ళు పాడైపోతాయ్ అని చూడనిచ్చేవారు కాదు ఎక్కువగా.....
ఇప్పుడైతే ఎన్ని కార్టూన్ చానేల్సో.......ఇప్పటి పిల్లలకి 24 గంటలు అదే పని ... నా కొడుకైతే వేలెడంత లేడు కానీ....వాడు కార్టూన్ చూస్తున్నప్పుడు ఛానల్ మారిస్తే గయ్యిమని లేస్తాడు....ఎప్పుడు మీరే చూస్తారా... కావాలంటే  నువ్వు వేరే టీవీ కొనుక్కో అనీ...


14 comments:

  1. Nostalgia !!!
    మా ఇంట్లో TV ఉన్నా కూడా మేము శుక్రవారం వస్తే మా పక్కింటివాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళది కలర్ TV :)

    ReplyDelete
    Replies
    1. one more funny incident i forgot to mention is...antenna adjust చేయటం.......మంచి experiences :)....i miss those days... ఫస్ట్ కామెంట్ !!!!!Thank you Srinivasarao gaaru :)

      Delete
  2. ur post took me back to those beautiful days..nice post

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం అను గారు...నా మొదటి పోస్ట్ రోజే మీరు ఇక్కడికి వచ్చినా...ఇదే మీ ఫస్ట్ కామెంట్....Happy for that :)...Thank u :)

      Delete
  3. గ్రేట్ కో ఇన్సిడెంట్స్ లో ఇదీ ఒకటేమో... ఇంట్లో కూడా EC కంపెనీ టీవీ నే ఉండేది...దాని లోగో కూడా ఇప్పటికీ నాకు స్పష్టంగా గుర్తుంది...మాది అనంతపురం, మానాన్న బెంగుళూరు కు వెళ్లి ఆ టీవీ తెచ్చారు...బ్లాక్ అండ్ వైట్ మీడియం సైజ్...ఆ తర్వాత 2000 లో ఆ టీవీ అమ్మేశారు, అప్పుడొచ్చింది మా ఇంటికి కలర్ టీవీ....ఈటీవీ, జెమినీలు మా ఊరికి అప్పటికే పరిచయం...కానీ డీడీ వన్ మాత్రం నాకు ఫేవరేట్...భమిడిపాటి రామగోపాలం కథలు, సోమవారం సోమవారం వచ్చే నాటిక(ఒకే సెట్టింగ్ వేదికగా నడిచే అరగంట ప్రోగ్రామ్...) ఇక జెమినీ విషయానికి వస్తే...ప్రేమి, ప్రియసఖి, యండమూరి తులసీదళం, భూం భూం షకలక, మంత్రజాలం...ఇవన్నీ బాల్యపు గురుతులుగా మిగిలి ఉన్నాయి...బాలచందర్ మర్మదేశం సీరియల్ చూస్తుంటే ఒళ్లు మరచిపోయే వాళ్లం...ఇప్పుడు ఆ సీరియల్ తమిళ వెర్షన్ యూట్యూబ్ లో దొరకుతుంది...మీ పోస్టులో EC టీవీ అని చదవగానే ఒక్కసారి పది హేనేళ్ల వెనక్కు వెళ్లొచ్చాను...థ్యాంక్స్ ఫర్ పోస్టింగ్....

    ReplyDelete
    Replies
    1. నా బ్లాగ్ కి స్వాగతం జీవన్ గారు.....మా EC టీవీ కాలరే నండి...అయిన కూడా తర్వాత videocon కొన్నారు....కానీ Ec టీవీ అమ్మలేదు.....నేను ఎక్కువగా Ec లోనే చూస్తాను....నేను పుట్టినప్పుడు కొన్నారట అందుకేనేమో ఏదో attachment ...హహ్హ ....నేను కూడా తులసీదళం..మర్మదేశం..Etv లో వచ్చేది రహస్యం అని....బాగా చూసేదాన్ని :)....మీ కామెంట్ కి ధన్యవాదాలండి :)

      Delete
    2. కనుమరుగు అయ్యింది కేవలం EC టీవీనే కాదు మేడమ్...అప్పట్లో వీసీపీ (వీడియో క్యాసెట్ ప్లేయర్) అని ఉండేవి....90'S లో గ్రామీణ భారతాన్ని ఊసేశాయి అవి...వంశీ 'ఏప్రిల్ ఒకటిన విడుదల' సినిమాలో క్యాసెట్ రెంట్ కు ఇచ్చే షాపు కాన్సెప్టునే హైలెట్ చేశాడు...అలాంటి వీసీపీ మా ఇంట్లో కూడా ఉండేది...సినిమాలన్నీ క్యాసెట్ల రూపంలో ఒక టీవీ బాక్సుకు ఉండేవి...ఇప్పుడు వీసీపీ అంటే అదేంటి అని అడుగుతున్నారు. రోజ, మామగారు, గ్యాంగ్ లీడర్, బొంబాయి,గీతాంజలి,మౌనరాగం, చంటి, వంటి క్యాసెట్ క్లాసిక్స్ మా ఇంట్లో లెక్కకు మించిననన్ని సార్లు ప్లే అయ్యాయి. ఆ సినిమాలను పదే పదే చూసి సినిమాలంటే అలాగే ఉండాలి...అనే ఆటిట్యూడ్ చిన్నప్పటి నుంచి అలవాటు అయ్యింది. ఇలాంటివి చెప్పడానికి ఇంతకు మించిన వేదిక ఉండదని చెబుతున్నానంతే...యాంటెన్నా సెట్ చేయడం అప్పట్లో గొప్ప ఎక్సర్ సైజ్....

      Delete
    3. ఆలస్యంగా రిప్లై ఇస్తున్నందుకు క్షమించండి జీవన్ గారు.....అవునండి...నాకు కూడా ఆ జ్ఞాపకాలు ఉన్నాయ్....మేము కూడా రెంట్ కి తెచ్చుకు చూసేవాళ్ళం.....అలా విసిపి తెచ్చుకుని చూసిన ఆకరి సినిమా మాతృదేవోభవ అండీ...ఆ సినిమా చూసి మా అమ్మ,పిన్ని ఏడిచేసి...కళ్ళు వాచిపోయి....తలనెప్పి వచ్చి ఆ రోజు వంట చేయలేదు.....ఇక ఆ తర్వాత మళ్లీ విసిపి మొహం చూడలేదు నేను :)

      Delete
  4. Nenu puttinde 90 lo nandi. Maa intlo naaku 17 vachhenta varaku asalu TV pakkake ponivvaledu. Dongathanamgaa intlo yevvaro lenapudu akkaa nenu choodadame. So naaku ee anubhavaalu levu. Kaani mee post chaduvuthunte "ayyo miss ayyane" anipinchindi. Baaga raasaaru mee good old days gurinchi :)

    ReplyDelete
    Replies
    1. అయ్యో!!!! అయితే మీరు చాలా మిస్ అయిపోయారు ప్రియ గారు.....Thanks for the comment :-)

      Delete
  5. baga rasaru malli patha gnapakalu gurthu chesinandhuku thanks kavya garu....naku chinnapudu baga nachina serials gaint robot, spider man, star treak, he-man inka list cahala ne undhi nenu TV chudataniki ma ammamma valla intiki vellevadini 1KM naduchukuntu valla intlo kuda EC TV ne undedhi inka ma ammavalla intlo TV leni time lo pakan intlo vall window lo nunchi chusevadini inka kondharu aithe sundy telugu cinema chudataniki 50 paise money kuda thiskunevallu idhi antha 80's lo annamata....

    ReplyDelete
    Replies
    1. మీ కామెంట్ కి ధన్యవాదాలండి.....కిటికిలో నుండి చూడటం....టీవీ చూడటానికి డబ్బులు కూడా ఇవ్వటం....బాగున్నాయండి మీ అనుభవాలు :)...నా టపా మీకు నచ్చినందుకు సంతోషం :)

      Delete
  6. Ma intlo aite uptron tv.eppatiki adi pani chestundi,but edi color tv yugam kada.anduke ee yugam ki shift aipoyam.naku kuda vunnay antenna sari chesina anubhavalu kavya garu. Chala bagundi mee post

    ReplyDelete
    Replies
    1. హాయ్ చైతన్య సాగర్ గారు, నా పోస్ట్ నచ్చినందుకు థాంక్స్ :).....మారక తప్పట్లేదులెండి...బాగుండేవి కదండి antenna సరిచేసే అనుభవాలు..especially cricket match unnappudu...:)

      Delete

 

View Count




Useful Links